Wednesday, February 25, 2009

కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని!



->వందేమాతరం: మన జాతీయ ప్రార్థనా గీతం, జన గన మన: మన జాతీయ గీతం.
->హైందవ పురాణాల ప్రకారం మొట్టమొదట మరణించిన మానవుడు - 'యముడు ' (యమ ధర్మ రాజు)
->మానవ దేహంలో బలీయమైన కండ 'నాలుక '.
->అయోధ్య అంటే 'అజేయం' అని అర్థం..
->బొమ్మలాట ప్రారంభించింది మొదట రెండు దేశాలు అవి భారత దేశం, ఈజిప్టు దేశం..
->శ్రీలంక అంటే అర్థం ప్రకాశవంతమైన భూమి అని.
->వైద్య శాస్త్రం ప్రకారం మానవులలో 47 రకాల తల నొప్పులు ఉన్నాయి.
->కర్నాటక ప్రాంతాన్ని పూర్వ కాలంలొ 'కరునాడు ' అని పిలిచేవారు.
->తుమ్ము గంటకి 245 మైళ్ల వేగం తో బైటకి వస్తుంది( ఆపుకొకండి..)
->మనిషి తుమ్మిన ప్రతిసారి మెదడు లోని కొన్ని కణాలు నసించిపొతాయి( ప్రమాదం ఏమి కాదు లెండి)
->మిజోరాం అంటే 'కొండమనిషి ఆవాసం ' అని అర్థం..
->భారత దేశం లో మొట్టమొదటి కథాచిత్రం "రజా హరిష్చంద్ర " 1913లొ దాదా సాహెబ్ ఫాల్కే గారు నిర్మించారు.
->థైలాండ్ దేశం పూర్వ నామం 'సయామ ' రాజ్యం.
->సాలెపురుగు ఆహారాన్ని పట్టి తినదు, తాగుతుంది ఎందుకంటే దాని నోరు ధ్రవపదార్థాలు తాగడానికి మాత్రమే ఉపయొగపడుతుంది..
->మానుకోట అనే ప్రాంతం నేడు ఆంధ్ర ప్రదేష్ లోని మహబూబాబాద్ (వరంగల్ జిల్లాలో)

Sunday, February 22, 2009

ఓం శివోహం..

హర హర హర హర హర హర హర హర మహాదేవ్!
హర హర హర హర హర హర హర హర మహాదేవ్!!

ఓం మహా రుద్రాయ !

కాల రుద్రాయ!
కల్పాంగ రుద్రాయ!
రుద్ర రుద్రాయ!
ఘోర రుద్రాయ!
అఘోర రుద్రాయ!
మార్తాండ రుద్రాయ!
అండ రుద్రాయ!
బ్రహ్మండ రుద్రాయ!
చండ రుద్రాయ!
ప్రచండ రుద్రాయ!
వీర రుద్రాయ!
శూర రుద్రాయ!
అతల రుద్రాయ!
వితల రుద్రాయ!
సుతల రుద్రాయ!
మహాతల రుద్రాయ!
పాతాళ రుద్రాయ !
నమో నమః

ఓం శివోహం !
ఓం శివోహం !
రుద్ర నామం భజేహం !
ఓం శివోహం !
ఓం శివోహం !
రుద్ర నామం భజేహం !

వీర భధ్రాయ
అగ్ని నేత్రాయ
ఘోర సంహారహా
సకల లోకాయ
సర్వ భూతాయ
సత్య సాక్షాత్కరా
శంభో శంభో శంకరా

ఓం శివోహం
ఓం శివోహం
రుద్ర రూపం భజేహం
హర హర హర హర హర హర హర హర మహాదేవ్ !
ఓం
నమః శంభవేచ మయోభవేచ
నమః శంకరాయచ మయస్కరాయచ
నమః శివాయచ శివతరాయచ..

అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలనా..
స్తూలణా జగత్కారణా సత్య దేవ దేవప్రియా..
వేద వేదాంత సార..
యగ్న యగ్నోమయా..
నిశ్చలా దుష్ట నిగ్రహా..
సప్త లోక సంరక్షకా..

సోమ సూర్య అగ్ని లోచనా..
శ్వెతవృషభ వాహనా..
శూల పాణి భుజంగ భూషణా..
త్రిపుర న్యాస రక్షనా..
వ్యోమకేశ మహాసేన జనకా..
పాశుహస్త్ర నమోనమః..

