Wednesday, February 4, 2009

మన కోసం... పది ప్రశ్నలు....

సారి ఏం టపా పెడదామా అని అలొచించా, బుర్ర లొ పడడమే ఆలస్యం మీ ముందుకొచ్చెశా..
మనకొసం పది ప్రశ్నలనే టపా తొ..
మనల్ని మనం పరిశీలించుకునె ఒక విధమైన 'సెల్ఫ్ చెక్' లాంటిది ..ఇందులో నా సమాధానాలు కూడా తెలుపుతున్నాను, మీ సమాధానాలు మీరు తెలుసుకొండి, అవి మీకు ఉపయోగపడొచ్చు..
పది ప్రశ్నలు...
==================================
1. మీకు స్నెహితులతొ గడపడం అంటె ఇష్టం..
. అవును
భ్. కాదు
చ్. ఆప్పుడపుడు గడుపుతా
డ్. ఆవసరమైతేనె గడుపుతా
నా సమాధానం: : అవును, నాకు స్నెహితులతొ గడపడం అంటె చాలా ఇష్టం. వాళ్లతో సరదాగా వుంటాను. అవసరమా కాదా అని చూడను. వీలైనంత వరకు కాంటాక్ట్ లొ వుంటాను.
ప్రపంచంలొ స్నెహితులు అనే వాళ్లు లెని వారు వుండరు. స్నెహ భావం చాలా అమూల్యమైనది.. స్నెహం అంటే కాలనుగుణంగా వచ్చి వెల్లిపొయే వర్షం లాంటిది కాదు, మన చుట్టు ఎప్పుడూ ఉండే వాయువు(గాలి) వంటిది అని నా అభిప్రాయం..
==================================
2. మీ స్నెహితులతొ అన్ని విషయాలు పంచుకుంటారా..?
. అవును అన్ని
బ్. సంతొషం మాత్రమే
చ్. భాధ మాత్రమే
ద్. ఎమీ పంచుకోను
నా సమాధానం: బ్: సంతొషం మాత్రమే నేను స్నెహితులతొ పంచుకుంటాను. నాకు ఎందుకో బాధను పంచుకొవడం ఇష్టం ఉండదు.
స్నెహితులతొ పంచుకొలేని విషయం అంటూ ఎమీ లేదు, నీ బాదను చెప్పుకుంటే కొంతైన తెలికపడతావు అంటారు చాలామంది( నా స్నెహితులు కూడా) . అసలు ఎమీ పంచుకొకుండా వుండడం అనేది ఉండకూడదు అని నా అభిప్రాయం. నిజమైన స్నెహం ఎప్పుడూ తొడుగా ఉంటుంది..
==================================
3. మీలొని లొపాలని మీ స్నెహితులు ఎత్తిచూపితే ..?
. కొపం వస్తుంది
బ్. కొపం వచ్చినా లొపాలు తెలుసుకుందాం అని మౌనంగా వుంటారు..
చ్. ఆసలు కొపమే రాదు..
ద్. లొపాలు తెలుసుకుంటారు ..
నా సమాధానం: ఇప్పుడు ద్: లొపాలు తెలుసుకుంటాను. ఒకప్పుడు మాత్రం నా సమాధానం బ్.కొపం వచ్చెది కాని ఎం లొపం చూపిస్తారొ అని చూసేవాడిని.
స్నెహితులు మన లోపాలని చుపిస్తె అది మన మీద కొపం తొనొ అసుయతొనొ కాదు మనల్ని మనం సరిదిద్దుకుంటాం అని మంచి భావన తొ చెప్తారని నా అభిప్రాయం. ( విషయంలొ కొన్ని మినహాయింపులు వుండచ్చు, ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు కదా)..
==================================
4. మీలొని కళను (కళాత్మకత, స్రుజనాత్మకత) మీరు..
. గుర్తించారు..
బ్. గుర్తించలేదు..
చ్. గుర్తించినా ఎమీ చెయలెము..
ద్. ఇంకా గుర్తించాల్సి ఉంది..
నా సమాధానం: : నాలొని స్రుజనాత్మకత నేను గుర్తించాననే అనుకుంటున్నాను. దానిని పరిపూర్నముగా ఉపయొగించుకొవడానికి ప్రయత్నిస్తున్నాను.
