Showing posts with label భక్తి. Show all posts
Showing posts with label భక్తి. Show all posts

Wednesday, January 9, 2013

ఆద్యాత్మిక క్యాలెండర్ 2013

ఆద్యాత్మిక క్యాలెండర్ 2013


పైన తెలుపబడిన రోజులలో దైవ నామస్మరన, పూజ, ధ్యానం చేయడం మంచిది, 
అవి పర్వదినములు, కుల మతాలకు అతీతముగా ధ్యానం, ప్రాణాయామం చేయవచ్చు.

Friday, October 14, 2011

సింహాచలము మహా పుణ్యక్షేత్రము - 2

సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం నుండి కనిపిస్తున్నది.
కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు.

సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార లు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉన్నది. స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉన్నది


సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం.

సింహాచలం మెట్లదారి ఆంజనేయుడు.

గత రెండు శతాబ్దాలుగా విజయనగర రాజుల కుటుంబ సభ్యులు ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు
దేవాలయంలో దర్శనవేళలు-
ఉదయం 6 నుండి 11 మరియు
మధ్యాన్నం 12 నుండి సాయంత్రం 4
సాయంత్రం 6 నుండిరాత్రి 9 వరకూ..

Note: Photos captured by me using Nokia 7210s mobile camera with 2MP

Tuesday, October 11, 2011

సింహాచలము మహా పుణ్యక్షేత్రము - 1

సింహాచలము దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి.

సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది.
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం.

సింహాచలం మెట్లదారిలో కనిపించే శిలాశాశనం
దేవాలయంలో దర్శనవేళలు-
ఉదయం 6 నుండి 11 మరియు
మధ్యాన్నం 12 నుండి సాయంత్రం 4
సాయంత్రం 6 నుండిరాత్రి 9 వరకూ..

Note: Photos captured by me using Nokia 7210s mobile camera with 2MP

Monday, February 21, 2011

మహానందీశ్వరం||

కొండవాలున కొలువైన కొంగుబంగారం

శరణు వేడిన ప్రాణికి అభయహస్తం

ప్రమధనాధ దేవదేవం మహానందీశ్వరం||

జటాజూటం నుండి జాలువారే గంగాప్రవాహం

పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలం

కైలాసనాధుని కృపాకటాక్షం మహానందీశ్వరం||

సర్వకాల సర్వావస్థ సర్వభూత సంరక్షణం

పుణ్య, కీర్తులు ప్రసాదించే వరం

ముక్కంటి మృదుధరహాసం మహానందీశ్వరం||

సకల చరాచర మూలాధారం

శివ పంచాక్షర అభిషేక ప్రియం

దేవ దేవం శంభో శంకరం మహానందీశ్వరం||

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మాహానంది లో కొలువైన
శ్రీ మహానందీశ్వర స్వామివారి పై నేను రాసిన చిన్ని కవిత.

శివ భక్తులైన మా నాన్న గారికి ఈ కవిత అంకితం!

Thursday, October 14, 2010

త్రిభువనేశ్వరి శర్వాణి.. మహిషాసుర మర్ధిని..

భక్తితొ కొలిచినవారికి ముక్తిని ప్రసాదించే వరదాయిని..

అనంతకోటి బ్రహ్మాండానికి ప్రేమను పంచే అమ్మా భవాని..

సకల జీవరాసుల్ని కాపాడే చల్లని తల్లి త్రిభువనేశ్వరి శర్వాణి...

మా అపరాధములు మన్నించి కరుణామృతాలు కురిపించు కాత్యాయని..

మహిషమవుతున్న మనిషిని మరల మనిషిని చేయగా అవతరించవా!
మహిషాసుర మర్ధిని...

బ్లాగు మిత్రులందరికి
విజయదశమి శుభాకంక్షలు :)

Saturday, November 28, 2009

మనసుకి మందు!


ఎన్నో ఊహాగానాలు మరెన్నో సంఘర్షణలు
నిత్య ఆలొచనలు నిరంతర సంకోచాలు
కొన్ని అవ్యక్తభావాలు మరికొన్ని అశనిపాతాలు
మనిషి మనసుకి ఇవన్నీ ఆభరణాలు..

అచంచలమైన భగవంతుని యందు..
నమ్మకమనే పసందైన విందు..
చంచలమైన మనసుకి మందు..

Friday, October 16, 2009

దేవుడున్నాడు...


జన్మనిచ్చిన తల్లిలో
జన్మ జన్మల బంధాలలొ
జన్మ రాహిత్య భావాలలొ
దేవుడున్నాడు.

వెలుగునిచ్చే సూర్యుడిలో
భారం మోసే భూదేవిలో
వెన్నెల కాచే చంద్రునిలో
దేవుడున్నాడు.
మంచిని పంచే మనసులలొ
ధైర్యం నింపే మనుషులలో
మంచిని కోరే స్నేహంలో
దేవుడున్నాడు.
సకల చరాచర విశ్వంలో
సత్యాన్వేషణ మార్గములో
సృష్టి స్థితి లయలలో
దేవుడున్నాడు.
దేవుడే ఉన్నాడు...

బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు :)

Friday, March 27, 2009

పవిత్రాద్రి...

బ్లాగు మిత్రులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు...
ఉగాది సందర్భముగా ఓ చిన్న కవిత..


చల్లని రామయ్య కొలువైనది భద్రాద్రి..

కలియుగ దైవం వెలసిన వెంకటాద్రి..
మహాదేవుని నిలయముగా వున్న శ్రీశైలాద్రి..

అప్పన్న లీలా వినోదముగా సింహాద్రి..
శక్తి స్వరూపిణి నెలవైన ఇంద్రకీలాద్రి..

సత్యనారాయుణి మహిమాన్విత రత్నాద్రి..
నృసింహుని ఓంకార మంత్రముగా వేదాద్రి..

ఆంధ్ర ప్రదేశము పుణ్య క్షేత్రాల పవిత్రాద్రి...

Sunday, February 22, 2009

ఓం శివోహం..

హర హర హర హర హర హర హర హర మహాదేవ్!
హర హర హర హర హర హర హర హర మహాదేవ్!!

ఓం మహా రుద్రాయ !

కాల రుద్రాయ!
కల్పాంగ రుద్రాయ!
రుద్ర రుద్రాయ!
ఘోర రుద్రాయ!
అఘోర రుద్రాయ!
మార్తాండ రుద్రాయ!
అండ రుద్రాయ!
బ్రహ్మండ రుద్రాయ!
చండ రుద్రాయ!
ప్రచండ రుద్రాయ!
వీర రుద్రాయ!
శూర రుద్రాయ!
అతల రుద్రాయ!
వితల రుద్రాయ!
సుతల రుద్రాయ!
మహాతల రుద్రాయ!
పాతాళ రుద్రాయ !
నమో నమః

ఓం శివోహం !
ఓం శివోహం !
రుద్ర నామం భజేహం !
ఓం శివోహం !
ఓం శివోహం !
రుద్ర నామం భజేహం !

వీర భధ్రాయ
అగ్ని నేత్రాయ
ఘోర సంహారహా
సకల లోకాయ
సర్వ భూతాయ
సత్య సాక్షాత్కరా
శంభో శంభో శంకరా

ఓం శివోహం
ఓం శివోహం
రుద్ర రూపం భజేహం
హర హర హర హర హర హర హర హర మహాదేవ్ !
ఓం
నమః శంభవేచ మయోభవేచ
నమః శంకరాయచ మయస్కరాయచ
నమః శివాయచ శివతరాయచ..

అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలనా..
స్తూలణా జగత్కారణా సత్య దేవ దేవప్రియా..
వేద వేదాంత సార..
యగ్న యగ్నోమయా..
నిశ్చలా దుష్ట నిగ్రహా..
సప్త లోక సంరక్షకా..

సోమ సూర్య అగ్ని లోచనా..
శ్వెతవృషభ వాహనా..
శూల పాణి భుజంగ భూషణా..
త్రిపుర న్యాస రక్షనా..
వ్యోమకేశ మహాసేన జనకా..
పాశుహస్త్ర నమోనమః..

ఓం శివోహం!
ఓం శివోహం!
రుద్ర రూపం భజేహం!
ఓం శివోహం!
ఓం శివోహం!
రుద్ర నామం భజేహం!

కాల త్రికాల.
నేత్ర త్రినేత్ర.
శూల త్రిశూల గాత్రం..
సత్య ప్రభావ.
నిత్య ప్రకాష.
మంత్ర స్వరూప మాత్రం..
నిష్ప్రపంచాది.
నిష్కలంకొహం.
నిజపూర్న బోధహం..
సత్యగాత్మానం..
నిత్యబ్రహ్మొహం..
సప్తకాశోహ మంత్రం..

సత్య ప్రమాణం ఓం ఓం
మూల ప్రమేయం ఓం ఓం

అయం బ్రహ్మాస్మి ఓం ఓం
అహం బ్రహ్మాస్మి ఓం ఓం

ఓం శివోహం!
ఓం శివోహం!
రుద్ర నామం భజేహం!
ఓం శివోహం!
ఓం శివోహం!
రుద్ర రూపం భజేహం!

వీర భధ్రాయ
అగ్ని నేత్రాయ
ఘోర సంహారహా
సకల లోకాయ
సర్వ భూతాయ
సత్య సాక్షాత్కరా
శంభో శంభో శంకరా

ఓం శివోహం!
ఓం శివోహం!
రుద్ర నామం భజేహం! భజేహం!


మహాశివరాత్రి సందర్భంగా రుద్ర నమక చమకం ఆధారిత గీతం..
చిత్రం: నేను దేవుడ్ని (2009)
సంగీతం: ఇళయరాజా

హర హర మహాదేవ్!
ఈ గీతాన్ని క్రింది లింక్ నుంచి డౌన్లొడ్ చేసుకొండి..(6 వ పాట)

http://www.bangaloreliving.com/tamilmp3songs/NaanKadavulTamilSongs.php


LinkWithin

Related Posts with Thumbnails