వింత నాయకుల రాజ్యంలో
పంటను కాపాడుకోలేని దైన్యంలో
చావూ బ్రతుకుల సమరంలో
కుక్షి నింపే రైతన్న కుశించుకుపోతున్న ఈ నేల మనది రా !
స్వేఛ్చ లేని స్వతంత్ర దేశంలొ
అంతులేని అవమానాల లోకంలో
అశ్లీల అరాచకపు ఆరళ్ళలో
ఆడదాన్ని గౌరవించలేకపోతున్న ఈ నేల మనది రా!
ప్రాంతీయ దురహంకారంతో
స్వప్రయోజన దురాభిమానంతో
సామాన్యులే సమిధలయే ఆజ్యంలో
సాటి మనిషిని మనిషిగా చూడలేకపోతున్న ఈ నేల మనది రా!
పరాయి దేశానికి ప్రేమతో
బానిసలుగా బ్రతికే పనులతో
జేబులు నింపుకునే డబ్బుతో
భారతీయతకు ఊపిరులూదలేకపోతున్న ఈ నేల మనది రా!