ఓం శివోహం!
ఓం శివోహం!
రుద్ర రూపం భజేహం!
ఓం శివోహం!
ఓం శివోహం!
రుద్ర నామం భజేహం!

కాల త్రికాల.
నేత్ర త్రినేత్ర.
శూల త్రిశూల గాత్రం..
సత్య ప్రభావ.
నిత్య ప్రకాష.
మంత్ర స్వరూప మాత్రం..
నిష్ప్రపంచాది.
నిష్కలంకొహం.
నిజపూర్న బోధహం..
సత్యగాత్మానం..
నిత్యబ్రహ్మొహం..
సప్తకాశోహ మంత్రం..

సత్య ప్రమాణం ఓం ఓం
మూల ప్రమేయం ఓం ఓం

అయం బ్రహ్మాస్మి ఓం ఓం
అహం బ్రహ్మాస్మి ఓం ఓం

ఓం శివోహం!
ఓం శివోహం!
రుద్ర నామం భజేహం!
ఓం శివోహం!
ఓం శివోహం!
రుద్ర రూపం భజేహం!

వీర భధ్రాయ
అగ్ని నేత్రాయ
ఘోర సంహారహా
సకల లోకాయ
సర్వ భూతాయ
సత్య సాక్షాత్కరా
శంభో శంభో శంకరా

ఓం శివోహం!
ఓం శివోహం!
రుద్ర నామం భజేహం! భజేహం!


మహాశివరాత్రి సందర్భంగా రుద్ర నమక చమకం ఆధారిత గీతం..
చిత్రం: నేను దేవుడ్ని (2009)
సంగీతం: ఇళయరాజా

హర హర మహాదేవ్!
ఈ గీతాన్ని క్రింది లింక్ నుంచి డౌన్లొడ్ చేసుకొండి..(6 వ పాట)

http://www.bangaloreliving.com/tamilmp3songs/NaanKadavulTamilSongs.php


Thursday, February 19, 2009

సిక్స్ 'జొక్స్' ప్యాక్...

1.
లెక్చరర్: మురళి! శూన్య ప్రదేశం అంటే ఏమిటి?
మురళి: ఖాళీగా వుండె ప్రదేశమండి!
లెక్చరర్: గుడ్! దానికి ఒక ఉదాహరణ చెప్పు?
మురళి: మీ బట్ట తల సార్!
లెక్చరర్: ?
2.
తాత: గడియారం 13 గంటలు కొట్టిందంటే టైము ఎంతైనట్టు?
మనవడు: రీపేరు కి టైము అయినట్టు!

3.
రాము: హరి! నువ్వీరోజు రాత్రి మా ఇంటికి గోడ దూకి దొంగ లా రావాలి..
హరి: ఎందుకు రా?
రాము: నేనో కుక్కని కొన్నాను. అది దొంగలని పట్టుకుంటుందొ లేదో చూద్దామని అంతే..
హరి:????
4.
సంజయ్: 'కనక ', 'జలజ ','వికటకవి ' ఇంకా ఇలాంటివి ఎమన్నా ఉంటే చెప్పు చూద్దాం..
మహెష్: 'పోరాపో'

5.
రవి: ఏమిటి! E.N.T. స్పేషలిష్ట్ అంటూ విన్నాను. ఈ డాక్టర్ E.N.D. స్పేషలిష్టా?..
శివ: అవును! ఆయన దగ్గరికెళితే తప్పనిసరిగా అంతమే..
6.
తాత: 'అబద్దం ఆడితే అన్నం పుట్టదు ' - ఇలాంటి మాట ఇంకొకటి చెప్పు..
మనవడు: 'నిజం చెబితే నీళ్ళు పుట్టవు '..


సిక్స్ ప్యాక్డ్ 'జొక్స్ ' ఇవి మీకు ఇప్పటికే తెలిసినవే అయివుండచ్చు.సరదాగా సేకరించినవి ఈ జొక్స్ ఎప్పటివో పాత పుస్తకాలు, మ్యగజిన్స్ లోనివి. సిక్స్ ప్యాక్డ్(ఆరు జొక్స్) గా ఇక్కడ టపాలో ఉంచాను అంతే. మరి ఉంటాను...