ప్రతీ మనిషిలొ ఎదో ఒక కళ పై ఆసక్తి కాని కళాత్మకత, స్రుజనాత్మకత కాని ఉంటుంది, దానిని మనం తెలుసుకొగలిగితె అది మనకి ఉపయోగపడుతుంది, మన మనసుకి ఉల్లాసాన్ని ఇస్తుంది కూడా.మనలొ కళని గుర్తించినా ఎమీ చెయలేము అనే ప్రసక్తే లేదు ఎందుకంటే మనిషి తలచుకుని మనసుపెట్టి చేస్తె సాధించలేనిది ఏదీ లేదు...
==================================
5. మీరు ఎదుటి వాళ్ల భావాలను ....
. గౌరవిస్తారు, వాళ్లు చెప్పింది వింటారు, ఆలొచిస్తారు.
. కించపరుస్తారు, కాని ఆలొచిస్తారు.
. అసలు లెక్కచేయరు, వాళ్లు చెప్పెది వినరు, ఆలొచించరు.
. తప్పదు కాబట్టి వింటారు, కాని ఆలొచించరు.
నా సమాధానం:: నేను ఎదుటి వాళ్ల భావాలను గౌరవిస్తాను, వాళ్లు చెప్పేది వింటాను, ఇంతకు ముందు అంతలా అలొచించే వాడిని కాదు కాని ఇప్పుడు ఆలొచిస్తున్నా..
ఆవతలి వారి భావాలను కించపర్చడం మంచి పద్దతి కాదు అని నా అభిప్రాయం, ఒక సారి వాళ్లు చెప్పేది వింటె సరిపొతుంది, తర్వాత మన ఇష్టం, ఎందుకు చెప్పారో ఒకసారి ఆలొచిస్తే సరిపొతుంది.
==================================
6. మీకు బోర్ కొట్టినప్పుడు..
. టీవి చూస్తారు..లెదా కంప్యుటర్(ఇంటర్నెట్)ముందు కూర్చుంటారు..
బ్. స్నెహితులకి ఫొన్ చేస్తారు..
చ్. ఫుస్తకాలు చదువుతారు..
ద్. పైవి అన్ని
నా సమాధానం: ద్: పైన ఉన్నవి అన్ని చేస్తాను.
ఓంటరితనంలొ పుస్తకాలు మంచి నేస్తాలు అని చాలా మంది అంటారు. మనం పుస్తక పటణం ద్వార చాలా విషయాలు తెలుసుకొవచ్చు, అలానే ఇంటర్నెట్ నుంచి కూడా అవసరమైన సమాచారం పొందవచ్చు(ఎవరి ఇష్టం వారిది, ఎవరి అభిరుచి వారిది).
==================================
7. టీవి చూస్తునప్పుడు చాన్నెల్లు(channels) ని?
. ఎక్కువగా చాన్నెల్లు మార్చరు
బ్. రిమోట్ నొక్కడమే పని..
చ్. ఒకటె చాన్నెల్ల్ ని చూస్తారు
ద్. అసలు టీవి చూడరు.
నా సమాధానం: బ్: టీవి ముందు కూర్చుంటె రిమోట్ నొక్కడమే నా పని, మా ఇంట్లొ నేను ఉంటె టీవి కుదురుగా ఉండదు.
నేను అలవాటుని మర్చుకోను ప్రయత్నిస్తున్నా ఎందుకంటె చాన్నెల్ల్ మర్చడం వల్ల కలిగె "బ్లాంక్ ఎఫ్ఫెక్ట్" మన కంటి పై ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకున్నాను. టీవి ని సరైన దూరం నుంచి చుడడం మంచిది.
==================================
8. సంగీతం అంటే మీకు..
. చాలా ఇష్టం
బ్. కొంచం ఇష్టం..
చ్. అసలు ఇష్టం లేదు
ద్. సంగీతం గురించి ఎమీ తెలీదు.
నా సమాధానం: బ్: సంగీతం అంటె కొంచం ఇష్టం, నాకు సంగీతం గురించి అంతగా తెలిదు కాని సంగీతం వింటాను, ఆశ్వాదిస్తాను.
