కరుణను కురిపించి ఆప్యాయతని పంచడం!
నేను చేసిన నేరమా?
నిస్వార్థంగా అభిమానించి, జాగ్రత్తగా చూసుకోవడం!
నేను చేసిన నేరమా?
"నేనున్నాను" అని ధైర్యాన్నిచ్చి సహకరించడం!
నేను చేసిన నేరమా?
తెలిసో, తెలియకో కొన్ని అపార్థాలకి నే మూలమవడం!
నేను చేసిన నేరమా?
ప్రేమంటే ఎంటో తెలియక దానిని పంచాలనుకోవడం!
నేను చేసిన నేరమా?
కలసి రాని కాలాన్ని కసిగా ఎదురించి ముందుకెళ్ళడం !
నేను చేసిన నేరమా?