Thursday, February 12, 2009

అక్షరమాల... అమరవాణి - 1

అక్షరాలు..
లక్షల విలువైనవి..
లక్షణంగా మన జీవితాలను తీర్చిదిద్దగలవు..
ఆచరణలోకి తీసుకుంటే.. మన జీవిత గతి లో ప్రగతిని అందించే ఆయుధాలు.. ఈ అక్షరాలు..
మా ఇంట్లొని వివిధ రకాల పుస్తకాల నుంచి సేకరించిన ఈ తెలుగు కొటేషన్స్ ని అమరవాణి గా ఈ టపా లో పెడుతున్నాను.ఇది మొదటి భాగం.. అప్పుడప్పుడు అమరవాణి వినిపిస్తుంటా లెండి..
అటువంటి అక్షరాల అమరవాణి మన కొసం..


1. కాలమే ఉత్తమ గురువు.. ప్రపంచమే ఉత్తమ గ్రంథం..
2. గెలవకపోతే నిరాశ వద్దు. కానీ తిరిగి ప్రయత్నించకపొతే సర్వనాశనం తప్పదు..
3. సృష్టిలో సహజముగా ఉన్నదే అనురాగం. కష్టించి మనం కల్పించుకున్నదే ద్వెషం..
4. అనుభవం లేని చదువు కంటే, చదువు లేని అనుభవం మంచిది..
5. మనసులొ అసూయ కంట్లొ నలుసు లా బాధ కలిగిస్తుంది..
6. ప్రపంచం భిన్నంగా కనిపిస్తుంది కాని అందులో దాగిన తత్వం ఒక్కటే..
7. మనసుంటే మార్గం వుంటుంది, మనస్పూర్తిగా ప్రయత్నిస్తే ఫలితం వుంటుంది..
8. ఆరోగ్యకరమైన వ్యక్తి, కుటుంబ క్షేమానికి, దేశ సౌభాగ్యానికి మూలాధార శక్తి..
9. ద్వెష శక్తి కంటే ప్రేమ శక్తి కోటి రెట్లు ఘనం ..
10. ప్రవర్తన అనే అద్దం లో ప్రతివాడి నిజరూపం ప్రతిఫలిస్తుంది..
11. నాలుక వశమైతే నరులంతా వశమే..
12. కష్టాలు మనిషికి తాను ఎవరో గుర్తు చెస్తాయి..
13. విన్నవన్ని నమ్మకు.. నమ్మినవన్నీ వెల్లడించకు..
14. చేత మన ఆదీనం.. రాత దైవాదీనం..
15. ఆపదలు వచ్చినప్పుడు వాటిని దాటాలంటే ఆలొచన కావాలి..


ఇంకో మంచి టపా తొ మీ ముందుకొస్తా.. ఉంటాను .. ధన్యవాదములు..

Tuesday, February 10, 2009

గుర్తుకొచ్చింది..... ఓ మంచి పాట.

అలా అలా పాటలు వింటుంటె ఓ మంచి పాట గుర్తొచ్చింది...
ఈ పాట అందరికీ తెలిసుండకపొవచ్చు, తెలిసినా మర్చిపొయి ఉండచ్చు .(ఎందుకంటే నేనూ మర్చిపొయాను కనుక)
స్నేహం గురించిన పాట ఇది.. మీ కొసం..

పల్లవి:
ప్రపంచమే కాదన్నా.. పైనున్నొడే రాకున్నా..నీతొ వుండే దైవం నేస్తం రా...
అద్రుష్టమే లేకున్న.. నీ కష్టమే తనదన్నా..నీలొ వుండే ప్రాణం నేస్తం రా..

పాపలా నువ్వున్నచో తను కన్నులా..పాదమై నువ్వున్నచో తను మన్నులా..
వెలుగుల్లొనే కాదు చికట్లొనూ నీ నీడలా..ఏ చొటనే కాదు స్వర్గానికైనా నీ తొడులా..
ప్రపంచమే కాదన్నా.. (1 సారి)
మొదటి చరణం:
త్యాగాలే చేసేది.. త్యాగాలే అడిగేది.. త్యాగాం లొ బ్రతికేది.. స్నేహమే..
లోపాలే చుసేది.. ఆ పై సరిచెసేది.. లాభాలే చూడనిది.. స్నేహమే..

పంచే కొద్ది మించి పొయే నిధి.. త్రాగే కొద్ది పొంగి పొయే నది..
ఇద్దరికిద్దరు రాజులు ఏలే రాజ్యం స్నేహానిది..
యుద్దాలున్నా శాంతిని నిలిపే సైన్యం స్నేహానిది..
ప్రపంచమే కాదన్నా.. (1 సారి)
రెండొ చరణం:
విశ్వాసం తొలి మెట్టు.. విశ్వాసం మలి మెట్టు.. విశ్వాసమే చివరంటూ ఉన్నది..
ఆకాశం హద్దైనా.. విను వీధే తనదైనా.. ఈ భుమే నెలవంటు అన్నది..

