Thursday, September 3, 2015

కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని-7



*భారత రక్షణ వ్యవస్థ సర్వ సైన్యాధ్యక్షుడు అయిన రాష్ట్రపతి యుద్ధ ప్రకటన, సంధి ప్రకటన చేస్తారు.

*17వ శతాబ్దంమొఘల్ సామ్రాజ్యం కాలంలో ఢాకా నగరానికి "జహాంగీర్ నగర్" అని పేరు.

*23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.

*ఈనాడు “బ్రిటిష్ దీవులు" అని పిలచే భూభాగంలో పూర్వం ఐదు రాజ్యాలు ఉండేవి.

*హిందూ మహా సముద్రం పరిమాణం 292,131,000 క్యూబిక్ కిలోమీటర్లు (70,086,000 మైళ్లు)గా అంచనా వేశారు.

*దంతం "డెంటయిన్" అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఇది ఎముక కంటే గట్టిగా ఉంటుంది.

*బ్రిటీష్ పాలనలో దేశం ఉన్న స్థితిలో తెలుగువారిలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి "ఆంధ్రపత్రిక" ఉపకరించింది.

Thursday, August 27, 2015

మనకెందుకొచ్చిన గోల!


పిల్లలు తినే పీచుమిఠాయిలు రసాయనిక రంగులతో హానికరంగా మారిపోతున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!

శక్తి కోసం రోజూ తగే పాలు నాణ్యతలేక నానాటికి విషపూరితమవుతున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!

శీతల పానీయాలలోని పురుగుమందుల అవశేషాలు వ్యాధులని తెస్తున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!

అవసరం లేని కృత్రిమ తిండి పదార్ధాలన్ని ఆకర్షనీయమైన  ప్యాకింగులలొ వస్తున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!

పిజ్జాలు, బర్గర్లూ, చాట్ మసాలాలు మన జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!

జన్యుమార్పిడి పంటల ద్వారా అనారొగ్యకరమైన కూరగాయలు, పండ్లు వస్తున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!

దేశానికి అన్నం పెట్టే రైతన్న జాడ లేక పంట పొలాలు కనుమరుగవుతున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!

Sunday, August 23, 2015

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 22

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
ఈ చిత్రాలు నా వికిమీడియా పేజీపైన కూడా ఉన్నాయి.
The following images are by Adityamadhav83 (Own work) [CC-BY-SA-3.0 (http://creativecommons.org/licenses/by-sa/3.0) or GFDL (http://www.gnu.org/copyleft/fdl.html)], via Wikimedia Commons

విశాఖ జిల్లా లోవపాలెం వద్ద సముద్రతీరం

పిఠాపురం రైలు సముదాయం 

కంబాలకొండలో "వాక పూలు"

విజయనగరం జిల్లా రామతీర్థాలలొ "బోధికొండ"

ఖమ్మం జిల్లా కొత్తగూడేంలో ఒక వివాహ వేడుకకి అలంకరించిన పందిరి పై కప్పు





Thursday, August 20, 2015

2013 హిమాలయ మహావిలయ గుణపాఠాలు - 2

2013 హిమాలయ మహావిలయ గుణపాఠాలు - 2

Image courtesy: Deccan Chronicle

మనిషి ఆత్యాశ ప్రకృతి సంపద, సమతుల్యాన్ని హరించి, సామూహిక జనహనన విపత్తులకి కారణమవుతుంది. అడవుల కోత, విచ్చలవిడి నిర్మాణాలు, వాతావరణ కాలుష్యాల వల్లే ఈ మహా విపత్తు సంభవించింది.

గడచిన 100 సంవత్సరాలుగా పారిశ్రామిక కాలుష్యం పెరగడం, మానవ అవసరాల కోసం విపరీతంగా చెట్లు నరకడంతో అడవులు కుచించుకు పోవడం మొదలైన కారణాల వల్ల భూమి ఉష్ణోగ్రత నానాటికీ పెరిగిపోతోంది. అత్యధిక స్తాయిలో  గ్రీన్ హౌస్ వాయువులైన  కర్బన ఉద్గారాలు ,  మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లు వాతావరణంలోకి  విడుదల అవుతున్నాయి, భూ  వాతావరణంలో  వీటి కేంద్రీకరణ వలన ఆర్కిటిక్ మంచుపొరలు తగ్గి  సముద్ర మట్టాల పెరుగుదల, ఇతర  తీవ్ర వాతావరణ పరిస్థితులు సంభవిఇస్తున్నాయి . 20 వ శతాబ్దాంతానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీనదాల ఉపరితల ప్రదేశం 50% తగ్గిపోయింది.

