Friday, March 27, 2009

పవిత్రాద్రి...

బ్లాగు మిత్రులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు...
ఉగాది సందర్భముగా ఓ చిన్న కవిత..


చల్లని రామయ్య కొలువైనది భద్రాద్రి..

కలియుగ దైవం వెలసిన వెంకటాద్రి..
మహాదేవుని నిలయముగా వున్న శ్రీశైలాద్రి..

అప్పన్న లీలా వినోదముగా సింహాద్రి..
శక్తి స్వరూపిణి నెలవైన ఇంద్రకీలాద్రి..

సత్యనారాయుణి మహిమాన్విత రత్నాద్రి..
నృసింహుని ఓంకార మంత్రముగా వేదాద్రి..

ఆంధ్ర ప్రదేశము పుణ్య క్షేత్రాల పవిత్రాద్రి...

Monday, March 23, 2009

వెతుకులాట...


ఈ ప్రపంచంలొ వెతుకులాట పలురకాలు..
కొందరికీ ఏమి వెతుక్కోకండానే కారణం దొరుకుతుంది..
కొందరికీ ఏంత వెతికినా ఏమీ దొరకదు..
కొందరు ఇంట్లొ వుండి ప్రపంచాన్ని వెతుక్కుంటారు..
కొందరు ప్రపంచం అంతా తిరిగి తమకు కావలసింది వెతుక్కుంటారు.
గుడి కి వెళ్తే: కొందరు ప్రశాంతతని వెతుక్కుంటారు..
కొందరు ప్రసాదాన్ని వెతుక్కుంటారు..

మన చుట్టు రోజు ఏన్నొ సంఘటనలు జరుగుతుంటాయి.కొన్నిటిలో మనం భాగస్వాములము కూడా అవుతుంటాము.జరిగింది ఏదైనా దానినుంచి మనకి కావలసింది వెతుక్కుంటాం. ఇది నాతొ పాటు అందరూ చేసే పనే..వెతుకున్న దానికి సంత్రుప్తి పడడం మానవ నైజం.వెతుకున్న దానినీ మన దృష్టికొణానికి తగ్గట్టు గా అన్వయించుకుంటం కూడా.

"మనకు జరిగే సంఘటనలకు మనకు తెలియకుండ మనం ఆకర్షింపబడుతుంటాం" అని నా మిత్రుడొకరు అన్నారు. ఆయన మాటల్లొ నిజంగా నిజం దాగుంది. ఆ ఆకర్షణ మనకు తెలియకుండానే కలుగుతుంది, ఆకర్షించడం మన తప్పా, ఆకర్షింపబడటం అవతలి వారి తప్పా అని పక్కికి పెడితే, ఎవరి దృష్టి లొ వారిది సరైనదే అనిపిస్తుంది.

మనలొ ఉన్న సద్గునాలు కూడా ఒకోసారి ఇతరులకు మనపై లేని పోని ఆకర్షణలు కలిగిస్తుంటాయి అని నా భావన.ఆకర్షణ ఎక్కువైనా, వికర్షణ ఎక్కువైనా కష్టమే.

మనం చెసే పనిలొ 3 రకాలు ఉంటాయి, ఒకటి మనకి ఇష్తమైనవి, రెండు అవతలి వారికి ఇష్తమైనవి, మూడవది సరైన పని.మనం సరైన పని చెస్తె ఎవరు గుర్తుంచుకోరు, మనం తప్పు చేస్తె ఎవరు మర్చిపోరు (మనం మర్చిపొతాం ఏమో కానీ) ఇది ఒక రకమైన వెతుకులాట. .

నేను సరైన పనె చేస్తున్నానా అన్నది నా వెతుకులాట ఐతే, నెను తప్పు చేస్తున్నానా అన్నది అవతలి వారి వెతుకులాట. ఇలంటి వింత అనుభవాలు నా జీవితంలొ చాలా జరిగాయి,జరుగుతున్నాయి కూడా...

కొందరు అతిగా పొగుడుతారు, కొందరు అతిగా కించపరుస్తారు, సద్విమర్శ చెసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అని నా మిత్రుడొకరు అంటుంటారు.ఒకరిని పొగిడి వాళ్ళకి అవసరమైన పని కానిచ్చుకుందాం అని కొందరి ప్రయత్నం అయితే, కొందరిని కించపరిచి వారి స్తాయి , పరపతిని పెంచుకొని బలవంతులుగా ఉండాలని ఇంకొందరి ప్రయత్నం, ఇక్కడ కూడా ఎవరికి కావలసింది వారు వెతుక్కుంటారు..