సంగీతం మనిషికి , మనసుకి కూడా ప్రశాంతతని ఇస్తుంది, సంగీతం గురించి ఎమీ తెలియక పొయినా విని ఆశ్వాదించచ్చు. సంగీతానికి ఎల్లలు లెవు, ఎటువంటి సంగీతమైనా (సాంప్రదాయ, వెస్టర్న్...)దాని మూలం సప్తస్వరాలే అన్నది జగమెరిగిన సత్యం.
==================================
9. పగటి పూట ప్రయాణంలొ(బస్, ట్రైన్ లాంటివి) మీరు ఏం చేస్తారు..
. ఫ్రక్రుతిని ఆశ్వాదిస్తారు..
బ్. ఫుస్తకం చదువుకుంటారు లెదా పాటలు వింటారు..
చ్. ఫొన్ మాట్లాడుతారు లెదా కబుర్లు చెప్పుకుంటారు..
ద్. నిద్రపొతారు..
నా సమాధానం: : పగటి పూట ప్రయాణంలొ నేను కిటికీ సిటు దొరికితె వదలను(బస్, ట్రైన్), అలా బైటికి చూస్తు వెనక్కి వెళ్లిపొతున్న చెట్లు, ఆకాశంలొ మబ్బులు, పచ్చటి పొలాలు, పల్లెటూర్లు చూస్తుంటే భలె ఉంటుంది.. నేను బండి నడిపితే మాత్రం రొడ్ మీదె నా ఎకాగ్రత అంతా ..
ప్రయాణంలొ ఎవరి ఇష్టం వారిది.. నేను అడిగింది ఒక సరదా ప్రశ్న అంతె...
==================================
10. మీరు రొజు ఎన్ని గంటలు నిద్ర పొతారు..
. 10 గంటలు
బ్. 8 గంటలు
చ్. 6 గంటలు
ద్. 4 గంటలు
నా సమాధానం:చ్: నెను రొజుకి కనీసం 6 గంటలు నిద్ర పొవడానికి ప్రయత్నిస్తాను.. ఉద్యొగపు హడావిడి లొ ఒకొసారి అది 4 నుంచి 5 గంటలె నిద్ర అవుతుంది.
మనిషికి సాధారనముగా రోజుకి 6 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలని డాక్టర్లు, సైంటిష్ట్లు చెపుతున్నారు.మనకి ఎంత హడావిడి ఉన్నా రోజుకి 6 గంటలన్నా నిద్ర అవసరం మనకి. మంచి నిద్ర మంచి ఆరొగ్యానికి మెట్టు.
==================================
ఇవీ మన కొసం పది ప్రశ్నలు.. ఏదో వెరైటీ గా ఒక ప్రయత్నం చేశాను . టపా లో వెతుక్కుంటే చాల విషయాలు దొరుకుతాయి.. నేను అదే పని లో ఉన్నా ఇంకా ఏం టపాలు (posts )పెడదామా అని..
మళ్ళి కలుద్దాం..

5 comments:

Anonymous said...

మీ టపా బాగుంది ,ప్రశ్నలు సాదాసీదాగా ఉన్నవి. మీ సమాధానాలు పర్వాలేదు కానీ వివరణ లొ స్పష్టత లేదు.ఈ టపా ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. మీ బ్లాగ్ పేరుకు తగ్గట్టు ఇంకా కొత్తగా ప్రయత్నిచండి..
All the best!

శివ చెరువు said...

Good one.. more than this..no comments for now.. Nenu mee ninchi .. inkaa itharathraaa post la kosam yedhuru choostunnaaa... chooste.. jigel manipinchali..

All the best.. :-)
Siva Cheruvu

విశ్వ ప్రేమికుడు said...

బాగుంది. టపాలో కొత్తదనం ఉంది. ఆల్ ద బెస్ట్. :)

Anonymous said...

Nice one.. Good summary.
Expecting some more good posts from u...
All the best!

Anonymous said...

Sirisha...
Nice one ... you have got great ideas..

LinkWithin

Related Posts with Thumbnails