కాలం కన్నా ఇది విలువైనది.. సత్యం కన్నా ఇది నిజమైనది..
మనసున దాగిన మనసును చూపే ఆక్రుతి స్నేహానిది..
మనిషిని పూర్తిగా మనిషిగ మార్చె సంస్క్రుతి స్నేహానిది..

లాలించగా అమ్మల్లె, పాలించగా నాన్నల్లె లబించిన వరమే నేస్తం రా..
ఆడించగా అన్నల్లె, బోదించగా గురువల్లె చెల్లించని రుణమే నేస్తం రా..
పాపలా నువ్వున్నచో తను కన్నులా..పాదమై నువ్వున్నచో తను మన్నులా..
వెలుగుల్లొనే కాదు చికట్లొనూ నీ నీడలా..ఏ చొటనే కాదు స్వర్గానికైనా నీ తొడులా..


చిత్రం: భగీరథ ( 2005 లొ విడుదల)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబొస్
పాడిన వారు: శంకర్ మహదేవన్

ధన్యవాదములు.. ఇంకో మంచి టపా తొ మళ్లి కలుస్తా..

Friday, February 6, 2009

"నా మొహం".. అప్పుడు.. ఇప్పుడు..

పేరు చూసి కంగారు పడకండి.. మీరు చుసిన పేరు సరైందే..
టపా లొ నా చిన్నపటి చిత్రము మరియు ఇప్పటి చిత్రములను ఉంచాను..
కొంచం వెరైటీ గా చిన్న ప్రయత్నం.. చిత్రాలను నేను ఫొటొషాప్ సాఫ్ట్ వేరె(Adobe photoshop) ఉపయొగించి చేశాను..
అప్పుడు..(చిన్నప్పుడు)

ఇప్పుడు...



ఇదండి "నా మొహం"... ఇంకొ టపా తొ మళ్లి కలుస్తా.. ఉంటాను...

Wednesday, February 4, 2009

మన కోసం... పది ప్రశ్నలు....

