పిల్లలు తినే పీచుమిఠాయిలు రసాయనిక రంగులతో హానికరంగా మారిపోతున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!
శక్తి కోసం రోజూ తగే పాలు నాణ్యతలేక నానాటికి విషపూరితమవుతున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!
శీతల పానీయాలలోని పురుగుమందుల అవశేషాలు వ్యాధులని తెస్తున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!
అవసరం లేని కృత్రిమ తిండి పదార్ధాలన్ని ఆకర్షనీయమైన ప్యాకింగులలొ వస్తున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!
పిజ్జాలు, బర్గర్లూ, చాట్ మసాలాలు మన జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!
జన్యుమార్పిడి పంటల ద్వారా అనారొగ్యకరమైన కూరగాయలు, పండ్లు వస్తున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!
దేశానికి అన్నం పెట్టే రైతన్న జాడ లేక పంట పొలాలు కనుమరుగవుతున్నాయి..
అయినా..
మనకెందుకొచ్చిన గోల!
ఎదో బతికేద్దాం అలా అలా!
1 comment:
hilarious. it is a very good movie
Post a Comment