ఫోటోలు తీయడం అంటే నాకు భలే సరదా,
నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
అన్నార్తులను ఆదుకుందాం
Sunday, November 29, 2009
Saturday, November 28, 2009
మనసుకి మందు!
Monday, November 23, 2009
రూటు మారింది!
కూకట్ పల్లి కథలు - 1
కూకట్ పల్లి కథ సమాహారం కేవలం వినోదం కోసమే, ఇక్కడ పాత్రలు అన్ని కల్పితాలే.
విజయరాజ్ కి కోత్తగా పెళ్లైంది , హైటెక్ సిటీ లో మంచి ఉద్యోగం మొన్నటి దాక అమీర్పేట లో రూం. ఇప్పుడు ఆఫీసుకి దెగ్గరగా ఉంటుందని కూకట్ పల్లి పై కన్నేసాడు. ఇల్లు కోసం తిరిగాడు ఒక నెల , మొత్తానికి JNTU దగ్గర నిజాంపేట్ రోడ్లో ఇల్లు దొరికింది. అది ఒక అపార్ట్మెంట్ లాంటిది( చిన్న సందులో వెలసిన బహుళ అంతస్తు భవనం). మొత్తానికి కొత్త ఇంట్లో కొత్త కాపురం మొదలెట్టాడు మన రాజు. మహా నగరంలో షరా మాములే అయిన నీటి ఎద్దడి మొదలైంది, ఇంటి ఓనరు నీటికి XTRA డబ్బులు వసూలు చేసాడు, మనవాడికి తప్పలేదు, ఇవన్ని ఎక్కడైనా ఒకటే అనుకున్నాడు. ఆఫీసుకి వెళ్ళడానికి ఒక బండి కొన్నాడు ( ఆర్ధిక మాంద్యం వల్ల ఆఫీసువాళ్ళు కాబ్ సర్వీసు ఎత్తేసారు)
మహా ఐతే పావు గంటలో ఆఫీసులో ఉంటాం అని మొదటి రోజు బైలుదేరాడు. సందులోంచి నిజాంపేట్ రోడ్ మీదకి వచాడు అంతే , అక్కడి నుండి అడ్డదిడ్డంగా వాహనాలు, ఎటు వెళ్ళాలన్న దారి లేదు , అప్పటికే ఎలాగోలా బైట పడి మెయిన్ రోడ్ ఎక్కాడు, అక్కడి నుండి JNTUమీదుగా హైటెక్ సిటి కి మళ్లాడు, రైల్వే లైన్ వద్ద మళ్ళి ట్రాఫిక్ సందడి మొదలు, అక్కడ ఒక flyover కడుతున్నారు ( విజయరాజ్ ఉద్యోగంలో చేరిన కొత్తలో అది కట్టడం మొదలైంది, అతను ఉద్యోగంలో చేరి 2ఏళ్ళు అవుతోంది). పావుగంటలో వెళ్ళాల్సిన మనవాడు ముప్పావుగంటలో చేరాడు ఆఫీసుకి. మళ్ళి సాయంత్రం ఇంటికి బైలుదేరాడు, ఇప్పుడు ఇంటికి రావడానికి గంట పట్టింది. కొన్ని రోజులు చూసాడు , మరో మార్గం ఎమన్నా ఉందా అని అన్వేషణ ప్రారంభించాడు, అతని శ్రమ ఫలించింది ఒక రూటు దొరికింది.
అ కొత్త రూటులో ప్రయాణం బానే ఉంది, టైము కలిసోచింది కానీ మనవాడి కొత్త బండి పాడు అయింది , మొత్తానికి విజయరాజ్ కి చికాకు పెరిగింది, రోడ్ మీదకు వెళ్ళాలి అన్నా బండి నడపాలి అన్నా ఒక రకమైన అసహ్యం కలిగింది. సెలవ రోజు వస్తే ఇంట్లోనే ఉంటున్నాడు , సరదాగా బైటకి వెళ్దాం అని వాళ్ళ ఆవిడ అడిగితే ధూమ్ ధాం అని కాసురుకుని ఇంట్లో కంప్యూటర్ ముందు కాలక్షేపం చేస్తున్నాడు, పెళ్ళైన కొత్తలో సరదాలన్నీ ఎగిరిపోయాయి, బండి అమ్మేశాడు, ఒక కారు కొన్నాడు , ట్రాఫిక్ అస్తవ్యస్తానికి తను ఒక సమిధ అయ్యాడు, మొత్తం రూటు మార్చేసాడు(తప్పలేదు) . ఒక సంవత్సరం తర్వాత చెన్నై వెళ్ళిపోయాడు మన విజయరాజ్, అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో....
