ఆటుపోట్ల జీవనానికి అలవాటు పడుతున్నా!
మనసున్న మనిషిగా ఒంటరవుతున్నా
స్నేహితులతో కలివిడిగా ఉండలేక విడిపోతున్నా!
ఆత్మీయులకి అందనంత దూరం వెళ్ళిపోతున్నా
జీవితంలో ఓ తోడుకోసం నే వెతకకున్నా!
నాకు తోడుగా ఉన్నవారిని వదిలేస్తున్నా
నరుడిగా నలుగురికి ఉపయోగపడుతున్నా!
నాకంటూ ఏమీ లేని వాడిగా బ్రతికేస్తున్నా
జీవిత పరమార్ధం ఏమిటొ వెతుకుతున్నా!
కానీ! నన్ను నేను మోసం చేసుకుంటూ,
నేను నేనుగా జీవించడం మర్చిపోతున్నా!
3 comments:
mee "kapi"twaalanni,photolanni xcellentgaa unnaaye
ee kavitha baga rasaru..ee kavitha chauvuthunta ma frnd gurthu vasthunadu...
ఏమీ చెప్పలేను.. ఎందుకో కూడా తెలీదు.. I wish You would come back
Post a Comment