అందుకే ఈ ప్రపంచంలొ వెతుకులాట పలురకాలు..
ఎవరికి కావలసింది వారు సహృదయం తో, విశ్లెషణాత్మక దృష్తితో వెత్తుకుంటే సరిపొతుంది..

ఈ టపాలో మాత్రం వెతుక్కొవడానికి ఏమీ లేదు, నాకు మాత్రం వెతుక్కొవడానికి మీ వ్యాఖ్యలు ఉన్నాయి అంతే( మీరు ప్రచురిస్తేనే లెండి).... :)

Saturday, March 14, 2009

నీ కోసమే చెల్లి...


నా బంగారు చిట్టి చెల్లి..
మురిపాల రంగవల్లి..
మా ఇంటి పాలవెల్లి..
పూర్వ జన్మ భంధానివై వచ్చావు మళ్ళీ..
నిన్ను చూసుకుని మురిసిపోయాను తల్లి..
ఈ అన్న ఉన్నది నీ కొసమే చెల్లి....

నా 'కపిత్వం..'
ఏదో రాసాను ఓ కవిత.. నా చెల్లెలి కోసం ..

Wednesday, March 11, 2009

గుర్తుకొచ్చింది..... ఓ మంచి పాట - 2

మౌనం మనసున మంటలై రగిలి మరిగిపొతున్నది
ప్రాణం పొయె బాధతో గుండె కొట్టుకుంటున్నది
గొంతే అందని ప్రేమ కెక వూపిరిని కోస్తున్నది
దారే తొచక చూపు చీకటిని కమ్ముకుంటున్నది

అణువనువున ఆవెదన
వినిపించని ఆలాపన
ఆవేశమై నా శాపమై
ముంచెయద నను నిలువున
యెటు చూసిన ఏం చేసిన
నను వీడదే ఆరాధన
నువు దూరమై ఎద బారమై
మరణించునే ఆలోచన
యెన్ని రాగాలు యెన్ని భావాలు
యెన్ని స్వప్నాలు యెన్ని సత్యాలు
యెల ఇంతలోనె మరచినావె నేస్తమా
యెన్ని మొహాలు యెన్ని విరహాలు
యెన్ని కలయికలు యెన్ని సాక్షాలు
యెల నమ్మలెదొ నన్ను నీవె తెలుపుమ

కదిలె క్షణాలు భారమై నన్ను కదలనీకుండ కట్టేస్తుంటే
యెకాకిలాగ మిగిలానులె గుండెనే కాల్చు మంటలై యెగసి
కనుల కన్నీటిలో తడిమి తాగెసిన
మనసింతగా ఏడ్చినా తెలియదె ఓ ప్రేమ

మౌనం మనసున మంటలై...

కను మూస్తే చాలు నీ జ్ఞాపకాలు
కనిపించి కంటి తెరపై నన్ను
కలతలై లేచి వెంటాడద
ఆశాలే ఆవిరైపోతుంటే
చీకటే ముసిరెనె వెలుతురే ఆరెనె
నను శూన్యమె నిలువున మింగెనె ఓ ప్రే

మౌనం మనసున మంటలై . . . .

చిత్రం : జ్ఞాపకం (2007)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం : వరికుప్పల యాదగిరి
గానం : రంజిత్

పాటని మీరు ఇక్కడ వినవచ్చు
http://www.in.com/music/track-mounam-manasuna-199977.html

Sunday, March 8, 2009

నా పైత్య పంచావతారాలు!

కొంచం వెరైటి గా నా ఫొటొలని పంచావతారాలుగా మీ ముందుకు తెచ్చాను. (ఫొటొషాప్ లో ఎడిట్ చేసినవి సరదాగా)


1. నేను దేవుడినా???


2. కాదు నేనంటే నేనే!


3. ఎవరైతే నాకెంటి!


4. మీ గోల మీది.. నా గోల నాది..


5. నేను దేవుడిని కాదు అని ఇప్పుడు తెలిసింది.

అది పైత్య పంచావతారాల సంగతి ఇంకో టపాతో కలుస్తా... :)

Thursday, March 5, 2009

ఓ వింత గోల...



ఆమె వచ్చింది ఇలా..
నేను మైమరచిపోయా చాలా..
ఇంతలో ఎటో వెల్లిపొయింది అలా..
చెదిరిపోయింది నా కల..
ఎందుకు జరిగిందో ఇలా..
అయినా ముందుకు వెళ్తున్నా అలా అలా..
ఎంటో ఈ అయోమయ హేల..
ఇదంతా ఓ వింత గోల..

నా 'కపిత్వం..'
నేను రాసిన మొదటి కవిత.. మీ కోసం ..

LinkWithin

Related Posts with Thumbnails