Wednesday, December 15, 2010

ఈ నేల మనది రా !


వింత నాయకుల రాజ్యంలో
పంటను కాపాడుకోలేని దైన్యంలో
చావూ బ్రతుకుల సమరంలో
కుక్షి నింపే రైతన్న కుశించుకుపోతున్న ఈ నేల మనది రా !

స్వేఛ్చ లేని స్వతంత్ర దేశంలొ
అంతులేని అవమానాల లోకంలో
అశ్లీల అరాచకపు ఆరళ్ళలో
ఆడదాన్ని గౌరవించలేకపోతున్న ఈ నేల మనది రా!

ప్రాంతీయ దురహంకారంతో
స్వప్రయోజన దురాభిమానంతో
సామాన్యులే సమిధలయే ఆజ్యంలో
సాటి మనిషిని మనిషిగా చూడలేకపోతున్న ఈ నేల మనది రా!

పరాయి దేశానికి ప్రేమతో
బానిసలుగా బ్రతికే పనులతో
జేబులు నింపుకునే డబ్బుతో
భారతీయతకు ఊపిరులూదలేకపోతున్న ఈ నేల మనది రా!

Friday, December 10, 2010

జీవించడం మర్చిపోతున్నా!


ఆటుపోట్ల జీవనానికి అలవాటు పడుతున్నా!
మనసున్న మనిషిగా ఒంటరవుతున్నా

స్నేహితులతో కలివిడిగా ఉండలేక విడిపోతున్నా!
ఆత్మీయులకి అందనంత దూరం వెళ్ళిపోతున్నా

జీవితంలో ఓ తోడుకోసం నే వెతకకున్నా!
నాకు తోడుగా ఉన్నవారిని వదిలేస్తున్నా

నరుడిగా నలుగురికి ఉపయోగపడుతున్నా!
నాకంటూ ఏమీ లేని వాడిగా బ్రతికేస్తున్నా

జీవిత పరమార్ధం ఏమిటొ వెతుకుతున్నా!
కానీ! నన్ను నేను మోసం చేసుకుంటూ,

నేను నేనుగా జీవించడం మర్చిపోతున్నా!

Wednesday, December 8, 2010

చెప్పుకోండి చూద్దాం! 3

ఈ క్రింది ఫోటోలలో ఉన్న వారిని వరుసక్రమంలో గుర్తించి వ్యాఖ్యల్లో పెట్టండి,
ఇది ఒక సరదా ప్రయత్నం మాత్రమే :)


1.

2.

3.

4.

5.

Wednesday, December 1, 2010

గుర్తుకొచ్చింది..... ఓ మంచి పాట - 5

పల్లవి:

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక!
ఏ దారెటుపోతుందో ఎవరినీ అడగక!

ఎవరికెవరు (1 సారి)

జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!
జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!!

చరణం :

వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో హా

వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో
కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో
కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో

కానీ ఆ కడలి కలిసేది ఎందులో ?

ఎవరికెవరు (1 సారి)
ఎవరికెవరు ఈ లోకంలో...

జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!
జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!!


చిత్రం: సిరి సిరి మువ్వ( 1978 లొ విడుదల)
సంగీతం: K.V. మహదేవన్ గారు
సాహిత్యం: వేటూరి గారు
పాడిన వారు: S.P. బాల సుబ్రమణ్యం

Friday, October 29, 2010

అక్షరమాల... అమరవాణి -5

ఇంకొన్ని ..

1. మనిషికి మంచి పనుల ద్వారా దివ్యత్వం సిద్దిస్తుంది

2. శ్రద్ద చూపితే ఉంది భవిష్యత్తు కి అపురూపమైన భద్రత

3. తప్పంతా మనుషులలోనే ఉంది కాని మతంలో లేదు!

4. మనుషుల గొప్పతనము, అల్పత్వము వాళ్ళు చేసే పనుల వల్లనే కలుగుతుంది..

5. దేవుడు అంతర్యామి, కనుక ఎంత వారిలో అంత వుంటాడు.

Wednesday, October 27, 2010

మలినం!

