కొండవాలున కొలువైన కొంగుబంగారం
శరణు వేడిన ప్రాణికి అభయహస్తం
ప్రమధనాధ దేవదేవం మహానందీశ్వరం||
జటాజూటం నుండి జాలువారే గంగాప్రవాహం
పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలం
కైలాసనాధుని కృపాకటాక్షం మహానందీశ్వరం||
సర్వకాల సర్వావస్థ సర్వభూత సంరక్షణం
పుణ్య, కీర్తులు ప్రసాదించే వరం
ముక్కంటి మృదుధరహాసం మహానందీశ్వరం||
సకల చరాచర మూలాధారం
శివ పంచాక్షర అభిషేక ప్రియం
దేవ దేవం శంభో శంకరం మహానందీశ్వరం||
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మాహానంది లో కొలువైన
శ్రీ మహానందీశ్వర స్వామివారి పై నేను రాసిన చిన్ని కవిత.
శివ భక్తులైన మా నాన్న గారికి ఈ కవిత అంకితం!
6 comments:
అధ్బుతం ...చాలా బాగుందండీ.....!!! ఆ శివయ్య కటాక్షం మీపై ఎల్లప్పుడూ వుండాలని అశిస్తున్నాను....!!!హర హర మహాదేవ...!!!
మూడు రోజుల క్రింద మహనందీశ్వరుని దర్శనభాగ్యం,
నేడు ఆయనపై మీ కవితాభాగ్యం...ధన్యులమయ్యాం.
thanks mr. vijayamohan :)
చాలా బాగుంది.
శంభో శంకరం శ్రీమహానందిక్షేత్ర వాసం పార్వతీ ప్రియం నమామ్యహం.
బాగా రాసారు.. ఓం నమశ్శివాయ..
chala baga rasaru.....nice..
Post a Comment