Thursday, January 20, 2011

స్వయంకృతం!


కారడవిని సైతం కబలించి
మహా వృక్షాలను పెకలించి
సమతుల్యనికి తూట్లు పొడిచి
ప్రకృతి ధర్మాన్ని మరచి

గడుపుతున్నాము ఈ సమయం
ఇది మనం చేసుకున్న స్వయంకృతం

గతితప్పిన గమ్యం
మతిలేని పయనం
ప్రతి రొజూ భయం
మన చుట్టూ నరకం

అయినా
గడుపుతున్నాము ఈ సమయం
ఇది మనం చేసుకున్న స్వయంకృతం

ఆధ్యాత్మికత పేరుతో అపచారం
ఆరోగ్యం పేరుతో వ్యాపారం
మోసగించే సమాజం
మోసపోవుట సహజం

అనుకుని
గడుపుతున్నాము ఈ సమయం
ఇది మనం చేసుకున్న స్వయంకృతం

పడ్డ వాడు చెడ్డ వాడు కాదు
చెడ్ద వాడు పడిపోక తప్పదు
మంచి చెడుల సంగ్రామం ఆగదు
ఆఖరికి మంచి జరగక మానదు

అనుకుని
గడుపుతున్నాము ఈ సమయం
ఇది మనం చేసుకున్న స్వయంకృతం

Wednesday, January 12, 2011

తూర్పు కనుమలు - 4: కొండపల్లి కాశీ

కొండపల్లి: కృష్ణా జిల్లా
అందమైన బొమ్మల తయారీకి ప్రసిద్ది,
పారిశ్రామీకరణతో ప్రగతి వైపు పరుగులు పెడుతున్న బెజవాడ శివారు ప్రాంతం

ఆ ప్రాంతంలో ఎన్నో యేళ్ళుగా బొమ్మల తయారీలోనే ఉండిపోయారు 'కాశీ ' కుటుంబసభ్యులు, కాశీ కూడా అదే వృత్తిని కొనసాగిస్తున్నాడు, అతని చేతిలో అద్భుతమైన బొమ్మలు రూపుదిద్దుకున్నాయి, అనతికాలంలోనే 'కొండపల్లి కాశీ ' బొమ్మలకు గిరాకీ పెరిగింది. అతనికి ఆదాయం కొంచం పెరగసాగింది, అయిన తను మామూలుగా ఉంటూ తన ముద్దుల చెల్లెలు 'హేమ 'కి యే లోటు రాకుండా చూసుకుంటున్నాడు.

కాశీ చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు అందుకే పెద్దగా చదువబ్బలేదు, తనకు తెలిసిన బొమ్మల తయారీనే అతని బలం. ఎవరూ లేనీ కాశీని వాళ్ళ పిన్ని పెంచింది, కొన్నాళ్ళకు ఆవిడ కాలం చేసింది, ఆమె కూతురే హేమ.

కాశీకి హేమంటే పంచప్రాణాలు,ఆమెని కళాశాల చదువులకోసం బెజవాడలో ఒక హాస్టల్లో చేర్పించాడు, కొన్ని రోజులు అన్నయ్యని వదిలి ఉండలేకపోయింది హేమ అక్కడ అంతా కొత్తగా ఉంది తనకి, రోజూ తొలి ముద్ద తనకి పెట్టికాని అన్నం తినే వాడు కాదు అన్నయ్య, తన తల నిమిరి నిద్రపుచ్చేవాడు ఒక తండ్రి కన్నా మిన్నగా చూసుకునేవాడు, అన్నయ్యని తలుచుకుంటూ కొన్ని రోజుల తర్వాత కొండపల్లికి వచ్చింది హేమ. కాశీ ఆమెకు నచ్చజెప్పి, భవిష్యత్తు పై నమ్మకం పెట్టుకొమ్మని, మంచిగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని చెప్పాడు.
అన్నయ్య మాట విని బుద్దిగా తిరిగి వెళ్ళిపోయింది హేమ. అలా ఒక సంవత్సరం గడిచాక హేమ ప్రవర్తనలో ఒక మార్పు కనిపించింది, తను ఇంతకు మునుపటిలా కాశీ తో మాట్లాడట్లేదు, అసలు తను యే విషయం చెప్పట్లేదు, ముభావంగా ఉంటుంది, ఆసహనం పెరిగింది.

హేమని అలా చూడలేకపోయాడూ కాశీ, తను మాత్రం హేమ తో మంచిగానే ఉన్నాడు, ఆమెని యేమి అనలేదు, తన చెల్లెలు తనతో ఎలగైనా ఉండచ్చు అనేది అతని భావాన, కొన్నాళ్ళకు హేమ చదువు పూర్తవుతుందనగా ఒక కుర్రాడిని వెంటబేట్టుకు వచ్చింది, అతను తన సీనీయర్ అని, 2 సంవత్సరములుగా ప్రేమించుకుంటున్నాం అని, పెళ్ళి చేసుకుందాం అని అనుకుంటున్నం అని చెప్పింది.

