కావలసినవి అన్నీ ఉన్నా 'అన్నా-చెల్లి' అనే పిలుపులు లేని
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !
పంతాలు పట్టింపులతో , కుళ్ళు కుతంత్రాలతో నిండిన
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !
ఒకరి రక్తమాంసాలతో వేరొకరు కీర్తిని పొందుతున్న
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !
ప్రకృతిని ప్రేమించలేక ప్రళయానికి చేరువవుతున్న
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !
స్త్రీ మూర్తిని గౌరవ భావంతో చుడలేని
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !
'తన' అనే తప్ప 'మన' అనే భావన లేని
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !
తప్పు చేసిన దానిని కప్పిపుచ్చుకుని
మరో తప్పుకి సిద్దపడుతున్న
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !
10 comments:
మీ బాధ, భావం నాకు నచ్చాయి.
అన్నట్టు మీ చిన్నప్పటి ఫోటో బావుంది :)
Good one! Cute photo :-)
బాగా చెప్పినా అన్ని నిజాలే చెప్పారు
నచ్చకపోతే మార్చేసుకుందాం...పెద్ద పనేంకాదుగా :) :)
@shanky: హెంత మాట హెంత మాట !!!, అలా open statements ఇస్తే ఎలాగండి.
బాగా రాసారు.. వక్తం చేసిన విషయాలు కాదనలేనివి.. స్త్రీని గౌరవించమని చిన్నప్పుడు చదువుకున్న విషయాలు.. నేటి ప్రపంచంలో.. పలు చోట్ల.. కేవలం పుస్తకాలకే పరిమితాలయ్యాయి.. అయితే.. "అన్నా-చెల్లి" గురించి..మీరు రాసిన మొదటి లైను వెనుక ఏముందో అర్థం కాలేదు... మీరు సోదర సోదరి భావం గురించి చెప్పారనుకున్నాను..!
నాకు నచ్చట్లేదు.....:)
ప్రపంచంలో మీకు కనపడనివన్నీ లేవనుకుంటే అది తప్పే అవుతుంది. అన్నా, చెల్లీ అని పిలుచుకునే వారు నేటికీ ఎందరు లేరు? ప్రపంచంలో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. చూసే మీదృష్టినే మార్చుకుంటే సరిపోతుందేమో!? లేదా ఆ చెడును సవరించే వీలు మీ పరిధిలో ఏమైనా ఉందేమో ఆలోచించండి. అంతే కానీ ఈ ప్రపంచం నాకు నచ్చలేదు అంటే ఎలా?
నచ్చనిదానిని నచ్చిన విధంగా మార్చేందుకు ప్రయత్నం, దానితో కొనసాగుతూనే మనల్ని మనం నిలబెట్టుకొనే ప్రయత్నమే జీవితం..
కాదంటారా?
chala baga rasav
he he he heeeee
Post a Comment