Friday, January 2, 2015

కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని-6




-- ప్రపంచంలోనే అత్యధికంగా తపాలా కార్యాలయాలు కలిగినది మన దేశం

-- ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు

-- కాశ్మీరు ప్రాంతాన్ని గురించి వ్రాసిన గ్రంథాల్లో అత్యంత ప్రాచీనమైనది రాజతరంగిణి

-- చైనాలో చాన్‌గా అభివృద్ధి చెందిన మహాయాన బౌద్ధమత విభాగం జెన్

-- వివిధ మతావలంబికుల దర్శన స్థలం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం

Wednesday, December 31, 2014

2015 కొత్త క్యాలెండర్

2015 కొత్త క్యాలెండర్  గోడకాగితాలు
 నూతన సంవత్సర శుభాకాంక్షలు :)  
Desktop Calender 2015 
1366 X 768
Photos by N. Aditya Madhav (Adityamadhav83 @ wikimedia commons) 
Edited using Photoshop. 
Click on the image for full resolution

RK Beach at noon time, Visakhapatnam

Thotlakonda hill, Visakhapatnam

Friday, September 12, 2014

భారతీయ వాహనాలు..3

మన దేశంలో వాహనాలకు కొదవ లేదు, జన సామాన్యం తిరిగే కొన్నివాహనాలు:
ఇవి నేను తీసిన చిత్రాలు
by Adityamadhav83 (Own work)
[CC-BY-SA-3.0 (http://creativecommons.org/licenses/by-sa/3.0) or GFDL (http://www.gnu.org/copyleft/fdl.html)], via Wikimedia Commons






Saturday, September 6, 2014

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 21

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
ఈ చిత్రాలు నా వికిమీడియా పేజీపైన కూడా ఉన్నాయి.
The following images are by Adityamadhav83 (Own work)
[CC-BY-SA-3.0 (http://creativecommons.org/licenses/by-sa/3.0) or GFDL (http://www.gnu.org/copyleft/fdl.html)], via Wikimedia Commons

తూర్పు కనుమల మధ్యన పోలవరం కాలువ, లోవకొత్తూరు, తుని.   

హిరమండలం రహదారి, దన్నానపేట, ఆముదాలవలస. 


సింహాచలం కొండపై బ్రిటిష్ వారి శిధిల భవనం 

కంబాలకొండ  అభయారణ్యము లో ఒక ఆరుద్ర పురుగు 

విశాఖపట్నం లో గుబురు పిచ్చుక గూడు. 

Thursday, June 27, 2013

2013 హిమాలయ మహావిలయ గుణపాఠాలు - 1

2013 హిమాలయ మహావిలయ గుణపాఠాలు - 1

Image source: Times of India

ఆధ్యాత్మిక క్షేత్రం దేవభూమి నేడు మరుభూమిగా మారింది.
మహోగ్ర భీకర వరదలతో ప్రకృతి రుద్ర తాండవానికి కకావికలమైంది.
ఈ విపత్తుకి కారణం ముమ్మాటికి మనమే, మనందరమే...

మనిషి ఆత్యాశ ప్రకృతి సంపద, సమతుల్యాన్ని హరించి, సామూహిక జనహనన విపత్తులకి కారణమవుతుంది. అడవుల కోత, విచ్చలవిడి నిర్మాణాలు, వాతావరణ కాలుష్యాల వల్లే ఈ మహా విపత్తు సంభవించింది.


భారత సైన్యం త్రివిధ దళాలు మరియి స్వచ్చంద సంస్థలు అవిశ్రాంతంగా శ్రమించి ఇప్పటికి (26 June 2013) 
70,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

Image Source: First Post

హిమానీనదాల్లో (Glacier) కాలుష్యం వళ్ళ మంచు త్వరగా తేలికపాటిగా కరిగి నీరై ఉదృతంగా ప్రవహిస్తుంది. అదీ కేదరినాథ్ వరదకి అసలు కారణం. అధిక వర్షపాతానికి  కాలుష్యం కూడ జతకలిసి ప్రకృతి విలయ తాండవం ఆడింది  

''ఒక సాదారణ వృక్షం 60 సంవత్సరాలు పెరిగితే సమాజానికి 15,70,000 రూపాయల విలువగల సేవాసౌభాగ్యాన్ని కలుగ చేస్తుంది. అటువంటి కోట్ల కోట్లాది చెట్లు కలిగిన అడవి నుంచో?.....''
ఇది నేను ఒక వ్యాసంలో చూసిన ప్రశ్న!

అడవుల వల్ల ఉపయోగాలు,జీవావరణ వ్యవస్థలో ప్రకృతిలోని జీవరాసుల సమతుల్యాన్ని సాధిస్తుంది.వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తాయి.వరదలు రాకుండా నివారిస్తాయి.

మనం ఇప్పుడు అభివృద్ధి మాటున మనం కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాము. అడవులని నాశనం చేస్కుని వూర్లు పెంచుకుంటున్నాము, కానీ ఒక చెట్టు నరికిన చోట వెలసిన మన ఇంట్లో చిన్న మొక్క కూడ పెంచుకునే వెసలుబాటు కల్పించుకోలేకపోతున్నాము, మనకి నిలువ నీడలేకుండా పోయే వరకు తెచ్చుకోవడం మంచిది కాదు. సహజ వనరులు తగ్గిపోతున్నాయి. కృతిమ వనరుల అవసరం పెరుగుతోంది. పచ్చదనం, చెట్లు కనుమరుగవటం వల్ల వాతావరణంలో విపరీత మార్పులేర్పడుతున్నయి.

Image Source: Vinayraj from Wikimedia Commons

కాళ్ళ కింద భూమిని, తల పై ఆకాశాన్ని నాశనం చేసుకుంటున్నాము. మనం బ్రతకడం కోసం కొన్ని జీవజాతుల్ని అంతరింపచేస్తున్నాము. మనము ఇకనైనా భాద్యతగా మసలుకోకపోతే భావి తరాలు ఈ భూమిపై మనుగడ సాగించడం కఠినతరమవుతుంది.

ఇంటి ఆవరణలో ఒక చెట్టు, కొన్ని మొక్కలు కానీ పేంచండి, అది మన కర్తవ్యం. 
బహుళ అంతస్తుల భవనాలలో ఉంటే కుండీలలో మొక్కలు పెంచండి. 

2వ భాగం  గుణపాఠాలు లో మొక్కల నుంచి అడవులు, జీవవైవిధ్యం, కాలుష్యకారకాలు.

LinkWithin

Related Posts with Thumbnails