కాశీ కి యేమీ పాలుపోలేడు, తనతో ఎంతో చనువుగా ఉండే తన చెల్లి, తనకి చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందేంటి అనే ఆలొచనలో ఉన్నాడు.
గుండెల్లొ బాధని కప్పేసి కళ్ళలో లేని ఆనందాన్ని నింపి తన చెల్లి పెళ్ళికి అంగీకరించాడు.
ఘనంగా హేమ వివాహం జరిపించాడు.' తన ఆనందమే నా ఆనందం 'అని మురిసిపోయాడు.

తన ముద్దుల చెల్లి ఇప్పుడు పూర్తిగా తనని వదిలేసి వెళ్ళిపోతుంది, పెళ్ళి జరిగిన కొన్నాళ్ళకే హేమ వాళ్ళు డిల్లీ వెళ్ళిపోయారు, కాశీని కూడా తీశుకువెల్దాం అనుకున్న హేమని ఆమె భర్త వారించాడు, కాశీ రావడం ఇష్టంలేదని చెప్పాడు, అవాక్కైన హేమ తప్పని పరిస్తితులలో అతని వెంట వెళ్ళిపోయింది.

కాశీ కొండపల్లి లోనే ఉండిపోయాడూ, చెల్లెలు దూరంగా వెళ్ళిపోయింది, తన తో మాట్లడడానికి కూడా లేని పరిస్తితి, తయారు చేసే బొమ్మలు కళ తప్పాయి, ఆరోగ్యం చెడుతోంది, పెళ్ళి చేసుకోడానికి మనస్కరించలేదు, సంపాదించినదంతా మందులకే కర్చు అయింది, 20 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు కొండాపల్లి రూపురేఖలే మారిపోయాయి.

వూరి చివర ఒక చిన్న పెంకుటింట్లో నులక మంచం మీడ పడుకుని దగ్గుతున్నాడు కాశీ, ఇంతలో అతని ముందు ఒక 19 యేల్ల అమ్మాయి వచ్చింది, ఎవరు అని చూసీ ఆనందంతో కూడిన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు,
'వచ్చింది హేమ కదూ ' అని మంచం మీంచి లేచాడు,
"కాదు మామయ్య నేను స్వాతి ని, నీ మేన కోడల్ని "అంది ఆ పిల్ల,

ఆమె అచ్చు చిన్నపటి హేమ లానే ఉంది, కాశీ కంటి వెంట ఆనందభాష్పాలు,
"హేమ ఎలా ఉంది" అని అడీగాడూ,
"2 నెలల క్రితం ఒక ప్రమాదంలో అమ్మ, చనిపోయింది, మిమ్మల్ని కలవమని ఆఖరి నిమిషంలో నాతో చెప్పింది, తన చితాభస్మాన్ని క్రిష్ణా నదిలో మీరే కలపాలని చెప్పింది,తన భర్త మూలంగా మిమ్మల్ని కలవడానికి అవలేదని చాలా బాఢపడేది మామయ్యా" అని ఆపింది స్వాతి.
ఉన్న చోటే కుప్పకూలిపోయాడు కాశీ,
కన్నీళ్ళు ఇంకిపోయాయి, నోరు పెగలట్లేదు....

హేమ చితాభస్మం తీసుకుని క్రిష్ణా నదిలోకి దిగాడు,
ఆ భస్మాన్ని నీటిలో కలిపి తనూ అక్కడే మునిగిపోయాడు,
స్వాతి ఎంతసేపు చూసినా కాశీ బైటకి రాలేడు, పోలీసులు వచ్చి సాయంత్రానికి కాశీ మృతదేహాన్ని వొడ్డుకు చేర్చారు. దహన సంస్కారాలు పూర్తిచేయించి డిల్లీ బైలుదేరి వెళ్ళిపోయింది స్వాతి.

చెల్లెలి ఆఖరి కోరిక తీర్చి తనువు చాలించాడు కాశీ, అతనికి చెల్లెలంటే అంత ఇష్టం!

ఒక మంచి రోజు కోసం!

రెక్కాడితేకానీ డొక్కాడని చిన్ని బతుకులు
రెక్కలు ముక్కలయ్యేటటువంటి ధరా శరాఘాతాలు

మూలుగుతున్న పాపపు సొమ్ముల మూటలు
సాటి మనిషిని ఆదుకోలేని రాజకీయ మాయ మాటలు

అర్థం పర్థం లేని అనవసరపు దీక్షలు
పట్టెడు అన్నం పెట్టలేని ఉద్యమ సెగలు

మృగ్యమైన ఆత్మీయతలలో చీలిపోయిన దారులు
మానవత్వంతో దోబూచులాడుతున్న మరణ మృదంగాలు

హంగూ ఆర్భాటాలతో నిండిపోయిన ప్రజా సేవలు
ఊన్మాద భావాలతొ సామరస్యం మర్చిపోతున్న మతాలు

అయినా ఏదో ఒక మంచి రోజు కోసం మనందరి ఎదురుచూపులు!!

Thursday, January 6, 2011

నూతన సంవత్సర శుభాకాంక్షలు


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

సముద్రపు వొడ్డున దొరికిన చిన్న రాళ్లతో ఈ కార్దు తయారుచేసా

LinkWithin

Related Posts with Thumbnails