వీచే చల్లని గాలి మలినం
పూచే అందమైన పువ్వు మలినం

గల గల పారే ఏరు మలినం
నదిలో ప్రవహించే నీరు మలినం

తడిచే నేల మలినం
పండే చేను మలినం

తినే కూడు మలినం
అరాయించే కుక్షి మలినం

ప్రపంచాన్ని చూసే కళ్ళు మలినం
ప్రాపంచిక విషయాలకై వళ్ళు మలినం

మనిషి యుక్తి మలినం
దేవుని పై భక్తి మలినం

ఎన్ని మలినమైనా మనసు పవిత్రం..
ఆత్మసాక్షాత్కారానికి అదే మార్గాదర్శకం..

Thursday, October 14, 2010

త్రిభువనేశ్వరి శర్వాణి.. మహిషాసుర మర్ధిని..

భక్తితొ కొలిచినవారికి ముక్తిని ప్రసాదించే వరదాయిని..

అనంతకోటి బ్రహ్మాండానికి ప్రేమను పంచే అమ్మా భవాని..

సకల జీవరాసుల్ని కాపాడే చల్లని తల్లి త్రిభువనేశ్వరి శర్వాణి...

మా అపరాధములు మన్నించి కరుణామృతాలు కురిపించు కాత్యాయని..

మహిషమవుతున్న మనిషిని మరల మనిషిని చేయగా అవతరించవా!
మహిషాసుర మర్ధిని...

బ్లాగు మిత్రులందరికి
విజయదశమి శుభాకంక్షలు :)

Tuesday, October 12, 2010

"నేనున్నాను " అంటుంది .. మొబైల్ ఫొన్

మృదువైన గానాన్ని వినిపిస్తుంది
సంక్షిప్త సందేశాలను తీసుకొస్తుంది

ఆప్యాయతల్ని, అనురాగాలని మోసుకొస్తుంది
నీ మోము పై చిరునవ్వు పూయిస్తుంది

ఏకాంతాన ఏకైక తోడవుతుంది
ఒకోసారి భారంగా చిరాకుపెడుతుంది

నీ భావాలని అందరితో పంచుకోమంటుంది
నీ చేతికి అందేంత దూరంలో వుంటుంది

ఎప్పుడూ నీకు " నేనున్నాను " అంటుంది ..
మొబైల్ ఫొన్

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి -10

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
ఇందులో గ్రాఫిక్స్ లేవు అన్నిమొబైల్ తో తీసినవే
Mobiles used samsung s3310i and fly-sx210 with 2MP కామెరా

Sunday, October 10, 2010

TOP-10 విశేషాలు

ప్రతీవిషయంలోను మనం మొదటి మూడు స్థానాలు ముఖ్యముగా చూస్తాం
ఆ తర్వాత 1 నుంది 10 వరకు చూస్తాం,
అలా భారత దేశం లోని కొన్ని TOP-10 విశేషాలు...

Top 10 సంపన్ననగరాలు (wealthiest cities):



Top 10 TV ఎక్కువగా చూసే నగరాలు (cities with higher exposure to TV):



Top 10 trains of India:


Enjoy the Rajasthani Culture in this Royal Carnage as you go places....

Have a touch and feel of the Gujarati Culture and places in this heritage train.....

A perfect combo of Royal Carnage and Wildlife Sanctuary, enjoy the ride.....

Royal Palaces, coaches and the golden beaches with the royal comforts....

See the South Indias best tourist attractions along the Royal Comforts ....

See the Indian Unesco World Heritage Sites with the comforts of a King.

See the Shekhawati Region of Rajasthan in this Royal Carnage .....

This Tiny train takes you on a memorable ride of Darjeeling Hills.

A little Hill Station, a tiny train and the tea Bagans, there cannot be anything better....

All the Buddhist Religious places covered in one voyage.

Top 10 Beaches of India:

1. Anjuna Beach - Panaji, Goa
2. Colva Beach - Goa
3. Baga Beach - Goa
4. Kovalam Beach - Kerala
5. Lakshadweep Beaches
6. Marina Beach - Chennai, TN
7. Andaman Islands Beaches
8. Rushikonda Beach - Vizag, AP
9. Calangute Beach - Goa
10. Marari Beach - Kerala


Top 10 Lakes of India:

See the Pushkar Lake in the holy place of Pushkar.....

See the beautiful lake Pichola in the land of Lakes, Udaipur....

A lake in the Himalayas, can anything be beautiful than this ....

See the lake made by river water and not by ice of melted Himachal Hills....

