తూర్పు కనుమలు - 6: తొట్లకొండ అప్పారావు!
ప్రాంతం: తొట్లకొండ, విశాఖజిల్లా
అది బౌద్ధం ఫరిడవిల్లిన నేల,
ఇక్కడి నుండే తూర్పు దేశాలకు బౌద్ధం వ్యాప్తి చెందింది,
ఇక్కడి నుండే తూర్పు దేశాలకు బౌద్ధం వ్యాప్తి చెందింది,
అటువంటి పురాతన బౌద్ధ అవశేషాల నిలయం విశాఖ తీరాన గల తొట్లకొండ.
(Thotlakonda : Thotti means cistern in Telugu)
ఆ అవశేష సంపద జాతీయ పురావస్తు సంస్థ ఆధీనంలో ఉంది. ఆ సంపద కాపలాదారుడు మన అప్పారావు!
అక్కడ గుట్ట మీద చారిత్రక సంపదను నేటి ముష్కరుల ధాటి నుండి కాపాడటం మన అప్పారావు వృత్తి
అతని నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్ళేంత జీతం మాత్రమే వస్తుంది, అయినా అక్కడే 12 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఒక రోజు పై అధికారులు వచ్చి అకారాణంగా అప్పారావుని నిందించి వెళ్ళారు, అప్పటి నుండి అతను చాలా మధనపడ్డాడు పనిలో ఏకాగ్రత తగ్గింది, ఎంత చేసినా ఇంతే అనుకుని కాలం గడపసాగాడు. తన ముందు ఉన్న బౌద్ధ అవశేషలు తనూ ఒక లాగే అనిపించారు. సరైయిన పాలన లేక ఆ చొటు సందర్శనకు అనువుగా లేకుండా పోయింది.
ఒక రోజు మధ్యాన్నం ఒక వ్యక్తి ఆ ప్రాచీన క్షేత్ర సందర్శన కై వచ్చాడు. అతని తో మాటా మంతి కలిపాడు,
నా జీవితం ఇక్కడే అయిపోతుంది సారు, ఎంత చేసినా వాళ్ళకి నేనంటే చిన్న చూపే, ఇక్కడ నేను పడే తపనకి కనీస విలువ కూడా లేదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మా పురావస్తు శాఖలో అవినీతి వల్ల నాకు జీతం కూడా సరిగా రాదు, అయినా నేను జాతి సంపదను చూసుకుంటున్నా కాని నన్ను మాటలతొ గాయపరిచారు అధికారులు, మా లాంటివాళ్ళకు సరైన సౌకర్యం లేకుండా పోతుంది, కాపలా కుక్క కంటే హీనంగా ఉంది మా పరిస్తితి అని వాపోయాడు అప్పా రావు అతని దగ్గర. ఆ వ్యక్తి అంతా మౌనంగా వింటూ ఆ పరిసరాలను, బౌద్ధ అవశేషాలను గమనిస్తూ అప్పరావు భుజం తట్టి వెళ్ళిపోయాడు.
కొన్ని రోజుల తర్వాత ఒక వార్తా పత్రిక కధనం ఆధారముగా పురావస్తు శాఖ పరిరక్షణ కేంద్రాల వద్ద ఉన్న కాపలాదారులకి జీత భత్యాలు వారి కనీసావసరాలకి తగ్గట్టుగా పెంచుతూ ఒక ప్రకటన వెలువడినది,
అలానే అక్కడి కాపలాదారులకి పక్కా గృహ సదుపాయం కూడా కల్పిస్తున్నట్టు, వారి సేవలను గుర్తిస్తామని పేర్కొన్నది.
ఆ వార్త గురించి తెలిసి అప్పారావు తడి కన్నులతో మాహా స్తూపం కేసి చూస్తూ ఉండి పోయాడు,
అక్కడ కొన్ని రోజుల క్రితం వచ్చిన వ్యక్తి అతనికేసి చూసి నవ్వుతూ,
ఆ స్తూపం వెనక్కి వెళ్ళిపోయినట్టు ఆనిపించింది.
1 comment:
Good Climax
Post a Comment