Showing posts with label మీకు తెలుసా... Show all posts
Showing posts with label మీకు తెలుసా... Show all posts

Thursday, September 3, 2015

కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని-7



*భారత రక్షణ వ్యవస్థ సర్వ సైన్యాధ్యక్షుడు అయిన రాష్ట్రపతి యుద్ధ ప్రకటన, సంధి ప్రకటన చేస్తారు.

*17వ శతాబ్దంమొఘల్ సామ్రాజ్యం కాలంలో ఢాకా నగరానికి "జహాంగీర్ నగర్" అని పేరు.

*23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.

*ఈనాడు “బ్రిటిష్ దీవులు" అని పిలచే భూభాగంలో పూర్వం ఐదు రాజ్యాలు ఉండేవి.

*హిందూ మహా సముద్రం పరిమాణం 292,131,000 క్యూబిక్ కిలోమీటర్లు (70,086,000 మైళ్లు)గా అంచనా వేశారు.

*దంతం "డెంటయిన్" అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఇది ఎముక కంటే గట్టిగా ఉంటుంది.

*బ్రిటీష్ పాలనలో దేశం ఉన్న స్థితిలో తెలుగువారిలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి "ఆంధ్రపత్రిక" ఉపకరించింది.

Friday, January 2, 2015

కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని-6




-- ప్రపంచంలోనే అత్యధికంగా తపాలా కార్యాలయాలు కలిగినది మన దేశం

-- ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు

-- కాశ్మీరు ప్రాంతాన్ని గురించి వ్రాసిన గ్రంథాల్లో అత్యంత ప్రాచీనమైనది రాజతరంగిణి

-- చైనాలో చాన్‌గా అభివృద్ధి చెందిన మహాయాన బౌద్ధమత విభాగం జెన్

-- వివిధ మతావలంబికుల దర్శన స్థలం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం

Monday, February 4, 2013

ఎండ్రకాయ దినం! (Cancer Day)

క్యాన్సర్‌కు ఆయుర్వేద చికిత్స
Article by
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, అడిషనల్ డెరైక్టర్ (రిటైర్డ్), 
(ఆయుర్వేద) ఆయుష్, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, ఎన్‌ఎమ్‌డీసీ దగ్గర, హైదరాబాద్

సందర్భం - నేడు - వరల్డ్ క్యాన్సర్ డే (FEB 4)
ఆయుర్వేదంలో ప్రాచీనవైద్యుడు చరకమహర్షి నిరూపించిన విషయం: శరీరంలోని ఏ అవయవానికైనా, ఏ భాగానికైనా మూలం కంటికి కనబడని సూక్ష్మాతిసూక్ష్మమైన, అసంఖ్యాకమైన పరమాణు సముదాయమే. (శరీరావయాస్తు పరమాణు భేదానం ఆపరిసంఖ్యేయా భవంతి, అతిబహుత్వాత్, అతి సౌక్ష్మాత్, అతీంద్రియ త్వాత్ చ). ఇలాంటి పరమాణువుల స్వభావ క్రియ భేదాల వల్ల సప్త ధాతువులైన... రస, రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జా, శుక్రాలు’, వాటి తో పాటు వివిధ స్రోతస్సులు ఉత్పత్తి కాబడ్డాయి. 

క్యాన్సర్ అనే పదానికి అర్థం ‘ఎండ్రకాయ’ (కర్కాటకం). నిశ్శబ్దంగా దొలిచి దొలిచి ధ్వంసం చేయడానికి ఇది పెట్టింది పేరు. వ్యాధి స్వభావాన్ని బట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఇలాంటి స్వభావం గల వ్యాధులు ఆయుర్వేదంలో చాలా వాటిని వర్ణించారు. ఈ వ్యాధి సోకిన ధాతువును బట్టి, స్రోతస్సును బట్టి, అవయవాన్ని బట్టి, భాగాన్ని బట్టి పేరు మారుతుంటుంది. పైన చెప్పిన వాటిలో దేనికి సంబంధించినవైనా కొన్ని అణువులు ‘నివారింపశక్యంకాకుండా, అవాంఛితంగా పరిమాణంలో పెరిగిపోతుండటమే’ ఈ వ్యాధిలో జరిగే ప్రక్రియ. అణువిభజనకు వాతం (న్యూక్లియస్ కర్మలు), పచింపబడటానికి పిత్తం (మైటోకాండ్రియా కర్మలు), పోషణకు కఫం (ప్రోటోప్లాజం కర్మలు) కారణంగా నిలుస్తాయి. 