సారి ఏం టపా పెడదామా అని అలొచించా, బుర్ర లొ పడడమే ఆలస్యం మీ ముందుకొచ్చెశా..
మనకొసం పది ప్రశ్నలనే టపా తొ..
మనల్ని మనం పరిశీలించుకునె ఒక విధమైన 'సెల్ఫ్ చెక్' లాంటిది ..ఇందులో నా సమాధానాలు కూడా తెలుపుతున్నాను, మీ సమాధానాలు మీరు తెలుసుకొండి, అవి మీకు ఉపయోగపడొచ్చు..
పది ప్రశ్నలు...
==================================
1. మీకు స్నెహితులతొ గడపడం అంటె ఇష్టం..
. అవును
భ్. కాదు
చ్. ఆప్పుడపుడు గడుపుతా
డ్. ఆవసరమైతేనె గడుపుతా
నా సమాధానం: : అవును, నాకు స్నెహితులతొ గడపడం అంటె చాలా ఇష్టం. వాళ్లతో సరదాగా వుంటాను. అవసరమా కాదా అని చూడను. వీలైనంత వరకు కాంటాక్ట్ లొ వుంటాను.
ప్రపంచంలొ స్నెహితులు అనే వాళ్లు లెని వారు వుండరు. స్నెహ భావం చాలా అమూల్యమైనది.. స్నెహం అంటే కాలనుగుణంగా వచ్చి వెల్లిపొయే వర్షం లాంటిది కాదు, మన చుట్టు ఎప్పుడూ ఉండే వాయువు(గాలి) వంటిది అని నా అభిప్రాయం..
==================================
2. మీ స్నెహితులతొ అన్ని విషయాలు పంచుకుంటారా..?
. అవును అన్ని
బ్. సంతొషం మాత్రమే
చ్. భాధ మాత్రమే
ద్. ఎమీ పంచుకోను
నా సమాధానం: బ్: సంతొషం మాత్రమే నేను స్నెహితులతొ పంచుకుంటాను. నాకు ఎందుకో బాధను పంచుకొవడం ఇష్టం ఉండదు.
స్నెహితులతొ పంచుకొలేని విషయం అంటూ ఎమీ లేదు, నీ బాదను చెప్పుకుంటే కొంతైన తెలికపడతావు అంటారు చాలామంది( నా స్నెహితులు కూడా) . అసలు ఎమీ పంచుకొకుండా వుండడం అనేది ఉండకూడదు అని నా అభిప్రాయం. నిజమైన స్నెహం ఎప్పుడూ తొడుగా ఉంటుంది..
==================================
3. మీలొని లొపాలని మీ స్నెహితులు ఎత్తిచూపితే ..?
. కొపం వస్తుంది
బ్. కొపం వచ్చినా లొపాలు తెలుసుకుందాం అని మౌనంగా వుంటారు..
చ్. ఆసలు కొపమే రాదు..
ద్. లొపాలు తెలుసుకుంటారు ..
నా సమాధానం: ఇప్పుడు ద్: లొపాలు తెలుసుకుంటాను. ఒకప్పుడు మాత్రం నా సమాధానం బ్.కొపం వచ్చెది కాని ఎం లొపం చూపిస్తారొ అని చూసేవాడిని.
స్నెహితులు మన లోపాలని చుపిస్తె అది మన మీద కొపం తొనొ అసుయతొనొ కాదు మనల్ని మనం సరిదిద్దుకుంటాం అని మంచి భావన తొ చెప్తారని నా అభిప్రాయం. ( విషయంలొ కొన్ని మినహాయింపులు వుండచ్చు, ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు కదా)..
==================================
4. మీలొని కళను (కళాత్మకత, స్రుజనాత్మకత) మీరు..
. గుర్తించారు..
బ్. గుర్తించలేదు..
చ్. గుర్తించినా ఎమీ చెయలెము..
ద్. ఇంకా గుర్తించాల్సి ఉంది..
నా సమాధానం: : నాలొని స్రుజనాత్మకత నేను గుర్తించాననే అనుకుంటున్నాను. దానిని పరిపూర్నముగా ఉపయొగించుకొవడానికి ప్రయత్నిస్తున్నాను.
ప్రతీ మనిషిలొ ఎదో ఒక కళ పై ఆసక్తి కాని కళాత్మకత, స్రుజనాత్మకత కాని ఉంటుంది, దానిని మనం తెలుసుకొగలిగితె అది మనకి ఉపయోగపడుతుంది, మన మనసుకి ఉల్లాసాన్ని ఇస్తుంది కూడా.మనలొ కళని గుర్తించినా ఎమీ చెయలేము అనే ప్రసక్తే లేదు ఎందుకంటే మనిషి తలచుకుని మనసుపెట్టి చేస్తె సాధించలేనిది ఏదీ లేదు...
==================================
5. మీరు ఎదుటి వాళ్ల భావాలను ....
. గౌరవిస్తారు, వాళ్లు చెప్పింది వింటారు, ఆలొచిస్తారు.
. కించపరుస్తారు, కాని ఆలొచిస్తారు.
. అసలు లెక్కచేయరు, వాళ్లు చెప్పెది వినరు, ఆలొచించరు.
. తప్పదు కాబట్టి వింటారు, కాని ఆలొచించరు.
నా సమాధానం:: నేను ఎదుటి వాళ్ల భావాలను గౌరవిస్తాను, వాళ్లు చెప్పేది వింటాను, ఇంతకు ముందు అంతలా అలొచించే వాడిని కాదు కాని ఇప్పుడు ఆలొచిస్తున్నా..
