మీరు చూసింది నిజమే!
అదుర్స్ vs ఆస్ట్రేలియన్స్ , వీటికి రెండు సమస్యలు ఒకటి ప్రాంతీయం మరొకటి జాతీయం.
ఒక చిత్రాన్ని మన వాళ్లే అడ్డుకుంటాం, ఆడనియం అన్నారు,
మరొకర్ని మన దేశంలో ఆటలే అడనివ్వం అన్నారు.
ఒక సినిమాని అడ్డుకోవటం అనేది పిచ్చి పని .
క్రీడలను అడ్డుకోవడం అంతకంటే పిచ్చి పని.కాకపోతీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది..
మన దేశ పౌరుల పై జాత్యహంకార దాడులు జరగటం వల్ల కోందరు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళని మన దేశంలో అడనివ్వమని అంటున్నారు, ఇది ఒకరకముగా సమంజసమైన భావోద్వేగమే, ఎందుకంటే అది మన జాతీయతా పై జరిగిన దాడి.
అయితే మన భాష చిత్రాలని అడ్డుకోవడం అనేది సరైన చర్య ముమ్మాటికి కాదు.
ఇది కోందరి అవివేకమైన చర్య, కళాకారులకి, క్రిడాకరులకి ఎల్లలు లేవు .
"అత్త మిద కోపం దుత్త మిద చూపినట్టు" ఉంది అదుర్స్ సినిమా ని అడ్డుకోవాలనుకోవడం.
సినిమాకి అన్ని ప్రాంతాలు ఒక్కటే. వాటిని ఎక్కడైనా ఆదరించాలి .
అలాగే క్రీడలను కూడా మనం ఆదరించాలి అన్నది నా అభిప్రాయం..
3 comments:
you are 100% correct.. art has no barriers...
ఎవరో కొందరు వద్దన్న మాత్రాన ఎక్కడా ప్రదర్శన ఆగిపోదు. అంత తెలంగాణా అభిమానమున్న వ్యక్తులెవరైనా ఉంటే సినిమాచూడ్డం మానేయాలి. అంతే కానీ సినిమానే ఆపివేయమనడం సమంజసం కాదు. :)
అతనెవరో అన్నట్టు... సినిమా అంటే హీరో ఒక్కడే కాదు కదా! ఒక సినిమా మీద ఎంతమంది ఆధారపడి ఉంటారు... అందులో తెలంగాణా వాళ్ళు కూడా ఉండొచ్చు.
అంతెందుకు ఒక సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాని మీద ఆధారపడే వాళ్ళు, దాని ద్వార లబ్ది పొందే చిన్న చిన్న సామాన్యులు ఎంతోమంది ఉంటారు. సినిమా ఆపేయటం అంటే అలంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టటమే!
Post a Comment