కొన్ని వ్యాధుల పేర్లు
తీవ్రస్థాయికి చేరిన అర్బుద, గ్రంథి, అపచి, గండమాల మొదలైనవి. అర్బుదాలు (కణుతులు), తాలువు, నాలుక, ముక్కు, చెవి, రొమ్ముల్లో కూడా పుడతాయని వాగ్భటాచార్యులు ప్రత్యేకంగా చెప్పారు. అదేవిధంగా ఉపద్రవస్థాయికి చేరిన రస మరియు రక్తవహస్రోతో దుష్టి లక్షణాలే ఈ నాటి బ్లడ్‌క్యాన్సర్లు. 

వ్యాధికి కారణాలు
అసలు కారణం స్పష్టంగా తెలియదు. వాతపిత్తకఫాల ప్రాకృత కర్మలను చెడగొట్టే ఆహార విహారాలు, ధూమ, మద్యపానాలు, ఇతర మాదకద్రవ్యాలు, విపరీతమైన మానసిక ఒత్తిడి కారణాల్లో కొన్ని. ప్రస్తుతం సమాజంలో 90 శాతం ఆహారపదార్థాలు, పాలు, తినుబండారాలు, నూనెలు, పండ్లు సమస్తం కల్తీయే. ఇది కూడా ఈ ‘కర్కశకర్కాటకాని’కి కారణమే. 

చికిత్స
వ్యాధి తీవ్రతను బట్టి ‘ప్రవర, మధ్యమ, అవర’ అని విభజించబడింది. ప్రవరావస్థలో ఫలితాలు బాగుంటాయి. ఆయుర్వేదం కేవలం రోగవ్యతిరేక చికిత్స మాత్రమే కాకుండా రోగికి బలవర్థకమైన ‘రసాయన’ చికిత్స, అవసరాన్ని బట్టి శోధన (పంచకర్మ) చికిత్స, శస్త్రచికిత్సతో పాటు రోగం సోకిన భాగాన్ని బట్టి ఎన్నో ఔషధాలను విశదీకరించింది. 

కొన్ని ముఖ్య ఔషధాలు 
ఏకద్రవ్యాలు: 
భల్లాతకీ (నల్లజీడిగింజ) 
అమృతా/గుడూచీ (తిప్పతీగె) 
చిత్రక (చిత్రమూలం) 
హరిద్రా (పసుపు) 
అశ్వగంధ (పెన్నేరుగడ్డ) ప్రధానమైనవి. 

ఇతర ఏకమూలికలలో: శిరీశ్రీ (దిరిసెన), సీతాఫల, తులసి, మారేడు, తమలపాకు, లశున (వెల్లుల్లి), నేల ఉసిరిక (భూమ్యామలకి), కటుకరోహిణి, బ్రాహ్మీ, శతావరీ (పిల్లిపీచర), అశోక, మంజిష్ఠ, దుగ్ధిక, త్రిఫలాలు (కరక్కాయ, తానికాయ, ఉసిరి), పాషాణభేది (కొండపిండి) మొదలైనవి చాలా చెప్పబడ్డాయి. 

మిశ్రమ ఔషధాలు: 
భల్లాతకీ లేహ్యం 
అమృత భల్లాతకీ లేహ్యం 
అగస్త్యరసాయనం 
అశ్వగంధాది లేహ్యం 
చిత్రకహరీతకీ రసాయనం 
ఆమలకీ రసాయనం 
గుడూచీసత్వం మొదలైనవి. 

గమనిక: రోగి బలాన్ని, వ్యాధి సోకిక భాగాన్ని, అవయవాన్ని బట్టి ఏ ఔషధం, ఏ రూపంలో, ఎంతకాలం వాడాలో ఆయుర్వేద నిపుణులు నిర్ణయించి, పర్యవేక్షించాలేగాని, బైరాగి చిట్కాలు, సాధువుల వైద్యాలు క్యాన్సరును పోగొట్టలేవు. అలాంటి ప్రకటనలకు మోసపోవద్దు. 

