Monday, December 28, 2009

నా క్రియేటివ్ క్యాలెండర్ 2010..

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు: మీ కోసం నేను తయారుచేసిన గోడకాగితాలు (Desktop wallpapers) పెడుతున్నాను,వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.వీటిలో నేను తీసిన ఫోటొలు, Photoshop లో చేసినవి,3D మాయలో చేసినవి ఉన్నాయి. నా క్యాలెండర్ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తూ.
Click on the image and open it in new tab or new browser window for full size image. 1440 X 900 Widescreen wallpapers.
Creative Calender 2010











Click on the image and open it in new tab or new browser window for full size image. 1440 X 900 Widescreen wallpapers.
ధన్యవాదములు
ఇక సెలవు క్రియేటివ్ కుర్రోడు మాధవ్

Thursday, December 24, 2009

విశ్వమాత

విశ్వ మాత..
ఈ పిలుపుకి అర్హురాలు నిస్సందెహంగా ఒక్క మథర్ తెరిస్సా అని నా అభిప్రాయం.. ఎందుకంటె ఆవిడ ప్రపంచనికే కరుణను పంచిన అమ్మ.చిన్నపుడు నేను స్చూల్లొ చదువుకున్నపుడు గుర్తు మథర్ తెరిస్సా పాఠం.ఆవిడ భారత పౌరసత్వం పొందిన ఒక అల్బేనియన్ రోమన్ కాథొలిక్ నన్.

మథర్ తెరిస్సా (ఆగష్టు 27, 1910 – సప్టెంబర్ 5, 1997), అసలు పెరు ఆగ్నస్ గొంక్షా బోజాక్షూ ,దయా, ప్రేమ, వినయం, స్నేహం వంటి సుగుణాలను అగ్నస్ పుణికి పుచ్చుకుంది. దీన జనులకు సాయపడాలనే ఆమె తపన అందుకే 17 సంవత్స్రాల చిరు ప్రాయం లొ ఆవిడ మిషినరీస్ లొ చేరారు.ఆ మిషినరీస్ భారతదెశం లొ పనిచేయుచున్నది(బ్రిటిష్ పాలన లొ) అక్కడ తెరిస్సాగా పేరు మార్చుకుంది, మిషినరీస్లొ టీచర్ గా పని చేశరు 1944 వరకు. "ఇది కాదు నేను చేయవలసింది, కాని చేయవలసిన దాని కొసం యెటు వెల్లలి, యెలా" అని అనుకుని కలకత్తా పయనం అయ్యరు.కలకత్తా మురికి వాడలలో పాఠశాల ప్రరంభించారు పేద పిల్లలకి చదువు చెప్పారు,అనారొగ్యులకు సపర్యాల తొ పాటు వైద్యం కుడా చెసేవారు మథర్, దిక్కు మొక్కు లేని అనాధలకు పెద్ద దిక్కు అయ్యారు మథర్.

అలా అలా 1950లొ మిషినరీస్ ఆఫ్ చారిటీ కోల్ కట (కలకత్తా) లొ ప్రారంభించారు మథర్ తెరిస్సా 1952 లొ 12 కేంద్రాల నుండి కరుణామృతమైన ప్రేమను పంచుతూ ప్రపంచ్వ్యాప్తంగా 450 కేంద్రాలకు పెరిగింది మిషినరీస్ ఆఫ్ చారిటీ. 1979 లొ నొబెల్ శాంతి బహుమతి పొందిన మథర్ తెరిస్సా, ఆ బహుమతి మొత్తం అయిన $6,000 ని కలకత్తా లొని మురికివాడలకు దానం ఇచ్చారు, ఈ మోత్తాన్ని ఉపయొగించి కొన్ని 100ల మంది ఆకలి తీర్చచ్చు అన్నారు మథర్.1994లొ అమెరికాలొ జరిగిన ఒక సదస్సు లొ గర్భవిచ్చిన్నత (అబొర్షన్)ని వ్యతిరేకించారు,"పుట్టబొయే బిడ్డను చంపొద్దు, మీకు భారమైతే ఆ బిడ్డ నాకు కావలి, దేవుని ప్రసాదంగా చూసుకుంటాను, నాకు ఇవ్వండి" అన్నారు.

