తూర్పు కనుమలు - 2
స్నేహితుడి సేవ
సమయం: ఉదయం 9:00
ప్రాంతం: గోకవరం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తూ.గో జిల్లా
ఆ రోజు చల్లగా ఉంది, రవికి ఏదో తెలియని ఆనందం, నెల రోజుల తర్వాత మళ్ళీ తను శ్రావ్యని చూడబోతున్నాడు, ఆమె అంటె రవికి చాల ఇష్టం, అభిమానం, కాని ఇప్పటివరకు తనతో ఒక్క మాట కూడ మాట్లాడలేదు, అలా నడుస్తూ వస్తున్న శ్రావ్య కేసి చూస్తూ గాల్లొ తేలిపోతున్నాడు రవి, ఇంతలో ఎవరో ఇద్దరు చేతులు పట్టుకు లాగాడంతో భూమ్మిదకి వచ్చడు. వాళ్ళిద్దరు రవి స్నేహితులు, ఒకడు టిల్లు మరొకడు, శ్యాం, ఇద్దరు కలిసి రవిని ఆటపట్టించసాగారు. ఇలా కొంతకాలం గడిచింది, ఒక రోజు టిల్లు శ్రావ్య తో మాట్లాడుతూ రవి కేసి చూపించాడూ, శ్రవ్య రవికేసి చూసి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది,కొన్ని రోజులు గడిచాక రవి శ్రావ్య దెగ్గరికి వెళ్ళీ తన ప్రేమ విషయం చెప్పాడు, ఆమె ఆష్చర్యంగా మొహం పెట్టి, తను టిల్లూని ప్రేమిస్తున్నాను అని చెప్పింది, రవి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు, తని ఇన్నాళ్ళూ తన ప్రేమకు సాయం చేయమంటే టిల్లు మొత్తానికే మోసం చేశాడు, కాదు కాదు తన చేతకానితనాన్ని అతను అనుకూలముగా మలచుకున్నాడు. శ్యాం కూడా టిల్లూకి సహాయం చేశాడు, రవిని ఒక పావులా వాడుకున్నారు, కాని రవి మనసు గాయపడింది, ఒకటి శ్రావ్య తిరస్కరించినందుకు, రెండు స్నేహితులే తనని మోసం చేసినందుకు, తట్టుకోలేకపోయాడు, కొన్నాళ్ళు కళాశలకి రావడం మానేశాడు, వూరి చివర కొండల్లో, గుట్టల్లో పిచ్చివాడిలా తిరిగాడు.
ఒకరోజు జోరున వాన కురుస్తుంది, కొండలలో తిరుగుతూ తడుస్తూ వాగు వొడ్డుకు చేరుకున్నాడూ రవి, అక్కడ బల్లకట్టు గోకవరానికి వెల్లడానికి సిద్దంగా ఉంది, అప్పటికే దానిపై చాళా మంది ఉన్నారు, రవి ఎక్కాక బల్లకట్టు బైలుదేరింది, ఇంతలో వాగు పొంగింది, బల్లకట్ట పై బరువు పెరగడంతో మునిగిపోయి కొట్టూకుపోయేటట్టు ఉంది, వాగు ఉధ్రుతంగా ఉండడంతో ఎవారూ దూకడానికి ధైర్యం చేయలేడు పైగా చాళ మంది ఆడవాళ్ళు ఉన్నారు ,ఒకరు దిగితే కాని బల్లకట్టూ అదుపులోకి రాదు, రవి, ఒక ముసలాయన, ఒక చిన్న కుర్రాడు తప్ప మిగితావారంత పని కోసం వచ్చిన కూలి మహిళలే, బల్లకట్ట కొట్టుకుపోయెట్టత్తు ఉంది, నా జీవితం ఎలాగో వ్యర్ధం నేను దూకేస్తాను అనుకుని రవి దూకబోయాడు, అతని చేతిని ముసలి తాత పట్టుకుని ఆపి, " నీకేమైనా పిచ్చా బ్రతికి సాధించు, ఇంకా బోలెడు జీవితముంది కదా, ఎవరూలేని నేను మీకోసం ఇక్కడికి వచ్చానేమో, నేను దూకుతాను, పోయినా పర్లేదు, మీరు క్షేమంగా వొడ్డుకు రండి" అని రవిని వెన్నక్కి నెట్టి అతను దూకేశాడు, బల్లకట్టు నెమ్మదిగా అదుపులోకి వచ్చింది, అందరు వొడ్డుకు చేరారు, ఆ ముసలి తాత ఇంక వాగులోనే ఉన్నడు, రవి వొడ్డు వెంబడి వెళ్ళాడు, చీకటి పడింది, తాత జాడ లేదు.
రవి ఆలొచనలో పడ్డడు, తన ఆవేదనని సంకల్పముగా మలచుకున్నాడు, కొన్నాళ్ళకు దేశంలోనె ఒక పెద్ద శాశ్త్రవేత్తగా అవతరించాడు. తన సొంత వూరు గోకవరానికి వచ్చాడు, అతనికి అపూర్వ స్వాగతం లభించింది, కాని రవి వినకూడని వార్త ఒకటి విన్నాడు, టిల్లూకి శ్రావ్యకి పెళ్ళి జరిగిన రోజునే, టిల్లూని కొందరు సంఘవిద్రోహ శక్తులు కాల్చి చంపారని, ఆ సంఘటన వల్ల శ్రావ్య పిచ్చిదైపోయిందని. ఒక్కసారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి రవికి, శ్యాం గుండె జబ్బుతో మరణించాడాని తెలిసి ఇంకా భాదపడ్డాడు. శ్రావ్యని అక్కడి నుండి తీసుకువెళ్ళి ముంబైలో చికిత్స చేయించాడు, తను తిరిగి మాములు మనిషి అయ్యే దాక కంటికి రెప్పలా చూసుకున్నాడు రవి, ఎందుకు ఇదంతా అని ఎవరైనా అడిగితే, "నా స్నేహితుడి కోసం నేను చేస్తున్న సేవ" అని చెప్పెవాడు రవి.
6 comments:
అప్పుడే రెండో కథ. బాగుంది.:)
స్నేహం విలువైనదని కథలో బాగా చెప్పారు!
Before you post, correct mistakes. There are dime a dozen in this post. Story is good but spelling and grammatical mistakes impede reading.
@anonymous, thanks for your suggestion, will definitely rectify the mistakes in the coming posts. :)
Supero Superu..... climax sad chesesaaru kaani.. oka flow continue ayyindi.. chivari daakaa inkaa inkaa.. annattu.. chadivinchindi.. very good write-up.. ;)
Nayani Aditya Madhav గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
Post a Comment