ఆయుర్వేద మార్గంలో నివారణ
బాల్యం నుంచి శాస్త్రబద్ధంగా కల్తీలు లేని, బలవర్ధకమైన సాత్వికాహార సేవన ఆవునెయ్యి, నువ్వుల నూనె రోజూ రెండేసి చెంచాలు సేవించాలి 

పాలు, పెరుగు, వెన్నలు ఆవువైతేనే శ్రేష్ఠం. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి 

పరిమిత వ్యాయామం, జీవితాంత ప్రక్రియగా భావించి, ప్రతిదినం చేయాలి 

దూమ, మద్యపానాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి 

రాత్రి కనీసం ఏడు గంటలు నిద్రించి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి 

మానసికారోగ్యం కాపాడుకోవడం ప్రధానం. కాబట్టి సంతోషం, శాంతం, ఉత్సాహం, కారుణ్యం వంటి లక్షణాలను అనుసరించాలి. (తనకోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష). వీటిని ఆయుర్వేదంలో ‘ఆచార రసాయనా’లంటారు 

ఉసిరికాయరసం రోజూ రెండు చెంచాలు తాగాలి లేదా త్రిఫలా చూర్ణం రోజూ ఒక చెంచా తేనెతో 
పది తులసి ఆకులు, ఐదు మారేడు ఆకులు నమిలి తినాలి .ఏదో ఒక తాజా ఫలం ప్రతిరోజూ తినాలి.

Dedicated to all Cancer Survivors in the world
in public interest by BHADRASIMHA
Article in Sakshi Newspaper webpage


Monday, October 10, 2011

కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని-5

--> రష్యా దేశ జాతీయ క్రీడ చదరంగం (చెస్)

--> మన దేశంలో సుమారు 1,16,000 రైల్వే వంతెనలు ఉన్నాయి!

--> మానవుడు 10,000ల రకాల వాసనలు గుర్తించగలడు!

--> నీటిలో కరగని వాయువు హైడ్రోజన్ (Hydrogen)

--> ఆరుద్ర అసలు పేరు భాగవతుల శివశంకర శాస్త్రి

Sunday, October 9, 2011

ఈ టపాలు తప్పక చూడండి! 2

బ్లాగు ప్రపంచంలో ఎన్నో టపాలు ,
అందులో కొన్ని మనకి నచ్చుతాయి కొన్ని మనసుకు హత్తుకుంటాయి,
అలాంటి వాటిలొ కొన్ని టపాలు మీతో ఇక్కడ పంచుకుందామని ఉంచాను,
అవి మిమ్మల్ని తప్పక అలరిస్తాయి, ఆలొచింపజేస్తాయి అని ఆశిస్తున్నాను ..
బ్లాగు రచయితల అనుమతి లేకుండా పెడుతున్నందుకు మన్నించగలరు


టపా పేరు: దీపారాధన
బ్లాగు రచయిత: గాయత్రి

టపా పేరు: అవినీతికి వ్యతిరేకంగా
బ్లాగు రచయిత: శరత్ చంద్ర

టపా పేరు: సినిమా డాక్టర్లు
బ్లాగు రచయిత: రమణ

టపా పేరు: అమ్మలేని ప్రపంచం

టపా పేరు: మనందరికీ ఉండాల్సిన సామాజిక స్పృహ
బ్లాగు రచయిత: ప్రవీణ


ధన్యవాదములు
క్రియేటివ్ కుర్రోడు మాధవ్

Saturday, August 20, 2011

నేలపై నిలుచున్న బుద్ధుని ఆకారం!

ఇది నా 100వ పోస్ట్ ప్రచురణ
This is my 100th Post of this blog:

ఉపగ్రహ చాయచిత్రం నుండి ఈ ఫోటో సంగ్రహించబడింది.

