Tuesday, October 12, 2010

"నేనున్నాను " అంటుంది .. మొబైల్ ఫొన్

మృదువైన గానాన్ని వినిపిస్తుంది
సంక్షిప్త సందేశాలను తీసుకొస్తుంది

ఆప్యాయతల్ని, అనురాగాలని మోసుకొస్తుంది
నీ మోము పై చిరునవ్వు పూయిస్తుంది

ఏకాంతాన ఏకైక తోడవుతుంది
ఒకోసారి భారంగా చిరాకుపెడుతుంది

నీ భావాలని అందరితో పంచుకోమంటుంది
నీ చేతికి అందేంత దూరంలో వుంటుంది

ఎప్పుడూ నీకు " నేనున్నాను " అంటుంది ..
మొబైల్ ఫొన్

3 comments:

భాను said...

అప్పుడప్పుడు ఏకాంతాన్ని భంగం చేసి చికాకు పెట్టె గుదిబండ కూడా

ఇందు said...

wow nice..

శివ చెరువు said...

బాగా రాసారు .. అయితే "ఒకోసారి భారంగా చిరాకుపెడుతుంది" అన్న చోట చెప్పాలనుకున్నది సరిగ్గా పలక లేదేమో అనిపించింది.

LinkWithin

Related Posts with Thumbnails