నా పేరు నాయని ఆదిత్య మాధవ్.
నేను కొంచం వెరైటీ అని అందరూ అంటారు , వాళ్ళంతా కామన్ గా వున్నారు అందుకే నేను వెరైటీ అనుకుంటాను. ఇకపోతే నా బ్లాగ్ పేరులోనే వుంది కదా క్రియేటివ్ అని ఏదో ఆ creativity కొంచం వుందని నా అబిప్రాయం. ఈ బ్లాగులో మీతో చాలా విషయాలు పంచుకుందాం అనుకుంటున్నాను. నాకు visual ఎఫ్ఫెక్ట్స్ అంటే పిచ్చి. సినిమా అంటే ప్రాణం, తెలుగు భాష అంటే అభిమానం, కొన్ని చిన్న చిన్న కథలు, స్క్రిప్ట్స్ రాస్తున్నాను కూడా , ప్రేమను పది మందికి పంచడం ఇష్టం కాకపోతే అది పొందడం నాకు కొంచం కష్టం అనుకోండి (కొన్ని విషయాలలో మాత్రమె) . నేను పుట్టింది శ్రీ రామ దివ్యక్షేత్రం భద్రాచలం లో . మా నాన్న గారి వృత్తి రీత్యా ఆంధ్ర ప్రదేశ్ లోని ౩ ప్రాంతాలు తిరిగాను. భద్రాచలం తో మొదలైన నా ప్రయాణం ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఆగింది. ఈ మధ్యలో కాకతీయుల ఓరుగల్లు లో , రాజన్న చలువతో కరింనగరంలో , వేదంలా ఘోషించే గోదావరి వొడ్డున వున్నా రాజమహేంద్రి లో , రతనాల రాయలసీమ తోరణం కర్నూలులో , నేను పుట్టిన పావన భద్రాద్రి లో (నా ఉన్నత చదువు ఇక్కడే) నా ప్రయాణం సాగింది. నేను చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేదు. దేని దారి దానిదే అని నా ఫీలింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్భో చాల వుంటై అవన్నీ మీతో పంచుకోడానికే ఈ బ్లాగ్. మీ విలువైన సలహాలు, సూచనలు , అభిప్రాయలు తెలియజేస్తారని ఆశిస్తూ..
మీ
నాయని ఆదిత్య మాధవ్ ( క్రియేటివ్ కుర్రోడు)