The most famous Lake of Srinagar welcomes tourists in its House Boats...

With Mc Leod Ganj near to it, it becomes a hot spot for tourists...

There isn't a beautiful man made lake than this.

Made by the Nizam, lived by people, its a beautiful lake ....

The most beautiful lake of Orissa, its the one which will make you sit by its side.....

Connecting Agartala, Udaipur and Gomti River, Dumboor is beautiful in its own way....

Top 10 cities of India Population-wise:

1. Mumbai
2. Kolkata
3. Delhi
4. Chennai
5. Hyderabad
6. Bengaluru
7. Ahmedabad
8. Pune
9. Surat
10. Kanpur

Details taken from different statistical websites on internet.. :)

Saturday, October 9, 2010

ఈ టపాలు తప్పక చూడండి!

బ్లాగు ప్రపంచంలో ఎన్నో టపాలు ,
అందులో కొన్ని మనకి నచ్చుతాయి కొన్ని మనసుకు హత్తుకుంటాయి,
అలాంటి వాటిలొ కొన్ని టపాలు మీతో ఇక్కడ పంచుకుందామని ఉంచాను,
అవి మిమ్మల్ని తప్పక అలరిస్తాయి, ఆలొచింపజేస్తాయి అని ఆశిస్తున్నాను ..
బ్లాగు రచయితల అనుమతి లేకుండా పెడుతున్నందుకు మన్నించగలరు.

టపా పేరు: ఏడుపు
బ్లాగు రచయిత: రాజన్

టపా పేరు: వ్యక్తిగత వికాసం
బ్లాగు రచయిత: కొత్త పాళీ

టపా పేరు: నేడు
బ్లాగు రచయిత: శరత్ చంద్ర

టపా పేరు: తుదినేస్తం
బ్లాగు రచయిత: పరిమళం

టపా పేరు: ఆ నలుగురు ఏరీ??
బ్లాగు రచయిత: ఝాన్సీ

టపా పేరు: తులసి - సంజీవని
బ్లాగు రచయిత: monkey 2 man


ధన్యవాదములు
క్రియేటివ్ కుర్రోడు మాధవ్

Tuesday, October 5, 2010

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి -9

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
ఇందులో గ్రాఫిక్స్ లేవు అన్ని మొబిలె తో తీసినవే
Mobile used samsung s3310i with 2MP కామెరా




Thursday, August 19, 2010

అందరూ.. నీవు..


అందరికోసం నీవు ఒంటరి అయినా ..
నీ కోసం ఎవరో వస్తారని ఆశించకు..

అందరికోసం నీవు మౌనంగా ఉన్నా..
నీతో ఎవరో మాట్లాడతారని అనుకోకు..

అందరినీ నీవు అర్థం చేసుకున్నా..
నిన్ను ఒక్కరైనా అర్థం చేసుకోవాలి అనుకోకు..

అందరినీ నీవు ప్రేమించినా ..
నిన్ను ఎవరో ఒకరు ప్రేమిస్తారనుకోకు ..

Tuesday, August 17, 2010

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి -8

ఫోటోలు తీయడం అంటే నాకు భలే సరదా,
నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
ఇందులో గ్రాఫిక్స్ లేవు అన్ని మొబిలె తో తీసినవే
mobiles used are fly sx210 and samsung s3310i with 2MP camera







Friday, June 18, 2010

చెప్పుకోండి చూద్దాం! 2

ఈ క్రింది ఫోటోలలో ఉన్న వారిని వరుసక్రమంలో గుర్తించి వ్యాఖ్యల్లో పెట్టండి,
ఇది ఒక సరదా ప్రయత్నం మాత్రమే :)

1.

2.

3.

4.

5.

Saturday, June 12, 2010

ప్రేమే..

సంధ్యా సమయాన జాలువారిన జాజిపూల సువాసన వంటిది ప్రేమ..

పిల్ల గాలికి హొయలు వొలికించే వరి చేను వంటిది ప్రేమ..

సప్తస్వరాలతో సుమధుర సంగీత స్వరార్చన వంటిది ప్రేమ..

అనురాగం కురిపించే చల్లని తల్లి చూపు వంటిది ప్రేమ..

సాధకుని షడ్చక్రాలలో నిండి ఉన్న సంకల్పబలం వంటిది ప్రేమ..