లేబుళ్లు:
కూకట్ పల్లి కథలు,
వ్యంగ్యం
Saturday, November 21, 2009
కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని-2
-->సప్తస్వరాలకు అర్థాలున్నాయి అవి ఇదిగో:
స - సడ్జమం రి - రిషభం
గ - గాంధారం
మ - మధ్యమం
ప - పంచమం
ద - దైతం
ని - నిషాదం
-->కందుకూరి వీరేశలింగం గారికి "గద్య తిక్కన" అనే బిరుదు కలదు.
-->"ఉత్కళ్" అని ఒరిస్సా తీర ప్రాంతాన్ని పిలుస్తారు.
-->మెడగాస్కర్(Madagaskar)కి లవంగాల దీవి(island of cloves) అని పేరు.
-->భారత దేశ చరిత్రలో ప్రప్రథమ చక్రవర్తి - మహాపద్మనందుడు
-->మన దేశంలోని సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలలో రైలు మార్గాలు లేవు.
-->మొత్తం భూ ఉపరితలం 509,700,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది.
-->మన దేశంలో నిర్మించిన తొలి సంస్కృత చిత్రం - శంకరాచార్య
-->బ్రజిల్ దేశపు పూర్వనామం "డెరాడ శాండ కృజ్" (Derada Sanda Cruze).
-->నాగాలాండ్ రాష్ట్ర జానపద నృత్యం పేరు "రేంగ్మా".
Thursday, November 19, 2009
నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 2
ఫోటోలు తీయడం అంటే నాకు భలే సరదా...
నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ మి ముందుంచుతున్నాను .. ఇందులో గ్రాఫిక్స్ లేవు అన్ని nokia 7210s mobile తో తీసినవే...
Friday, November 13, 2009
ప్రెమే కల్పనైతే?
ప్రెమే కల్పనైతే?
మనసుకి మాటలులేవు!
ప్రెమే కల్పనైతే?
ఊహలు దరిచేరవు!
ప్రెమే కల్పనైతే?
ఆప్యాయతలు శూన్యము!
ప్రెమే కల్పనైతే?
జీవితమే నిస్తేజము!
ఈ కవిత రాయడానికి ప్రేరణ ఇచ్చిన నా సోదరికి ధన్యవాదములు!
లేబుళ్లు:
నా కపిత్వం,
ప్రశ్నలు
Tuesday, November 10, 2009
సాయం అందుతోందా?
ఇటీవలి కాలంలో మన రాష్త్రంలో సంభవించిన వరదల నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు.ప్రభుత్వం మరియు అనేక సంస్థలు ఆపన్నహస్తాలు అందించారు. అయినా చేసిన సాయం బాధితులకి అందుతోందా?
ఎందుకంటే నేను ఈ మధ్య ఒక సంఘటన చూసాను, గుంటూరు జిల్ల మంగళగిరి bus stand లొ ఒక ముసలావిడ యాచిస్తుంది.అందరి దెగ్గరికి వెళ్లట్లేదు, సంసయిస్తూ తిరుగుతూ యాచిస్తొంది ఆవిడ. కాసేపు గమనించి ఆవిడని పలకరించాను, అప్పుడు చెప్పింది వాల్ల వూరిలొ పెంకుటిల్లు వరదకి కూలిపోయిందని, కన్నబిడ్డలు వదిలేసి వెల్లిపోయారని, తన భర్త అనారోగ్యం తో మంచాన ఉన్నాడని, వరదల్లొ అన్నీ కోల్పోయామని చెప్పింది.
ప్రభుత్వం వారు సాయం అందిస్తున్నరు కద మరి ఇలా ఎందుకు అని అడిగాను నేను, సాయం అడిగితే రెషన్ కార్డు లేకుండా ఏమీ ఇవ్వలేము అని చేతులు ఎత్తేశారంట, వరదల్లో అన్నీ పోయిన వాళ్ల దెగ్గర కార్దులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారొ తెలీదు.ప్రభుత్వం వరద నివారణ చర్యలు, సహాయక చర్యలు బానే చేపట్టింది, కాని వ్యవస్థ లోని చిన్న చిన్న లోపాలు, ఆ సాయం అందకుందా చేస్తున్నాయి.ఆ ముసలావిడను వెంట తీసుకెళ్లి కొంత బియ్యం, కొన్ని పండ్లు కొనిచ్హాను, నేను శాశ్వత పరిష్కారం చూపించలేక పోవచ్చు కానీ ఆవిడకి చేయగలిగింది చేసాను, ఇలా మన చుట్టు ఇంకెంతమంది ఉన్నారో మనకి తేలీదు.
అసలైన భాధితులకి సాయం అందుతోందా అనేది ఇక్కడ ప్రశ్న గానే మిగిలిపోయింది చివరికి?
Subscribe to:
Posts (Atom)