Wednesday, October 18, 2017

సమస్త ప్రాణకోటి సుఖినోభవంతు :


మనం అందరం దీపావళి  అంటే టపాకాయల పండుగ గానే గుర్తిస్తున్నాము కానీ దీపాల పండుగ అని అర్థం చేసుకోవడంలేదు. నా చిన్నప్పుడు నేను కాల్చిన టపాకాయలకి ఇప్పుడు జనాలు కాలుస్తున్న వాటికి చాలా తేడా ఉన్నది. చలి కాలం మొదలయ్యె క్రమంలో ఒక్క రోజు కాల్చిన విషపూరిత రాసాయనాలు కలిసిన ఈ  టపాకాయల వల్ల 3 నెలల పాటూ కాలుష్య కారకాలు మన వాతావరణాంలోనే తిష్ఠ వేసుకుని ఉంటాయి, అవి వేసవి గాలులను ప్రభావితం చేస్తున్నాయి, ఒక 30 సంవత్సరాల క్రితం ఈ పరిస్తితి లేదు కానీ నేడు మనకు తెలీకుండనే మన చర్యల వల్ల వాతవరణం మారిపోతున్నది, దానికి తోడు మితిమీరిన వస్తు వినియోగం కూడ మనకూ చేటుని తెస్తున్నది. ప్రతి యేటా వేల మంది చిన్నారులు బానిసలుగగా  కుటీర పరిశ్రమలలో రాసాయణ  బాణసాంచా తయరూ చేస్తూంటారు, వారి జీవితాలు పనంగా పెట్టి మనం ఆనందిస్తున్నాము. గత కొద్ది సంవత్సరాలుగా  ప్రజలలో కూడా కొంత అవగాహన, మార్పు వస్తున్నాయి , దీపావళి అనేది సంతోషలను తోటి వారితో పంచుకునే వేడుకగా చూస్తున్నరు, చేసుకుంటున్నరు. 

మన తరం ఈ భూమి పైన ఎంత వినాశనం చేయాలొ అంత చేసేసింది, మళ్ళి మన తరమే దానిని చక్కదిద్దగలిగేది కూడా, పర్యావరణ హితమైన  ప్రతీ విషయాన్ని మనకు మతాలే అందించాయి. కానీ నేడు ఆ మతాలనే అడ్డుపెట్టుకుని మనం వాస్తవాలను చూడలేకపోతున్నము, ఒక్క సారి మన సాంస్కృతిక పరిధిని దాటుకుని ఈ ప్రపంచాన్ని చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి లో  ఉన్నమో స్పష్టంగా తెలుస్తుంది. నేను నా వంతుగా నా పరిధి, శక్తి మేరకు పర్యావరణాహితమైన జీవన వీధానాన్నే అవలంభిస్తున్నాను, కనుకనే ఈ విషయాలు మీతొ పంచుగోగలుగుతున్నాను, గత 6 సంవత్సరాలుగా నేను టపాకాయలు కాల్చడం మానేశాను, నన్ను చూసి చాలా మందిలో మర్పు మొదలైంది, వస్తు వినియోగం, పర్యావరణాహిత జీవన విధానాలను అవలంభించడం  మొదలుపెట్టారు , ఇలా  మనందరమూ కూడ ఈ మార్పుని స్వాగతించగలిగితే మన భవిష్యత్ తరాలు ఈ భూమి మీద మనుగడ సాగీంచగలుగుతాయి, జీవవరణాం వర్ధిల్లుతుంది. 

ప్రతీ మంచి కార్యానికి మన దేశం పెట్టింది పేరు, ఈ ప్రచారాన్ని, అవగాహనని పర్యావరణ హిత జీవన విధానాన్ని మళ్ళీ ప్రపంచానికి అందించేందుకు  మనం వేస్తున్న ముందడుగు గా భావిద్దాం. మనం ఎన్ని చలోక్తులు వేసుకున్న, ఎన్ని వాదనలు చేసిన, వాస్తవాన్ని మార్చలేము అన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనిని మనం మతపరమైన ఆంశంగా చూడడం అనేది చాలా భాధాకరం, మనల్ని మనం శుబ్రపరుచుకోవలసిన వేళ మిగితా వారి అపరిశుభ్రత గురించి ప్రశ్నించడం అవివేకం అవుతుంది అని నా భావన. అందుకు ముందు మనం మారాలి ఆ తర్వాతె మిగితా వారిని మార్చగలుగుతాము. మీకు వాస్తవ వివరాలు తెలియచెప్పలనే తప్ప మరే  ఉద్దేశం లేదు. 

సమస్త ప్రాణకోటి సుఖినోభవంతు :

Tuesday, August 15, 2017

ఓ మనిషి - ఇకనైనా మారు!


లోహపు విహంగాలతో ఆకాశాన్ని ఆక్రమించి
వాయుమండలాన్ని నాశనం చేస్తున్నావు..

రసాయనాలతో నేలను కలుషితం చేసి
భూమితల్లిని క్షోభ పెడుతున్నవు..

దండకారణ్యాలలో అగాధాలు తవ్వి
జీవవైధ్యాన్ని నాశనం చేస్తున్నవు..

ఆహారానికి కృత్రిమ రంగులద్ది
ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నావు..

విలాసాల పైనే దృష్ఠి ఉంచి
చారిత్రక సంపదను తుడిచివేస్తున్నావు..

ప్రపంచీకరణ మోజులో పడి
నైతికాభివృద్ధిని మరిచిపోతున్నావు..

కనుక  ఓ మనిషి.. ఇకనైనా  మారు...
ఎందుకంటే మార్పు శాశ్వాతం...

Tuesday, August 1, 2017

తూర్పు కనుమలు - 8: ఇసుకపట్నం దేముడుబాబు

తూర్పు కనుమలు - 8: ఇసుకపట్నం దేముడుబాబు


దక్షిణ భారత దేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ఒక ముఖ్యమైన నగరంగా "ఇసుకపట్నం" ప్రసిద్దిచేందింది. కొండల మధ్యలో అద్భుతమైన జివవైవిధ్యానికి నెలవుగా ఉంటూ ఒక సమశీతోష్ణ ప్రాంతంగా ఉన్నది. ఒక వైపు సముద్రం, మరోవైపు మడ అడవులు, చిత్తడి నేలలు , కొండల నుండి జాలు వారే సహజసిద్దమైన వాగులు, అరుదైన వృక్ష జాతులతో  నీండిన ఎర్రమట్టి  దిబ్బలు, తీర ప్రాంతం  వెంబడి ఇసుకతిన్నెల  పైన  పరుచుకున్న తీగల  పచ్చదనం,  ఇది 1930 నాటి పరిస్థితి .  రానురాను ఈ ప్రాంతం వేగంగా మార్పు చెందుతూ వచ్చింది. 

1980వ దశకానికి వచ్చేసరికి పారిశ్రామీకరణ పుంజుకుంది. ఇసుకపట్నం ఓడ రేవు, దాని చుట్టుపక్కల పరిశ్రమలు వేగంగా విస్తరించాయి, నగర జనాభా, విస్తీర్ణం పెరిగిపోయాయి.  దీని పర్యవసనంగా ఇక్కడి సహజసిద్ధమైన ప్రకృతి తీవ్ర ప్రభావానికి లోనయింది. సమశీతోష్ణ ప్రాంతం కాస్త కాలుష్యం బారిన పడింది. పర్యావరణం దెబ్బతిన్నది. 1990 నాటికి ఇసుకపట్నంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించి దేముడు బాబు అనే ఆసామి కొంత మంది మిత్రులతో కలిసి ఈ ప్రాంతంలో పర్యావరణం, జీవవైవిధ్యం, సహజసిద్ధంగా  తీరప్రాంత రక్షణ వంటి అంశాల పైన అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. ఆయా రంగాలలోని నిపుణులతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలను, ప్రపంచవ్యాప్త పరిస్థితులను  సేకరించి అందరికి అవగాహన కల్పించేవారు.  కొంతకాలానికి అందరూ దేముడు బాబుని ఒంటరి చేసి ఎవరిపనులు వారు చూసుకోసాగారు, అయినా అయన పట్టువదలక పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. 

