నీతోనే నువ్వు సరదాగా లేనేలేవు
నలుగురిలో నవ్వుల్నేం చూస్తావు
నువ్వేంటో అర్థంకావు వేరేగా ఉంటావు
నీ మనసెందుకు నీ లోనే దాస్తావు
ఎందుకోసమో ఈ ఆరాటం ఎంచి చూసుకో అన్నది లోకం
ఒక్కసారి నువ్వాలోచించు నీకోసం
ముందు వెనకనే చూడని మార్గం మర్చిపోయేలా లౌక్యం కొంచం
పట్టువిడుపుగా సర్డుకుపోని నీ నైజం
నీతోనే నువ్వు ...(1 సారి)
ఏదేదో అనుకుంటావు ఇంకేదో చేస్తుంటావు చిక్కుల్లో పడతావు చిత్రంగా ..
ఏ నేరం చేయని నువ్వు బందీగా మిగిలవు ఎంతో అలజడి మోసవు మౌనంగా ..
అద్దంలో నీరూపు నీకు చూపే వారె నీ దారినొదిలి కదిలారు..
నిడైన నీవెంట లేనంది ఈ నాడు నిదే తప్పని నిందలు వేసి కాలమెంత మారిపోయెర..
నీతోనే నువ్వు ...(1 సారి)
పైపై నవ్వుల లోకం పైసాకే విలువిచ్చిందా కన్నిరంటిన స్వప్నం చెరిగిందా ..
వొంటరితనమే నిన్ను వడగాలై తాకిందా సత్యం తెలిసి కనువిప్పే కలిగిందా ..
చేదెంత చేదైన గాని మందే అనుకో మంచేగా చేసింది నీ కథకు ..
ఏ బాధ లేనోడు భుమ్మిదలేనోడే మనిషై పుడితే దేవుడికైనా కంట నిరు ఖయమేనురా ..
జానేదో నేస్తం జరిగాకే తప్పుని చూస్తాం , నిన్నటి లెక్కని నేడే సరిచేద్దాం..
నడి రాత్రి నిశబ్ధంలో నిజమేంటో కనుగోన్డం మలిపోద్దుల్లో మెలకువగా అడుగేద్దాం..
ఎల్లకాలమి అల్లరి కాలం ఒక్క తీరుగా ఉండదు నేస్తం మంచి చెడ్డలు బొమ్మ బొరుసే అనుకుందాం..
పల్లం ఏమిటో చుసిన ప్రాణం లెక్క చేయదే ఎంతటి కష్టం నేల తాకిన బంతి అయి మళ్ళి పైకోద్దాం..
చిత్రం: GAME ( 2006 లొ విడుదల)
సంగీతం: జాషువ శ్రీధర్
సాహిత్యం: రామ జొగియ్య శాస్త్రి
పాడిన వారు: s.p. బాల సుబ్రమణ్యం
ధన్యవాదములు.. ఇంకో మంచి టపా తొ మళ్లి కలుస్తా..