మన రాష్ట్రం లోని విజయనగరం జిల్లా
కొత్తవలస మండలంలోని
లంకవానిపాలెంలో గల గుహలింగేశ్వరుని గుట్ట వద్దనున్న ఒక చిన్న నీటి తటాకం నిలుచుని ఉన్న బుద్ధ ప్రతిమ రూపంలో నాకు అనిపించింది, బహుశా మీకు కూడా అలా అనిపిస్తుందని ఆశిస్తున్నాను.

నేలపై నిలుచున్న బుద్ధుని ఆకారం!
Note: courtesy wikimapia maps, click on the image for larger view

Monday, July 18, 2011

కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని-4



-->;శ్రీ నరసింహస్వామికి మన రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి..
(దాదాపు 1000 దాకా ఉన్నాయి)

-->;అస్సాం రాష్ట్ర సాంప్రదాయ నృత్యం పేరు బిహు(bihu)


-->;ప్రపంచంలో అతి పురాతనమిన జబ్బు కుష్టు వ్యాధి


-->;మన దేశంలో 21 హై కోర్టులు ఉన్నాయి


-->;ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడే బాష మాండరిన్ (mandarin)

Wednesday, December 8, 2010

చెప్పుకోండి చూద్దాం! 3

ఈ క్రింది ఫోటోలలో ఉన్న వారిని వరుసక్రమంలో గుర్తించి వ్యాఖ్యల్లో పెట్టండి,
ఇది ఒక సరదా ప్రయత్నం మాత్రమే :)


1.

2.

3.

4.

5.

Sunday, October 10, 2010

TOP-10 విశేషాలు

ప్రతీవిషయంలోను మనం మొదటి మూడు స్థానాలు ముఖ్యముగా చూస్తాం
ఆ తర్వాత 1 నుంది 10 వరకు చూస్తాం,
అలా భారత దేశం లోని కొన్ని TOP-10 విశేషాలు...

Top 10 సంపన్ననగరాలు (wealthiest cities):



Top 10 TV ఎక్కువగా చూసే నగరాలు (cities with higher exposure to TV):



Top 10 trains of India:


Enjoy the Rajasthani Culture in this Royal Carnage as you go places....

Have a touch and feel of the Gujarati Culture and places in this heritage train.....

A perfect combo of Royal Carnage and Wildlife Sanctuary, enjoy the ride.....

Royal Palaces, coaches and the golden beaches with the royal comforts....

See the South Indias best tourist attractions along the Royal Comforts ....

See the Indian Unesco World Heritage Sites with the comforts of a King.

See the Shekhawati Region of Rajasthan in this Royal Carnage .....

This Tiny train takes you on a memorable ride of Darjeeling Hills.

A little Hill Station, a tiny train and the tea Bagans, there cannot be anything better....

All the Buddhist Religious places covered in one voyage.

Top 10 Beaches of India:

1. Anjuna Beach - Panaji, Goa
2. Colva Beach - Goa
3. Baga Beach - Goa
4. Kovalam Beach - Kerala
5. Lakshadweep Beaches
6. Marina Beach - Chennai, TN
7. Andaman Islands Beaches
8. Rushikonda Beach - Vizag, AP
9. Calangute Beach - Goa
10. Marari Beach - Kerala


Top 10 Lakes of India:

See the Pushkar Lake in the holy place of Pushkar.....

See the beautiful lake Pichola in the land of Lakes, Udaipur....

A lake in the Himalayas, can anything be beautiful than this ....

See the lake made by river water and not by ice of melted Himachal Hills....

The most famous Lake of Srinagar welcomes tourists in its House Boats...

With Mc Leod Ganj near to it, it becomes a hot spot for tourists...

There isn't a beautiful man made lake than this.

Made by the Nizam, lived by people, its a beautiful lake ....

The most beautiful lake of Orissa, its the one which will make you sit by its side.....

Connecting Agartala, Udaipur and Gomti River, Dumboor is beautiful in its own way....

Top 10 cities of India Population-wise:

1. Mumbai
2. Kolkata
3. Delhi
4. Chennai
5. Hyderabad
6. Bengaluru
7. Ahmedabad
8. Pune
9. Surat
10. Kanpur

Details taken from different statistical websites on internet.. :)

Saturday, October 9, 2010

ఈ టపాలు తప్పక చూడండి!

