Tuesday, January 26, 2010

అ పాత మధురాలు - 1

మన దూర దర్షన్ లో ఒకప్పుడు ప్రసారమైన కొన్ని వాణిజ్య ప్రకటనల విడియోలని ఇక్కడ పెడుతున్నాను:
CHAL MERI LUNA:

Vicks Classic:

Limca Commercial - Old:

Cadbury's Kuchh Khaas hai:

Nescafe:

Friday, January 15, 2010

అదుర్స్ Vs ఆస్ట్రేలియన్స్

మీరు చూసింది నిజమే!
అదుర్స్ vs ఆస్ట్రేలియన్స్ , వీటికి రెండు సమస్యలు ఒకటి ప్రాంతీయం మరొకటి జాతీయం.
ఒక చిత్రాన్ని మన వాళ్లే అడ్డుకుంటాం, ఆడనియం అన్నారు,
మరొకర్ని మన దేశంలో ఆటలే అడనివ్వం అన్నారు.
ఒక సినిమాని అడ్డుకోవటం అనేది పిచ్చి పని .
క్రీడలను అడ్డుకోవడం అంతకంటే పిచ్చి పని.కాకపోతీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది..
మన దేశ పౌరుల పై జాత్యహంకార దాడులు జరగటం వల్ల కోందరు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళని మన దేశంలో అడనివ్వమని అంటున్నారు, ఇది ఒకరకముగా సమంజసమైన భావోద్వేగమే, ఎందుకంటే అది మన జాతీయతా పై జరిగిన దాడి.
అయితే మన భాష చిత్రాలని అడ్డుకోవడం అనేది సరైన చర్య ముమ్మాటికి కాదు.
ఇది కోందరి అవివేకమైన చర్య, కళాకారులకి, క్రిడాకరులకి ఎల్లలు లేవు .
"అత్త మిద కోపం దుత్త మిద చూపినట్టు" ఉంది అదుర్స్ సినిమా ని అడ్డుకోవాలనుకోవడం.
సినిమాకి అన్ని ప్రాంతాలు ఒక్కటే. వాటిని ఎక్కడైనా ఆదరించాలి .
అలాగే క్రీడలను కూడా మనం ఆదరించాలి అన్నది నా అభిప్రాయం..

హైదరాబాద్ లో సూర్యగ్రహణం: నేను తీసిన ఫోటోలు

హైదరాబద్ లో పాక్షిక 73% సూర్యగ్రహణం:
Photos are taken at maximum zoom of nokia 7210S mobile Camera through Clouds:

మా ఇంటి మెడ మీదనుండి మధ్యాన్నం 1.15 - 1.35 మధ్యలో నేను తీసిన ఫోటోలు, బ్లాగు మిత్రుల కోసం ఇక్కడపెడుతున్నాను. నెలవంకలా మారిన సూర్యుడు . (15-01-2010)

Wednesday, January 13, 2010

హాస్య సార్వభౌమ... హాస్య బ్రహ్మ..

హాస్య బ్రహ్మ జంధ్యాల గారి జయంతి (14 జనవరి) సందర్భంగా ఈ టపా.
ఈ కింది వీడియోలలో జంధ్యాల గారి చిత్రాలలోంచి కొన్ని హాస్య సన్నివేశాలు పెడుతున్నాను.



జంధ్యాల వీర వెంకట దుర్గ శివ సుబ్రమణ్య శాస్త్రి మన హాస్య బ్రహ్మ పూర్తి పేరు. ఆయన మకర సంక్రాంతి రోజున (14 January 1951)నర్సాపురంలో జన్మించారు (19 June 2001న) పరమపదించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు (సాహితి, సంపద). అయన అత్యంత ప్రతిబావంతుడు, అయన చిత్రసీమలో ఒక శకం.



ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించడంలో దిట్ట మన జంధ్యాల గారు, అయన చిత్రాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ రోజు ఉన్న హాస్యనటులలో చాల మందిని జంధ్యాల గారే పైకి తీసుకొచ్చారు అంటే అతిశయోక్తి కాదు.