ఆవిడ ఎప్పుడూ ప్రెత్యేక అకర్షణగా నిలవాలని అనుకోలేదు, ప్రాపంచిక సుఖాల గురించి ఆవిడ యేనాడు అలొచించలేదు ఎందుకంటె ఆవిడ ఎంచుకున్న మార్గం నిస్వార్ధమైన సెవా మార్గం.ఆవిడ భౌతికంగా ఇప్పుడు మనతో పాటు లేకపొయినా కాని, ఆవిడ ఉనికి మనకి ఒక అద్బుతమైన అనుభూతిని ఇస్తుంది, ఈ ప్రపంచమునందు ఆవిడ తన వంతు ధర్మాన్ని నెరవేర్చింది.ఇందులొ అసలు సందేహం లేదు.

ఆవిడ మహొన్నత మానవతావాది, ఎందరికో స్పూర్తిప్రధాతగా నిలిచింది..ఆవిడ భగవంతుని ప్రేమను ప్రత్యక్షముగా పంచడానికి వచ్చిన కరుణామయి."నువు 100 మంది ఆకలి తీర్చలెకపొతే ఒక్కడి ఆకలినయినా తీర్చు" అని అంటారు మథర్ తెరిస్సా. ఆవిద ఎన్నొ దేశాలు తిరిగి నిస్వార్థ సేవలను అందించారు.. ఆవిడ ప్రెమమయమైన కరుణకు ఎల్లలు లేవు.

క్రిష్టమస్ సంధర్భముగా బ్లాగు మిత్రులందరికీ శుభాకాంక్షలు.

నేను బ్లాగులోకం లో ప్రవేశించి ఒక సంవత్సరం అయింది నేటితో, ఎల్లప్పుడు నా వెంట ఉంది నన్ను ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకి శ్రేయోభిలాషులకి, వ్యాఖ్యలు చేసిన అభిమానులకి నా ధన్యవాదములు. నా వెన్నంటి నిలచిన స్నేహితులు, తోటి బ్లాగర్లు అయిన శ్రీ శివ చెరువు గారికి, శ్రీ రాజశేఖరుని విజయ్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదములు, నా ప్రియ సోదరికి ఈ టపా అంకితం!

మీ
నాయని ఆదిత్య మాధవ్ ( క్రియేటివ్ కుర్రోడు)

Monday, December 21, 2009

భారతీయ వాహనాలు..2

మన దేశంలో వాహనాలకు కొదవ లేదు, జన సామాన్యం తిరిగే కొన్నివాహనాలు:

Friday, December 18, 2009

అక్షరమాల... అమరవాణి -4


ఇంకొన్ని ..

1. విత్తనాల వంటివి మన చేతలు, వాటిని బట్టే ఫలితాలు.
2. వజ్ర వైడూర్యాలకంటే విలువైనది జ్ఞానమొక్కటే.
3. మాటలు తెలివితేటల్ని చూపితే, మౌనం ప్రతిభని ప్రదర్శిస్తుంది.
4. ఇతరుల మేలు కోరుట, మేలు చేయుట, సేవలొనరించుట పరోపకారము!
5. ఒకరు చేసిన అపకారానికి కసి తీర్చుకోవడం కన్నా మర్చిపోవడం మేలు.
6. అధిక సంపదల్లో కాదు, తక్కువ కోరికల్లోనే సంతృప్తి ఉంది.
7. జీవిత పధానికి పధకం వేసే వాడే గురువు.
8. మనసుని ఎంత అదుపులో పెడితే మనిషి అంత గొప్పవాడవుతాడు.

Tuesday, December 15, 2009

చెప్పుకోండి చూద్దాం!

ఈ క్రింది ఫోటోలలో ఉన్న వారిని వరుసక్రమంలో గుర్తించి వ్యాఖ్యల్లో పెట్టండి,
ఇది ఒక సరదా ప్రయత్నం మాత్రమే :)

1.

2.

3.

4.
5.

6.

7.

8.

9.

10.

