జన్మనిచ్చిన తల్లిలో
జన్మ జన్మల బంధాలలొ
జన్మ రాహిత్య భావాలలొ
దేవుడున్నాడు.
వెలుగునిచ్చే సూర్యుడిలో
భారం మోసే భూదేవిలో
వెన్నెల కాచే చంద్రునిలో
దేవుడున్నాడు.
మంచిని పంచే మనసులలొ
ధైర్యం నింపే మనుషులలో
మంచిని కోరే స్నేహంలో
దేవుడున్నాడు.
సకల చరాచర విశ్వంలో
సత్యాన్వేషణ మార్గములో
సృష్టి స్థితి లయలలో
దేవుడున్నాడు.
దేవుడే ఉన్నాడు...
బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు :)