Wednesday, October 18, 2017

సమస్త ప్రాణకోటి సుఖినోభవంతు :


మనం అందరం దీపావళి  అంటే టపాకాయల పండుగ గానే గుర్తిస్తున్నాము కానీ దీపాల పండుగ అని అర్థం చేసుకోవడంలేదు. నా చిన్నప్పుడు నేను కాల్చిన టపాకాయలకి ఇప్పుడు జనాలు కాలుస్తున్న వాటికి చాలా తేడా ఉన్నది. చలి కాలం మొదలయ్యె క్రమంలో ఒక్క రోజు కాల్చిన విషపూరిత రాసాయనాలు కలిసిన ఈ  టపాకాయల వల్ల 3 నెలల పాటూ కాలుష్య కారకాలు మన వాతావరణాంలోనే తిష్ఠ వేసుకుని ఉంటాయి, అవి వేసవి గాలులను ప్రభావితం చేస్తున్నాయి, ఒక 30 సంవత్సరాల క్రితం ఈ పరిస్తితి లేదు కానీ నేడు మనకు తెలీకుండనే మన చర్యల వల్ల వాతవరణం మారిపోతున్నది, దానికి తోడు మితిమీరిన వస్తు వినియోగం కూడ మనకూ చేటుని తెస్తున్నది. ప్రతి యేటా వేల మంది చిన్నారులు బానిసలుగగా  కుటీర పరిశ్రమలలో రాసాయణ  బాణసాంచా తయరూ చేస్తూంటారు, వారి జీవితాలు పనంగా పెట్టి మనం ఆనందిస్తున్నాము. గత కొద్ది సంవత్సరాలుగా  ప్రజలలో కూడా కొంత అవగాహన, మార్పు వస్తున్నాయి , దీపావళి అనేది సంతోషలను తోటి వారితో పంచుకునే వేడుకగా చూస్తున్నరు, చేసుకుంటున్నరు. 

మన తరం ఈ భూమి పైన ఎంత వినాశనం చేయాలొ అంత చేసేసింది, మళ్ళి మన తరమే దానిని చక్కదిద్దగలిగేది కూడా, పర్యావరణ హితమైన  ప్రతీ విషయాన్ని మనకు మతాలే అందించాయి. కానీ నేడు ఆ మతాలనే అడ్డుపెట్టుకుని మనం వాస్తవాలను చూడలేకపోతున్నము, ఒక్క సారి మన సాంస్కృతిక పరిధిని దాటుకుని ఈ ప్రపంచాన్ని చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి లో  ఉన్నమో స్పష్టంగా తెలుస్తుంది. నేను నా వంతుగా నా పరిధి, శక్తి మేరకు పర్యావరణాహితమైన జీవన వీధానాన్నే అవలంభిస్తున్నాను, కనుకనే ఈ విషయాలు మీతొ పంచుగోగలుగుతున్నాను, గత 6 సంవత్సరాలుగా నేను టపాకాయలు కాల్చడం మానేశాను, నన్ను చూసి చాలా మందిలో మర్పు మొదలైంది, వస్తు వినియోగం, పర్యావరణాహిత జీవన విధానాలను అవలంభించడం  మొదలుపెట్టారు , ఇలా  మనందరమూ కూడ ఈ మార్పుని స్వాగతించగలిగితే మన భవిష్యత్ తరాలు ఈ భూమి మీద మనుగడ సాగీంచగలుగుతాయి, జీవవరణాం వర్ధిల్లుతుంది. 

ప్రతీ మంచి కార్యానికి మన దేశం పెట్టింది పేరు, ఈ ప్రచారాన్ని, అవగాహనని పర్యావరణ హిత జీవన విధానాన్ని మళ్ళీ ప్రపంచానికి అందించేందుకు  మనం వేస్తున్న ముందడుగు గా భావిద్దాం. మనం ఎన్ని చలోక్తులు వేసుకున్న, ఎన్ని వాదనలు చేసిన, వాస్తవాన్ని మార్చలేము అన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనిని మనం మతపరమైన ఆంశంగా చూడడం అనేది చాలా భాధాకరం, మనల్ని మనం శుబ్రపరుచుకోవలసిన వేళ మిగితా వారి అపరిశుభ్రత గురించి ప్రశ్నించడం అవివేకం అవుతుంది అని నా భావన. అందుకు ముందు మనం మారాలి ఆ తర్వాతె మిగితా వారిని మార్చగలుగుతాము. మీకు వాస్తవ వివరాలు తెలియచెప్పలనే తప్ప మరే  ఉద్దేశం లేదు. 

సమస్త ప్రాణకోటి సుఖినోభవంతు :

LinkWithin

Related Posts with Thumbnails