సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం నుండి కనిపిస్తున్నది.
కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు.
సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార లు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉన్నది. స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉన్నది
సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం.
సింహాచలం మెట్లదారి ఆంజనేయుడు.
గత రెండు శతాబ్దాలుగా విజయనగర రాజుల కుటుంబ సభ్యులు ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు
దేవాలయంలో దర్శనవేళలు-
ఉదయం 6 నుండి 11 మరియు
మధ్యాన్నం 12 నుండి సాయంత్రం 4
సాయంత్రం 6 నుండిరాత్రి 9 వరకూ..
Note: Photos captured by me using Nokia 7210s mobile camera with 2MP
2 comments:
:)
Very good...
Post a Comment