Monday, April 25, 2016

తూర్పు కనుమలు - 7: సాలూరు శంకరం

తూర్పు కనుమలు - 7: సాలూరు శంకరం
ప్రాంతం: సాలూరు, విజయనగరం జిల్లా


దూరంగా తూర్పు కనుమల నుండి వీస్తున్న గాలులకి ఆరుబైట నిద్రిస్తున్న శంకరానికి మెలుకువ వచ్చింది. మెల్లగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని భుజాన చిన్న గునపం, సంచిలో విత్తనాలు, కొమ్మల అంట్లు తీసుకుని కోండలకేసి బైలుదేరాడు. సుంకి రోడ్డు పక్కన్న ఉన్న చిన్న దారిలోకి చాలా దూరం వెళ్ళిపోయాడు,  సాయంత్రం చికటిపడే సరికి రోడ్దు పైకి చెరుకుని తన ఇంటికి వెల్లిపోయాడు. 

శంకరం డిగ్రీ వరకు చదివాడు, 5 సంవత్సరాల క్రితం వేసవిలో వడదెబ్బకు తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నడు, ఎం చేయాలో తెలియలేదు, విశాఖ నగరం లో పనిచేస్తూనే చదువు పూర్తిచేశాడు, తన తండ్రి ఎప్పుడు చెపుతుండే వాడు "మనిషి భూమి పైన బ్రతకాలంటే జీవవైవిధ్యాన్ని నష్టపరచకూడదు" అని, ఆ మాటలొ శంకరంలో బలంగా  నాటుకుపోయాయి. తన డిగ్రి చివరి సంవత్సరంలో యునివర్సిటీలో వాతావరణ మార్పులపైన ఒక సదస్సుకు వెళ్లి ప్రస్తుత వాతావరణ పరిస్తితి దానికి మనుషులు ఎలా కారణామవుతున్నారని తెలుసుకున్నాడు, 

"మానవ చర్యల వల్ల జరుగుతున్నా విపరిణామాల వల్లే తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నానని తెలుసుకున్నడు శంకరం. నేటి రోజున సంభవిస్తున్న వాతావరణ మార్పులు భూగోళం పైన పర్యావరణ వ్యవస్థలకు హానికారకంగా ఉన్నాయి. ప్రపంచ ప్రజలందరిపై ప్రకృతిని కాపాడుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఇది కేవలం మనకి మాత్రమే పరిమితం కాదు, మన భవిష్యత్తు తరాలకోసం కూడా.  జీవరాశిని  కాపాడుకోవడమే మన ముందున్న అసలైన సమస్య. వాతావరణ మార్పు అనేది  సహజసిద్ధంగా కాకుండ మానవ ప్రభావిత అంశంగా మారింది.  అత్యధిక స్తాయిలో  కర్బన ఉద్గారాలు  వాతావరణంలోకి  విడుదల అవుతున్నాయి, భూ  వాతావరణంలో  వీటి కేంద్రీకరణ వలన  తీవ్ర వాతావరణ పరిస్థితులు సంభవిస్తున్నాయి . 20 వ శతాబ్దాంతానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీనదాల ఉపరితల ప్రదేశం 50% తగ్గిపోయింది.  బొగ్గు, సహజవాయువు, ఇనుపఖనిజం లాంటి వనరులని తవ్వితీయడం, పారిశ్రామిక వ్యర్థ రసాయనాల పారబోత వళ్ళ కలిగే నీటి కాలుష్యం, జనావాసాల, వ్యవసాయం కోసం  అడవుల నరికివేత లాంటి ఎన్నో అంశాలు ఈ రోజున కనివిని ఎరుగని స్తాయిలో  భూతాపం పెరగడానికి కారణమవుతున్నాయి. ఈ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, విపత్తులు, వరదలు ఎక్కువవుతున్నాయి, కరువుకాటకాలు పెరుగుతున్నాయి,  ఋతువులు క్రమంతప్పుతున్నాయి, . ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భూమి పై జీవరాశి కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నయి"సభలో  శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.   శంకరం తన తండ్రిని గుర్తుచేస్కున్నాడు . 

చదువు పూర్తయ్యాక సాలూరు తిరిగి వచ్చి  తనకున్న చిన్న పొలంలో కూరగాయలు సాగుచేసుకోశాగాడు. తన తోటి వారికి పర్యావరణం గురించి, దానిని రక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియచేసేవాడు, కొందరు వినేవాళ్ళు, కొందరు హేళన చేసేవాళ్ళు అయిన తను చెప్పడం మానలేదు. అడవులను, చెట్లను కాపాడాలని, జీవవైవిధ్యానికి తోడ్పడాలని  చిన్న గ్రామాలలో ప్రజలను  చైతన్య పరిచేవాడు.  తన వంతుగా కొండ ప్రాంత అడవిని  అనుకుని ఉన్న చిన్న బంజర ప్రాంతాన్ని రేల, మద్ది, రేగు, వేప, చింత, నేరేడు, ఇసుకరాసి వంటి చెట్లతో ఒక అడవిగా మలిచాడు ఈ 5 సంవత్సరాలలో. ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యానికి తోడ్పాటుని ఇచ్చాడు. ఆ అడవిని చూసు కోవడానికి రోజు శంకరం  పొద్దున్నే వెళ్లి వస్తుంటాడు.  

ఆ చుట్టూ పక్కల ప్రాంతాలలో శంకరం ని చూసి ఇంకొంతమంది మన వాతావరణానికి అనుకూలంగా ఉండే చెట్లను పెంచసాగారు, కొంతకాలానికి శంకరం "సాలూరు జీవవైవిధ్య పరిరక్షక సమితి " అనే సంస్థను స్తాపించి  రాష్ట్ర వ్యాప్తంగా  పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన్ కల్పిస్తూ తన వంతుగా ప్రకృతికి సేవ చేస్తున్నాడు  మన "సాలూరు శంకరం "  

Wednesday, February 3, 2016

క్యాన్సర్!. నాడు.. నేడు..



నాడు ఒక రాచపుండు  ఈ క్యాన్సర్..
నేడు ఒక ప్రాజాపుండు ఈ క్యాన్సర్..

నాటి గాలిలో లేదు ఈ క్యాన్సరు..
నేటి ఆవరణంలో ఉన్నదంతా క్యాన్సరే..

నాటి జీవనశైలిలో లేదు ఈ క్యాన్సరు..
నేటి జీవనవిధానంలో ఉన్నదంతా క్యాన్సరే..

నాటి ఆహారంలో లేదు ఈ క్యాన్సరు..
నేటి తినుబండారాలలో ఉన్నదంతా క్యాన్సరే..

నాటి రోజున మందు లేనిది ఈ క్యాన్సరు..
నేటి రోజున ఆరోగ్య వ్యాపారము ఈ క్యాన్సరు..

అవగాహన పేంచుకో..
నేడు ఎందుకు వస్తుందో తెలుసుకో..  ఈ క్యాన్సరు..

(ప్రపంచ క్యాన్సర్ దినం - 4 ఫిబ్రవరి )

LinkWithin

Related Posts with Thumbnails