Wednesday, December 9, 2009

సమయం.. సర్వస్వం..

ఏదో తెలియని అవ్యక్త భావం


నా అంతరాలలో ఒక ఉత్తేజం


నిన్ను చూసుకుని మురిసిపోయే కాలం


నీతో గడిపిన కొద్ది సమయం


అదే నా జీవిత సర్వస్వం...

Sunday, December 6, 2009

గుర్తుకొచ్చింది..... ఓ మంచి పాట - 3

నీతోనే నువ్వు సరదాగా లేనేలేవు

నలుగురిలో నవ్వుల్నేం చూస్తావు

నువ్వేంటో అర్థంకావు వేరేగా ఉంటావు

నీ మనసెందుకు నీ లోనే దాస్తావు

ఎందుకోసమో ఆరాటం ఎంచి చూసుకో అన్నది లోకం

ఒక్కసారి నువ్వాలోచించు నీకోసం

ముందు వెనకనే చూడని మార్గం మర్చిపోయేలా లౌక్యం కొంచం

పట్టువిడుపుగా సర్డుకుపోని నీ నైజం

నీతోనే నువ్వు ...(1 సారి)


ఏదేదో అనుకుంటావు ఇంకేదో చేస్తుంటావు చిక్కుల్లో పడతావు చిత్రంగా ..

నేరం చేయని నువ్వు బందీగా మిగిలవు ఎంతో అలజడి మోసవు మౌనంగా ..

అద్దంలో నీరూపు నీకు చూపే వారె నీ దారినొదిలి కదిలారు..

నిడైన నీవెంట లేనంది నాడు నిదే తప్పని నిందలు వేసి కాలమెంత మారిపోయెర..

నీతోనే నువ్వు ...(1 సారి)


పైపై నవ్వుల లోకం పైసాకే విలువిచ్చిందా కన్నిరంటిన స్వప్నం చెరిగిందా ..

వొంటరితనమే నిన్ను వడగాలై తాకిందా సత్యం తెలిసి కనువిప్పే కలిగిందా ..

చేదెంత చేదైన గాని మందే అనుకో మంచేగా చేసింది నీ కథకు ..

బాధ లేనోడు భుమ్మిదలేనోడే మనిషై పుడితే దేవుడికైనా కంట నిరు ఖయమేనురా ..


జానేదో నేస్తం జరిగాకే తప్పుని చూస్తాం , నిన్నటి లెక్కని నేడే సరిచేద్దాం..

నడి రాత్రి నిశబ్ధంలో నిజమేంటో కనుగోన్డం మలిపోద్దుల్లో మెలకువగా అడుగేద్దాం..

ఎల్లకాలమి అల్లరి కాలం ఒక్క తీరుగా ఉండదు నేస్తం మంచి చెడ్డలు బొమ్మ బొరుసే అనుకుందాం..

పల్లం ఏమిటో చుసిన ప్రాణం లెక్క చేయదే ఎంతటి కష్టం నేల తాకిన బంతి అయి మళ్ళి పైకోద్దాం..


చిత్రం: GAME ( 2006 లొ విడుదల)

సంగీతం: జాషువ శ్రీధర్

సాహిత్యం: రామ జొగియ్య శాస్త్రి

పాడిన వారు: s.p. బాల సుబ్రమణ్యం


ధన్యవాదములు.. ఇంకో మంచి టపా తొ మళ్లి కలుస్తా..

Friday, December 4, 2009

దూరం... నాకిష్టం!

పుడమి పై నే పడిన నాడు నాకిష్టం ..

న్ను ప్రేమించే నా కుటుంబం అంటే నాకిష్టం..


నన్ను విడిచి వెళ్ళిపోయిన తొలిప్రేమ నాకిష్టం ..

నేను విడిచి ఉండలేని జన్మ బంధాలు నాకిష్టం ..


ఎల్లప్పుడూ నాటో దోబూచులాడే విజయ తిరమన్నా నాకిష్టం ..

ఎవరికీ దొరమైన ఏదో ఒక రోజు దెగ్గర అవుతాననే భావన ..

నాకు చాల ఇష్టం!

LinkWithin

Related Posts with Thumbnails