Monday, December 31, 2012

2013 కొత్త క్యాలెండర్ (ఉత్తరాంధ్ర ప్రత్యేకం)


2013 కొత్త క్యాలెండర్  గోడకాగితాలు (ఉత్తరాంధ్ర ప్రత్యేకం)
నూతన సంవత్సర శుభాకాంక్షలు :) 

Desktop Calender 2013. Uttarandhra Special
Photos by N. Aditya Madhav
Edited using Photoshop.
Click on the image for full resolution.




Happy New Year

Wednesday, December 12, 2012

అంతర్లీనంగా........

Image is one of my Photoshop works

ప్రేమ కంటే జీవితం గొప్పది
ఆశ కంటే ఆశయం గొప్పది
అవని కంటే అమ్మ గొప్పది
నోటిమాట కంటే చేతిసాయం గొప్పది!

కాలం మారినా ప్రేమ మారదు.
కాలంతో పాటు మారేది ప్రేమ కాదు!

నీ జీవితంలోకి ఎవరూ రారు
నీ జీవితంలోంచి ఎవరూ పోరు!

నిన్ను సంతోషపెట్టేవాళ్ళంతా మంచివాళ్ళు కాదు
నిన్ను భాదపెట్టేవాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు!

ఖర్మ ని ఆచరించు,
నీ భాద్యతని నిర్వర్తించు!

గతాన్ని మర్చిపోకు,
అలా అని గతంలోనే ఉండిపోకు!

లోపం ఎక్కడ ఉందొ తెలుసుకో, 
నువ్వు జాగ్రత్తగా మసలుకో!

తలయెత్తి జీవించు
నిన్ను నువు ప్రేమించు!

ఎందుకంటే నీ జీవితం లోనే ప్రేమ ఉంది!

అంతర్లీనంగా........

Friday, November 23, 2012

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 20


నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
Mobiles used Nokia 7210s , samsung s3310i and fly-sx210 with 2MP కామెరా

Dammagiri at Duvvada in Visakha District

VUDA park in Vizag

Hyderabad

Sunset at Samalkot

Sunset at Bheemili Beach


Tuesday, November 13, 2012

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 19


నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
Mobiles used Nokia 7210s , samsung s3310i and fly-sx210 with 2MP కామెరా

Clouds at Vijayawada

Boat and anchor at Bheemili

Evening Scenic view at Bhadrachalam Temple

View at Chennai

Beach plant at Bheemili

Sunset at Bhadrachalam Town

Wednesday, November 7, 2012

స్నేహానికి దశాబ్ధం!




ఒక స్నేహానికి..
ఒక స్వప్నానికి..
దశాబ్ధం!

ఆటుపోట్లు
లోటుపాట్లు
తట్టుకుని నిలుచున్నది ఈ దశాబ్ధం!

అప్యాయతని
అనురాగాన్ని
పంచినది ఈ దశాబ్ధం!

కాలం ఎంత గడచినా
కలసివుంటే కలదు సుఖము
ఈ మధురానుభూతి శాశ్వతం!

మరెన్నో దశాబ్ధాలు నిలుస్తుంది మన స్నేహం!

Dedictaed to My friends Siva Cheruvu and Santhosh Charugulla from Bhadrachalam
(As Friendship completes a Decade)

Thursday, September 27, 2012

కాలంతో పాటు!

Time is the healer of all wounds
===============================

కాలంతో పాటు ఏ గాయమైనా మానిపోతుంది.

ఏదో ఒక రోజు మానిపోయే గాయం గురించి ఆలోచిస్తూ
మనసు పాడుచేసుకోవడం ఎందుకు!

మనిషికి గతం ఉండవచ్చు
కాని......
గతంలోనే మనిషి ఉండిపోకూడదు.

జీవితానికి ప్రేమ అవసరమే
కాని ప్రేమే జీవితం కాదు..
కాకూడదు..

Be a man, 
Be a useful man,
Be a successful man.
==============================
చిత్రం: అందమైన మనసులో
మాటలు:  కులశేఖర్
కథ, దర్శకత్వం: R. P. పట్నాయక్

Monday, September 10, 2012

తూర్పు కనుమలు - 6: తొట్లకొండ అప్పారావు!