ఆవతలి వారి భావాలను కించపర్చడం మంచి పద్దతి కాదు అని నా అభిప్రాయం, ఒక సారి వాళ్లు చెప్పేది వింటె సరిపొతుంది, తర్వాత మన ఇష్టం, ఎందుకు చెప్పారో ఒకసారి ఆలొచిస్తే సరిపొతుంది.
==================================
6. మీకు బోర్ కొట్టినప్పుడు..
. టీవి చూస్తారు..లెదా కంప్యుటర్(ఇంటర్నెట్)ముందు కూర్చుంటారు..
బ్. స్నెహితులకి ఫొన్ చేస్తారు..
చ్. ఫుస్తకాలు చదువుతారు..
ద్. పైవి అన్ని
నా సమాధానం: ద్: పైన ఉన్నవి అన్ని చేస్తాను.
ఓంటరితనంలొ పుస్తకాలు మంచి నేస్తాలు అని చాలా మంది అంటారు. మనం పుస్తక పటణం ద్వార చాలా విషయాలు తెలుసుకొవచ్చు, అలానే ఇంటర్నెట్ నుంచి కూడా అవసరమైన సమాచారం పొందవచ్చు(ఎవరి ఇష్టం వారిది, ఎవరి అభిరుచి వారిది).
==================================
7. టీవి చూస్తునప్పుడు చాన్నెల్లు(channels) ని?
. ఎక్కువగా చాన్నెల్లు మార్చరు
బ్. రిమోట్ నొక్కడమే పని..
చ్. ఒకటె చాన్నెల్ల్ ని చూస్తారు
ద్. అసలు టీవి చూడరు.
నా సమాధానం: బ్: టీవి ముందు కూర్చుంటె రిమోట్ నొక్కడమే నా పని, మా ఇంట్లొ నేను ఉంటె టీవి కుదురుగా ఉండదు.
నేను అలవాటుని మర్చుకోను ప్రయత్నిస్తున్నా ఎందుకంటె చాన్నెల్ల్ మర్చడం వల్ల కలిగె "బ్లాంక్ ఎఫ్ఫెక్ట్" మన కంటి పై ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకున్నాను. టీవి ని సరైన దూరం నుంచి చుడడం మంచిది.
==================================
8. సంగీతం అంటే మీకు..
. చాలా ఇష్టం
బ్. కొంచం ఇష్టం..
చ్. అసలు ఇష్టం లేదు
ద్. సంగీతం గురించి ఎమీ తెలీదు.
నా సమాధానం: బ్: సంగీతం అంటె కొంచం ఇష్టం, నాకు సంగీతం గురించి అంతగా తెలిదు కాని సంగీతం వింటాను, ఆశ్వాదిస్తాను.
సంగీతం మనిషికి , మనసుకి కూడా ప్రశాంతతని ఇస్తుంది, సంగీతం గురించి ఎమీ తెలియక పొయినా విని ఆశ్వాదించచ్చు. సంగీతానికి ఎల్లలు లెవు, ఎటువంటి సంగీతమైనా (సాంప్రదాయ, వెస్టర్న్...)దాని మూలం సప్తస్వరాలే అన్నది జగమెరిగిన సత్యం.
==================================
9. పగటి పూట ప్రయాణంలొ(బస్, ట్రైన్ లాంటివి) మీరు ఏం చేస్తారు..
. ఫ్రక్రుతిని ఆశ్వాదిస్తారు..
బ్. ఫుస్తకం చదువుకుంటారు లెదా పాటలు వింటారు..
చ్. ఫొన్ మాట్లాడుతారు లెదా కబుర్లు చెప్పుకుంటారు..
ద్. నిద్రపొతారు..
నా సమాధానం: : పగటి పూట ప్రయాణంలొ నేను కిటికీ సిటు దొరికితె వదలను(బస్, ట్రైన్), అలా బైటికి చూస్తు వెనక్కి వెళ్లిపొతున్న చెట్లు, ఆకాశంలొ మబ్బులు, పచ్చటి పొలాలు, పల్లెటూర్లు చూస్తుంటే భలె ఉంటుంది.. నేను బండి నడిపితే మాత్రం రొడ్ మీదె నా ఎకాగ్రత అంతా ..
ప్రయాణంలొ ఎవరి ఇష్టం వారిది.. నేను అడిగింది ఒక సరదా ప్రశ్న అంతె...
==================================
10. మీరు రొజు ఎన్ని గంటలు నిద్ర పొతారు..
. 10 గంటలు
బ్. 8 గంటలు
చ్. 6 గంటలు
ద్. 4 గంటలు
నా సమాధానం:చ్: నెను రొజుకి కనీసం 6 గంటలు నిద్ర పొవడానికి ప్రయత్నిస్తాను.. ఉద్యొగపు హడావిడి లొ ఒకొసారి అది 4 నుంచి 5 గంటలె నిద్ర అవుతుంది.
మనిషికి సాధారనముగా రోజుకి 6 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలని డాక్టర్లు, సైంటిష్ట్లు చెపుతున్నారు.మనకి ఎంత హడావిడి ఉన్నా రోజుకి 6 గంటలన్నా నిద్ర అవసరం మనకి. మంచి నిద్ర మంచి ఆరొగ్యానికి మెట్టు.
==================================
ఇవీ మన కొసం పది ప్రశ్నలు.. ఏదో వెరైటీ గా ఒక ప్రయత్నం చేశాను . టపా లో వెతుక్కుంటే చాల విషయాలు దొరుకుతాయి.. నేను అదే పని లో ఉన్నా ఇంకా ఏం టపాలు (posts )పెడదామా అని..
మళ్ళి కలుద్దాం..

LinkWithin

Related Posts with Thumbnails