"సముద్ర తీర ప్రాంతాలలో సహజంగా ఉండే ఇసుకతీన్నెలు, మడ అడవుల సమూహాలు, తాటితోపులు , ఇసుక తీగలు  లాంటివన్ని సముద్రపు ఉపద్రవాల నుండి మైదాన ప్రాంతాలకు రక్షణ కల్పిస్తాయి.  పారిశ్రామీకరణ పేరుతో  ఈనాడు సహజసిద్దంగా ఉన్న తీర ప్రాంత రక్షణ కవచాలకు తూట్లు పొడుస్తున్నరు. భారత దేశంలోని తూర్పు తీర ప్రాంతం ఎక్కువగా తుఫానుల తాకిడికి గురవుతుంది. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా  పెరిగే దేశీయ చెట్లు, మొక్కలను  సముద్రం నుండి నేల వైపుగా 500  మీటర్ల  వరకూ  పెంచితే అవి పెను గాలులను నియంత్రించగలవు. ఇది ఒక బఫర్ జోన్ లాగా పనిచేసి తీరం కోతను  ఆపుతుంది.  మడ అడవులు ఒక  ప్రత్యేక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. నదుల సంగమ  ప్రాంతాలలో అధికంగా  అడవులు పెరుగుతాయి. నేటి రోజున అభివృద్ధి మాటున ఇవి విపరీతంగా తగ్గిపోవడం వల్ల తీర ప్రాంతంపై పెను మార్పులు  ప్రభావం చుపిస్తున్నాయి. మడ అడవుల నరికివేత వల్ల జీవ వైవిధ్యం ప్రమాదకర స్తాయిలో దెబ్బతింటోంది. సముద్రపు అలల కోతలు, వాతావరణ మార్పుల వల్ల  తరుచుగా తుఫానులు కోస్తా ప్రాంతం పైన  విరుచుకుపడుతున్నాయి. " అని దేముడు బాబు 2010 సంవత్సరంలో ఒక అవగాహనా సదస్సులో చెప్పారు. 

2020 నాటికి  దేముడు బాబు కాలం  చేసారు. అప్పటికే అయన  చేస్తున్న పనిని ప్రజలు, ప్రభుత్వాలు గమనించసాగాయి. కొంత మంది తమ వంతుగా అన్నట్టు పర్యవరణ పరిరక్షణకు పాటుపడ్డారు. ఇసుకపట్నం పరిస్థితి రానురాను భయంకరంగా తయారవుతున్నదని అవగతమైంది, కానీ ఎవరు కూడా పూర్తీ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించలేదు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను వ్యాపారంగా మార్చుకున్నారు. వేల  సంఖ్యలో వెలసిన స్వచ్ఛంద సంస్థలు ఎవరికీ వారే యమునాతీరే అన్నట్టు ఉండిపోయారు.   2030 నాటికి ఐదు భయంకరమైన తుఫానులు ఇసుకపట్నం తీరాన్ని అతలాకుతలం చేసాయి, తూర్పు తీర ప్రాంతంలోని అతి పెద్ద నగరం వాతావరణ మార్పుల పెను ప్రభావానికి లోనయింది. 

2050 నాటికి ఇసుకపట్నం నగర విస్తీర్ణం పావు వంతు మాత్రమే ఉన్నది. అభివృద్ధి పేరున నాశనం చేసుకున్న ప్రాంతమంతా ఆవాసయోగ్యంగా లేకుండా పోయింది, పర్యావరణం, జీవవైవిధ్యం దెబ్బతిన్నాయి, భూగర్భ జలాలు ఉప్పుమయం అయిపోయాయి. ఇష్టారాజ్యంగా  కొండలు  తొలగించడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి, చుట్టూ ఉన్న అడవి తరిగిపోవడం వల్ల వర్షాలు లేవు. ఒకప్పుడు దేముడు బాబుని ఆదర్శంగా తీసుకుని ఎందరో చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్ల ఈ పావు వంతు నగరం మనుగడ సాగించగలిగింది.



LinkWithin

Related Posts with Thumbnails