ఆయనకే గనక 'హాస్య ' బిరుదులు ఇచ్చుకుంటా వెళ్తే ఎడతెగని లిస్టులా ఉంటుంది: హాస్యేంద్ర,హాస్య కిరీటి,హాస్య రత్న,హాస్య సామ్రాట్, హాస్య శేఖర,హాస్య సార్వభౌమ,హాస్య వల్లభ,హాస్య చక్రవర్తి,...............



జంధ్యాల గారి గురించి ప్రెత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు, పైన ఉన్న విడియో క్లిప్పింగులు చూస్తేనే అర్థమవుతుంది. జంధ్యాల గారి గురించి మరిన్ని వివరములకై ఇక్కడ నొక్కండి
జంధ్యాల మనందరి హృదయాలలో ఎప్పటికీ అమరుడే!

Sunday, January 3, 2010

2010 కి రెండో క్యాలెండర్












2010 క్యాలెండర్గా మరికొన్ని గోడకాగితాలు (High Resolution Desktop Wallpapers)
Click on the image and open it in new tab or new browser window for full size image. 2560 X 1600 Widescreen wallpapers. Calender Designed by me.
ధన్యవాదములు :)

Friday, January 1, 2010

23 DECEMBER 2008 నుండి 1 JANUARY 2010 దాకా..

TUESDAY, DECEMBER 23, 2008న నేను బ్లాగు ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఆ రొజు నుండి ఈ రోజు వరకు 51 టపాలను ప్రచురించాను, ఉద్యొగరిత్య ఉన్న హడవిడిలో ఒక నెల (JULY) రోజులు నా బ్లాగుకెసే చూడలేదు, కానీ బ్లాగు ప్రపంచంలోకి వచ్చాకే నేను కవితలు రాయడం మొదలుపెట్టాను, అందుకు ప్రత్యక్షముగ నా స్నేహితులు, పరోక్షముగా తోటి బ్లాగర్లూ సహకరించారు.అనుకోకుండ కొన్ని వ్యక్తిగత అనివార్య కారణాల వల్ల నా బ్లాగుని కొన్ని రోజులు ఆపివేస్తున్నాను, అప్పుడప్పుడు వీలైతే టపాలు ప్రచురిస్తాను. ఇప్పుడు మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న నా బ్లాగు సింహావలోకనం చూద్దం..
టపా పేరు పైన క్లిక్కు చేస్తే ఆ టపా చూడచ్చు
NAYANI ADITYA MADHAV :)


నాకు బాగా నచ్చిన టపా: వెతుకులాట...

నాకు బాగా నచ్చిన నా కవిత: దేవుడున్నాడు...

నాకు బాగా నచ్చిన వ్యంగ్య టపా: బ్రేకింగ్ న్యూస్...

నాకు నచ్చిన క్రియేటివ్ టపా: నా పైత్య పంచావతారాలు!

నా బ్లగు అభిమానుల సంఖ్య : 10 (నాతో కలిపి ఇప్పటివరకు)
నా బ్లాగు విషయ సూచికలోని అంశాల సంఖ్య : 13 (ఇప్పటివరకు)
నా బ్లాగు మొత్తనికి ఇప్పటివరకు వచ్చిన వ్యాఖ్యలు (comments): 361 వ్యాఖ్యలు

అత్యధిక వ్యాఖ్యలు వచ్చిన టపా: నా క్రియేటివ్ క్యాలెండర్ 2010..

అత్యల్ప వ్యాఖ్యలు వచ్చిన టపా: మహమ్మారితో జాగ్రత్తా! ..

నా బ్లాగులో అత్యధిక వ్యాఖ్యలు చేసిన తోటి బ్లాగర్లు :


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ధన్యవాదములు
ఇక సెలవు

LinkWithin

Related Posts with Thumbnails