అటవీ భూముల తొలగింపు కూడ నేల సాంద్రతను కోల్పోవడానికి ఒక ముఖ్య కారణంగా ఉన్నయి. ఇవన్ని కూడ ప్రత్యక్షంగా , పరోక్షంగా జీవ వైవిధ్యాన్ని ప్రభావిత పరుస్తున్నయి.  నేటి రోజున వాతావరణ మార్పు అనేది  సహజసిద్ధంగా కాకుండ మానవ ప్రభావిత అంశంగా మారిపోయింది.

బొగ్గు, సహజవాయువు, ఇనుపఖనిజం లాంటి వనరులని తవ్వితీయడం, పారిశ్రామిక వ్యర్థ రసాయనాల పారబోత వల్ల  కలిగే నీటి కాలుష్యం, జనావాసాల, వ్యవసాయం కోసం   అడవుల నరికివేత లాంటి ఎన్నో అంశాలు ఈ రోజున కనివిని ఎరుగని స్తాయిలో  భూతాపం పెరగడానికి కారణమవుతున్నాయి. 

ఈ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, విపత్తులు, వరదలు ఎక్కువవుతున్నాయి, కరువుకాటకాలు పెరుగుతున్నాయి,  ఋతువులు క్రమం  తప్పుతున్నాయి, విపరీతమైన కర్బన ఉద్గారాలు విడుదల వల్ల  సముద్రజలాలు ఆమ్లమయం అవుతున్నాయి. 

వేగవంతమైన పారిశ్రామీకరణ వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. అందువల్ల వాతావరణంలోకి గ్రీన్ హౌస్ వాయువులు అధిక సంఖ్యలో విడుదలవుతున్నాయి. బొగ్గు, చమురు, సహజ వాయువుల వంటి శిలాజ ఇంధనాలను మండించినప్పుడు కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలౌతుంది. అడవులను నాశనం చేసినప్పుడు చెట్లల్లో నిల్వ ఉండే బొగ్గు (కార్బన్‌) బొగ్గు పులుసు వాయువు ( కార్బన్‌ డైఆక్సైడ్‌ ) గా వాతావరణంలోకి చేరుతుంది. 

19వ శతాబ్దంలోనే ప్రపంచవ్యాప్తంగా  అటవీ నిర్మూలన బాగా పెరిగింది. జనాభ పెరుగుదల, మానవ అవసరాలు, వ్యవసాయం, పరిశ్రామికరణ  వల్ల భూమిపై ఉన్నఅరణ్యాల్లో సుమారు సగ భాగం మాయమైపోయాయి. భూమిపై 1947 వరకు ఉన్న 15 మిలియన్ల నుంచి 16 మిలియన్ల క్మ్2(5.8 మిలియన్ల నుంచి 6.2 మిలియన్ల చదరపు మీటర్ల వరకు) మొత్తం అటవీ ప్రాంతంలో7.5 మిలియన్లు మరియు 8 మిలియన్ క్మ్2మధ్య (2.9 మిలియన్ల నుంచి 3 మిలియన్ చదరపు మీటర్లు) అటవీ భాగం నిర్మూలించబడింది.

Image Source: Alex Rio Brazil from Wikimedia Commons

ప్రపంచవ్యాప్తంగా అడవుల సంరక్షణకై గణనీయమైన చర్యలు తీసుకోకుంటే 2030నాటికి 10 % క్షీణ దశకు చేరుకున్న అరణ్య భాగం మిగిలివుంటుందని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేశారు.80% అటవీ భాగం నష్టపోవడంతోపాటు, వేలాది జీవజాతులను కూడా కోల్పోవడం జరుగుతుందని హెచ్చరించారు. చెట్లు వాటి యొక్క వేర్లు ద్వారా భూగర్భజలాలను గ్రహించి, వాతావరణంలోకి విడిచిపెడతాయి. 