తూర్పు కనుమలు - 6: తొట్లకొండ అప్పారావు!
ప్రాంతం: తొట్లకొండ, విశాఖజిల్లా
అది బౌద్ధం ఫరిడవిల్లిన నేల,
ఇక్కడి నుండే తూర్పు దేశాలకు బౌద్ధం వ్యాప్తి చెందింది,
అటువంటి పురాతన బౌద్ధ అవశేషాల నిలయం విశాఖ తీరాన గల తొట్లకొండ.
(Thotlakonda : Thotti means cistern in Telugu)
 
ఆ అవశేష సంపద జాతీయ పురావస్తు సంస్థ ఆధీనంలో ఉంది.
ఆ సంపద కాపలాదారుడు మన అప్పారావు!

అక్కడ గుట్ట మీద చారిత్రక సంపదను నేటి ముష్కరుల ధాటి నుండి కాపాడటం మన అప్పారావు వృత్తి
అతని నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్ళేంత జీతం మాత్రమే వస్తుంది, అయినా అక్కడే 12 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఒక రోజు పై అధికారులు వచ్చి అకారాణంగా అప్పారావుని నిందించి వెళ్ళారు, అప్పటి నుండి అతను చాలా మధనపడ్డాడు పనిలో ఏకాగ్రత తగ్గింది, ఎంత చేసినా ఇంతే అనుకుని కాలం గడపసాగాడు. తన ముందు ఉన్న బౌద్ధ అవశేషలు తనూ ఒక లాగే అనిపించారు. సరైయిన పాలన లేక ఆ చొటు సందర్శనకు అనువుగా లేకుండా పోయింది.

ఒక రోజు మధ్యాన్నం ఒక వ్యక్తి ఆ ప్రాచీన క్షేత్ర సందర్శన కై వచ్చాడు. అతని తో మాటా మంతి కలిపాడు,
నా జీవితం ఇక్కడే అయిపోతుంది సారు, ఎంత చేసినా వాళ్ళకి నేనంటే చిన్న చూపే, ఇక్కడ నేను పడే తపనకి కనీస విలువ కూడా లేదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మా పురావస్తు శాఖలో అవినీతి వల్ల నాకు జీతం కూడా సరిగా రాదు, అయినా నేను జాతి సంపదను చూసుకుంటున్నా కాని నన్ను మాటలతొ గాయపరిచారు అధికారులు, మా లాంటివాళ్ళకు సరైన సౌకర్యం లేకుండా పోతుంది, కాపలా కుక్క కంటే హీనంగా ఉంది మా పరిస్తితి అని వాపోయాడు అప్పా రావు అతని దగ్గర. ఆ వ్యక్తి అంతా మౌనంగా వింటూ ఆ పరిసరాలను, బౌద్ధ అవశేషాలను గమనిస్తూ అప్పరావు భుజం తట్టి వెళ్ళిపోయాడు.

కొన్ని రోజుల తర్వాత ఒక వార్తా పత్రిక కధనం ఆధారముగా పురావస్తు శాఖ పరిరక్షణ కేంద్రాల వద్ద ఉన్న కాపలాదారులకి జీత భత్యాలు వారి కనీసావసరాలకి తగ్గట్టుగా పెంచుతూ ఒక ప్రకటన వెలువడినది,
అలానే అక్కడి కాపలాదారులకి పక్కా గృహ సదుపాయం కూడా కల్పిస్తున్నట్టు, వారి సేవలను గుర్తిస్తామని పేర్కొన్నది.

ఆ వార్త గురించి తెలిసి అప్పారావు తడి కన్నులతో  మాహా స్తూపం కేసి చూస్తూ ఉండి పోయాడు,
అక్కడ కొన్ని రోజుల క్రితం వచ్చిన వ్యక్తి అతనికేసి చూసి  నవ్వుతూ,
ఆ స్తూపం వెనక్కి వెళ్ళిపోయినట్టు ఆనిపించింది.






LinkWithin

Related Posts with Thumbnails