బ్లాగు మిత్రులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు..
నాకు చిన్నపటి నుండి వినాయక చవితి అంటే మహా ఇష్టం, ఎందుకంటే ఈ పండుగ నా పుట్టిన రోజుకి దెగ్గరలోనె వస్తుంది కాబట్టి. నాన్న గారి తో పాటు బజారు కి వెళ్లి అన్ని సామానులు తెచ్చుకునే వాళ్ళం నేను మా చెల్లి. అప్పట్లో మా నాన్న గారిది rAjdoot మోటార్ సైకిల్, ఒక అల్లిన బుట్ట తీసుకుని బయలుదేరేవాళ్ళం వరంగల్ మార్కెట్టు కి ( చిన్నపుడు నేను చాల వూర్లు తిరిగాను లెండి) ముందు పత్రి ఆ తర్వాత వినాయకుడి బొమ్మ అ పై పువ్వులు, పండ్లు తో బుట్ట నింపేసేవాళ్ళం. ( ఈ కాలంలో బుట్ట నింపాలంటే తడిసి మోపెడు అవుతుంది అనుకోండి)
వినాయకుడి బొమ్మ ఏది తీసుకోవాలి అనే దెగ్గర నాకు చెల్లికి గొడవ, ఆఖరికి మా నాన్న గారు తిసేసుకునేవారు బొమ్మని. ఏదో ఒకటి అని ఇంటికి రాగానే వినాయకుడి బొమ్మని తీసి చూసుకుని మురిసిపోయే వాళ్ళం ఇద్దరం. అ రోజు రాత్రికి నాకు కలలో చవితి నాడు చేసే కుడుములు, పప్పులో ఉమ్ద్రల్లె . చవితి వ్రతకల్పం వెతికి పెట్టి ఇక పడుకునే వాడిని ( ఇప్పుడు కూడా సిస్టం లో సిడి ని రెడీ చేయడం నా పనే ఇంట్లో చవితికి )
ఉదయం ఇంక పండగ , అమ్మ వంట పని, నేను , చెల్లి, నాన్న పూజ గదిలో ఏర్పాట్లు. పాలవెల్లి కట్టి, దాని చుట్టూ మామిడి ఆకులూ, పండ్లు, పూలు కట్టి సిద్దం చేసే వాళ్ళం. అప్పటికే మా అమ్మ అన్ని చేస్కుని వచ్చేది , ఇంక పూజ మొదలు , నేను , చెల్లి మా క్లాసు పుస్తకాలూ తెచ్చుకునే వాళ్ళం వినాయకుడి దెగ్గర ఉంచడానికి, మొదటి పేజిలో పసుపు తో ఓం అని రాసేవారు నాన్న గారు. భలే ఉండేది. అందరం వ్రతకల్పం తీస్కొని చదవడం మొదలు పెట్టేవాళ్ళం ( నాకు ఇప్పటికి అ కల్పం చదవటం రాదు, హడావిడి చేస్తా . ) ఇంక పూజ తర్వాత కథ మొదలవగానే నాకు ఆకలి కూడా మొదలు.. కొబ్బరికాయ కొట్టడం ఆలస్యం, తీర్థం తీస్కుని ఒక కుడుము లాగించేస్తా..
ఇంక ఆ తర్వాత నన్ను ఎవరు ఆపరు లెండి.
కర్నూల్ లో మొదటి సారి నిమజ్జనం లో పాల్గొన్నాను, దేగ్గరుంది చూసాను , మా నాన్న గారు అప్పుడు గెస్ట్ , అయన తో పాటు మేము కూడా వెళ్ళాము. హైదరాబాద్ వచాక ఇప్పుడు నేను మా నాన్న గారిని తీస్కుని పండుగ సామానులు తేవడానికి వెళ్తున్నాం , అన్ని తీస్కుని వచ్చి సర్దుకుని పడుకుని పొద్దున్నే పండుగ సందడి , అందుకే వినాయక చవితి అంటే భలే ఉంటుంది ఇప్పటికి ...