అటవీ ప్రాంతం నిర్మూలించబడినప్పుడు, చెట్లు నీటిని గాలిలోకి చేర్చలేవు, దీని వలన పొడి వాతావరణం ఏర్పడుతుంది. అటవీ నిర్మూలన వలన వాతావరణంలో తేమ తగ్గిపోవడంతోపాటు, భూమిలో నీటి శాతం, భూగర్భజలాల పరిమాణం కూడా తగ్గిపోతుంది.అటవీ నిర్మూలన భూమి సంయోగాన్ని కూడా తగ్గిస్తుంది, దీని వలన వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు జరుగుతాయి.

Image courtesy: The Hindubusinessline

కొన్ని ప్రదేశాల్లో అడవులు జలాశయాలకు తిరిగి నీరు చేరే అవకాశాలను విస్తరిస్తాయి, అయితే అనేక ప్రదేశాల్లో జలాశయాల క్షీణతకు అడవుల నరికివేత  ప్రధాన కారణమవుతున్నాయి. అటవీ నిర్మూలన జీవవైవిద్యం క్షీణించేందుకు కారణమవుతుంది.అటవీ ప్రాంతాలను నాశనం చేయడం ద్వారా జీవవైవిద్యం తగ్గిపోవడంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది.అడవులు జీవవైవిద్యానికి అండగా ఉంటాయి, వన్యప్రాణులకు నివాసాన్ని అందజేస్తున్నాయి. 

గ్లోబల్ వార్మింగ్ వల్ల దక్షిణార్ధ గోళంలో అంటార్కిటిక్ సముద్రపు మంచును 1979 నుండి పరిశీలించడం మొదలైన తరువాత అది గరిష్ట స్థాయిలో పెరిగింది. మొత్తంగా ఉత్తరార్ధ మరియు దక్షిణార్ధ గోళాలలో కలిపి చూస్తే సముద్రపు మంచు పరిమాణంలో భారీ తరుగుదల కనిపిస్తుంది. హిమాలయాలలోని హిమానీనదాలు కరిగిపోతున్నాయి, నీటి రూపంలో కొండల మధ్యనుంచి కిందికి వురుకుతున్నాయి, 2009 నుండి ప్రతి యేట కానీ విని ఎరుగని రీతిలొ హిమాలయ పర్వత సానువులలో జల విపత్తులు సంభవిస్తున్నాయి. వేలల్లో ప్రాణ నష్టం సంభవిస్తుంది .  

భారత్ భూభాగం నుంది విడుదలయ్యే కర్బన ఉద్గారలు హిమాలయాలను తాకి హిమానీనదాలు తరిగిపోవటనికి కారణమవుతున్నయని “ ఇంటర్నేష్నల్ మిటియరొలాజికల్ ఇన్స్టిట్యుట్ ఇన్ స్టాక్ హోమ్ “ పత్రిక - టెల్లుస్ 2013లో ఒక నివేదిక రూపొందించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం మనం పర్యావరణ సమతుల్యతను పాటించడం ద్వారా ప్రపంచంలో యేట 13 మిలియన్  చావులను నివారించవచ్చు. ప్రపంచ ప్రజలందరిపైన  ప్రకృతిని కాపాడుకోవలసిన ఆవశ్యకత ఉంది. 

Friday, January 2, 2015

కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని-6




-- ప్రపంచంలోనే అత్యధికంగా తపాలా కార్యాలయాలు కలిగినది మన దేశం

-- ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు

-- కాశ్మీరు ప్రాంతాన్ని గురించి వ్రాసిన గ్రంథాల్లో అత్యంత ప్రాచీనమైనది రాజతరంగిణి

-- చైనాలో చాన్‌గా అభివృద్ధి చెందిన మహాయాన బౌద్ధమత విభాగం జెన్

-- వివిధ మతావలంబికుల దర్శన స్థలం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం

LinkWithin

Related Posts with Thumbnails