బ్లాగు ప్రపంచంలో ఎన్నో టపాలు ,
అందులో కొన్ని మనకి నచ్చుతాయి కొన్ని మనసుకు హత్తుకుంటాయి,
అలాంటి వాటిలొ కొన్ని టపాలు మీతో ఇక్కడ పంచుకుందామని ఉంచాను,
అవి మిమ్మల్ని తప్పక అలరిస్తాయి, ఆలొచింపజేస్తాయి అని ఆశిస్తున్నాను ..
బ్లాగు రచయితల అనుమతి లేకుండా పెడుతున్నందుకు మన్నించగలరు.

టపా పేరు: ఏడుపు
బ్లాగు రచయిత: రాజన్

టపా పేరు: వ్యక్తిగత వికాసం
బ్లాగు రచయిత: కొత్త పాళీ

టపా పేరు: నేడు
బ్లాగు రచయిత: శరత్ చంద్ర

టపా పేరు: తుదినేస్తం
బ్లాగు రచయిత: పరిమళం

టపా పేరు: ఆ నలుగురు ఏరీ??
బ్లాగు రచయిత: ఝాన్సీ

టపా పేరు: తులసి - సంజీవని
బ్లాగు రచయిత: monkey 2 man


ధన్యవాదములు
క్రియేటివ్ కుర్రోడు మాధవ్

Friday, June 18, 2010

చెప్పుకోండి చూద్దాం! 2

ఈ క్రింది ఫోటోలలో ఉన్న వారిని వరుసక్రమంలో గుర్తించి వ్యాఖ్యల్లో పెట్టండి,
ఇది ఒక సరదా ప్రయత్నం మాత్రమే :)

1.

2.

3.

4.

5.

Tuesday, February 9, 2010

కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని-3


--> సగటున మనిషిలో ఐదున్నర లీటర్ల రక్తం ఉంటుంది!

--> చైనా రాజధాని బీజింగ్ నగర పూర్వనామం " పెకింగ్"

--> సొరచేప(shark) గంటకి 64 కి. మి వేగంతో ఈదగలదు!

--> కంప్యుటర్ బాషలో ఒక టెరా బైట్(TByte) అంటే 1099511627776 బైట్లు(Bytes)

--> జింబాంబ్వె అంటే అర్థం "గొప్ప రాతి ఇళ్ళ ప్రదేశం" అని

Tuesday, December 15, 2009

చెప్పుకోండి చూద్దాం!

ఈ క్రింది ఫోటోలలో ఉన్న వారిని వరుసక్రమంలో గుర్తించి వ్యాఖ్యల్లో పెట్టండి,
ఇది ఒక సరదా ప్రయత్నం మాత్రమే :)

1.

2.

3.

4.
5.

6.

7.

8.

9.

10.

Saturday, November 21, 2009

కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని-2


-->సప్తస్వరాలకు అర్థాలున్నాయి అవి ఇదిగో:
స - సడ్జమం
రి - రిషభం
గ - గాంధారం
మ - మధ్యమం
ప - పంచమం
ద - దైతం
ని - నిషాదం

-->కందుకూరి వీరేశలింగం గారికి "గద్య తిక్కన" అనే బిరుదు కలదు.

-->"ఉత్కళ్" అని ఒరిస్సా తీర ప్రాంతాన్ని పిలుస్తారు.

-->మెడగాస్కర్(Madagaskar)కి లవంగాల దీవి(island of cloves) అని పేరు.

-->భారత దేశ చరిత్రలో ప్రప్రథమ చక్రవర్తి - మహాపద్మనందుడు

-->మన దేశంలోని సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలలో రైలు మార్గాలు లేవు.

-->మొత్తం భూ ఉపరితలం 509,700,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది.

-->మన దేశంలో నిర్మించిన తొలి సంస్కృత చిత్రం - శంకరాచార్య

-->బ్రజిల్ దేశపు పూర్వనామం "డెరాడ శాండ కృజ్" (Derada Sanda Cruze).

-->నాగాలాండ్ రాష్ట్ర జానపద నృత్యం పేరు "రేంగ్మా".

LinkWithin

Related Posts with Thumbnails