Thursday, September 24, 2009

అది నేనే... 1

ఇవన్ని నా ఫొటోలే .. చిన్న effects ఇచ్హను photoshop లో ..

నా మొహం కొంచం variety తయారైంది అంతే... :)

Wednesday, September 16, 2009

మహమ్మారితో జాగ్రత్తా! ..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి swine Flu (H1N1) , ఇప్పుడు మన దేశంలో విస్తృతంగా వ్యాపిస్తోంది.. దాని బారి నుండి మనల్ని మనం కాపాడుకోడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది .నాకు తెలిసిన కొన్ని విషయాలు సూచనలు మీతో పంచుకుంటున్నాను ఇక్కడ. లుబు , దగ్గు, గొంతు నొప్పి, చాతి నొప్పి, లాంటి లక్షణాలు ఉన్నపుడు swine Flu వచ్చే అవకాశాలు ఉన్నాయ్..

నివారణ చర్యలు : జాగ్రత్తలు:

1. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, పొడిగా తడి లేకుండా .

2. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, బైటికి వెళ్లి వచ్హాక, చేతులు, కళ్లు (eyes) , మొహం శుభ్రంగా కడుక్కోవాలి.

. kerchief లో ఒక చిన్న కర్పూరం బిళ్ళ (camphor) ఉంచుకోవడం మంచిది, బైటకి వెళ్ళినప్పుడు. ఇబ్బందిగా ఉన్నపుడు kerchief ని అడ్డుపెట్టుకోండి. కర్పూరం మంచి రోగ నిరోదకంలా పనిచేస్తుంది గాలిలో ..

4. తులసి నీళ్లు కూడా శ్రేయోస్కరమే , పొద్దున్నే 2 నుంచి 5 తులసి ఆకులూ తింటే దగ్గు , జలుబు లాంటివి రాకుండా చేస్తుంది..

5. చిన్నపాటి అనారోగ్యాన్ని అశ్రద్ద చేయొద్దు..

6. vaaccine మార్కెట్లోకి వచ్చింది.

7. డాక్టర్ని సంప్రదించండి, భయపడకండి, నివారణ లో భాగంగా homeo మందులు వడోచు.. "influenzinum 200" అనే మందు ఉంది, పగలు 5 , రాత్రి 5 మాత్రలు వేస్కోవాలి వరుసగా రోజులు.. దీని వల్ల రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది. సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు .
ఇవి నాకు తెలిసినవి, నేను చేస్తున్నవి , మంచే జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి.. ఇక్కడ చెప్పినవి ఏవైనను నివారణ చర్యలు మాత్రమే, వ్యదిగ్రస్తులు చికిత్సకు ఆసుపత్రికి వెల్లవలసిందే ..

సమాచారం కావాలంటే:
http://en.wikipedia.org/wiki/Swine_flu


న్యవాదములు


- భద్రసింహ

Monday, September 7, 2009

చేయుతనిద్దాం రండి! ...

జీవితాంతం రెండు చేతులు లేకుండా గడపడం ఎంత దుర్భరమో ఎపుడైనా ఉహించార...
ఇక్కడ నేను చెప్పబోయేది మన మధ్యనే ఉన్నా అలాంటి వాళ్ళ గురించే , చేతులు ఉంటే అందమైన బొమ్మలు ఎన్నో వేయచు, చేతులు లేకుండా కేవలం నోటి తోని , కాళ్ళ తోని అద్భుతమైన బొమ్మలు వేస్తున్నారు . ప్రమాదాలలో చేతులు పోగొట్టుకున్న వారికీ అండగా నిలవాలన్న ఉద్దేశం తో " Indian mouth and foot painting artists " వారు ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు..

వారిచే వేయబడిన బొమ్మలని print చేసి అద్బుతమైన greeting cards కింద మలిచారు.. వాటిని అమ్మిన డబ్బులతోటి జీవనోపాధి కలపించారు వాళ్ళకి .. మనం ఆర్డర్ ఇస్తే greeting cards సెట్ మన ఇంటికే పంపుతారు, ఒక సెట్ 395 రూపాయలు. నేను ఒక సెట్ కొన్నాను, అద్భుతంగా ఉన్నాయ్.. ఒక విదంగా వారికి నా వంతుఇగా ఏదో చేయగలిగాను అనిపించింది, విషయాన్నీ నా బ్లాగు మిత్రులందరి తోటి పంచుకుని, వారికి వీలైనంత చేయుట ఇద్దామని అనుకున్నాను.. మీ లో ఆసక్తి ఉన్నవారు వారికీ చేయుతనివ్వడానికి ముందుకు వస్తారని ఆసిస్తూ, " Indian mouth and foot painting artists " వారి website వివరాలు ఇక్కడ ఉంచుతున్నాను..




ధన్యవాదములు...
క్రియేటివ్ కుర్రోడు మాధవ్
- భద్రసింహ

Tuesday, September 1, 2009

పడుతున్నా... ఆయినా లేస్తున్నా...

ఎవరికీ అందనంత ఎత్తు ఎదగాలని, జీవితంలో పరుగెత్తాను , బొక్క బోర్లా పడ్డాను..
ఆయినా లేచి పరిగెడుతున్నాను , జీవితంలో ఎదగాలని ...
ఎంతో అపురూపముగా ప్రేమించాను, కలలు కన్నాను, మళ్ళి పడ్డాను..
ఆయినా లేస్తున్నాను , నన్నూ ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని తెలుసుకున్నాను..
ఏమి లేని దానికి విచారంగా , ఒంటరిగా గడిపాను , భాధ పడ్డాను ..
ఆయినా లేస్తున్నాను .. ఇప్పుడు కావలసినంత భాధ ఉన్నా , సంతోషంగా గడపడానికి..

బ్రతుకు సమరం లో ఎటూ పాలుపోకుండా ఉన్నాను, ఇక్కడా పడ్డాను..
ఆయినా లేచి పరిగెడుతున్నాను , సంకల్ప బలం తో .. అనుకున్నది సాధించడానికి..

LinkWithin

Related Posts with Thumbnails