ఆనందమయమైన జీవితాన్ని అందముగా రుచి చూపించేది ప్రేమ ..

గాయపడిన మనసుని అక్కున చేర్చుకుని సాంత్వనపరిచేది ప్రేమ..

మనిషిని తాను ఇంకా మనిషినే అని నిరూపించుకునేలా చేసేది..

ప్రేమే..

Wednesday, June 9, 2010

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి -7

ఫోటోలు తీయడం అంటే నాకు భలే సరదా,
నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
ఇందులో గ్రాఫిక్స్ లేవు అన్ని mobile తో తీసినవే!

Friday, June 4, 2010

తూర్పు కనుమలు - ౩: సొంత వూరు

తూర్పు కనుమలు - ౩
సొంత వూరు

సమయం: సాయంత్రం 6:౦౦
ప్రాంతం: దోర్నాల , ప్రకాశంజిల్లా

అప్పుడే పొలం నుంచి ఇంటికి వచ్చిన ఒక పెద్దాయన అలా కింద కూచుని వర్షించడానికి సిద్దంగా ఉన్న మబ్బులకేసి చూస్తూ " బిడ్డ ఎలా ఉన్నాడో ఏంటో , వేలకి తిండి తిప్ప ఉందొ లేదో అ నగరంలో. బతుకేలా ఉందొ ఏంటో " అనుకుంటూ ఉన్నాడు. రాత్రికి ఇంత తిని పడుకున్నాడు, మళ్ళి పొద్దున్నెపొలం పనికి వెళ్ళిపోయాడు .

సమయం: ఉదయం 9:౦౦
ప్రాంతం: హైదరాబాద్

ఒక job consultancy వద్ద ఉద్యోగార్దులై వచ్చిన వారందరితో పాటు ఉన్నాడు మధు, ఇతనెవరో కాదు ఇందాక మీరు చదివిన పెద్దాయన కొడుకు, పెద్ద లక్ష్యం, పెద్ద సంపాదన అని కలలు కని రైలెక్కి రాజధానికి చేరాడు 6 నెలల క్రితం, కాసేపటికి వచ్చిన వారిలో కొందరు తర్వాత ఇంకొందరు వెళ్ళిపోయారు , సాయంత్రం: ౦౦ మధు తీపి కబురు తో బైటకి వచ్చాడు, తన కలల సామ్రాజ్యాన్ని నిర్మించుకోడానికి తొలి ఇటుకని పేర్చినంత ఆనందం అతని ముఖంలో , తన దెగ్గర ఉన్న పాత నోకియ ఫోను బైటకు తీసి అందరికి చెప్పుకుని సంబరపడ్డాడు ఒక్క తన తండ్రికి తప్ప, ఎందుకంటే కొడుకుని వదిలి ఉండలేక అతను ఎప్పుడు "మన ఊర్లోనే ఉండి ఏదో ఒకటి చేస్కో నాయన నాకు తోడుగా ఉంటది "అనేవాడు, అది మధుకి నచ్చేది కాదు , కొత్త ఉద్యోగం, కొత్త ఆశలు, మనవడు భూమ్మీద లేడు , కొన్నాళ్ళు గడిచింది మధు తండ్రి జబ్బుపడ్డాడు అతనిని చూడడానికి కూడా వెళ్ళలేదు , అడిగితే సెలవు దొరకలేదు అనేవాడు.

ఒక రోజు పిడుగులాంటి వార్త ఆర్ధిక మాంద్యం వల్ల 200 మందిని ఉద్యోగాల్లోంచి తిసేస్తారని , అందులో మధు కూడా ఒకడు, అతనికి ఇంటినుండి తండ్రి పంపించే డబ్బులు తిస్కోవట్లేదు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడగను అని ఆలోచించసాగాడు , అయిన అతని తండ్రి డబ్బులు పంపాడు, పొలానికి వెళ్లి పని చేసి సంపాదించాడు, తండ్రిని చూడడానికి మధు వచ్చాడు, తన కోసం తండ్రి పడుతున్న తపన కళ్లారా చూసాడు! తన మూర్ఖత్వానికి తిట్టుకున్నాడు, తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి పోదామని అనుకున్నాడు, మధు నిర్ణయానికి తండ్రి సంతోషించాడు, " నువ్వు నాటో ఉందాము అనుకున్నావవు, ఇన్నేళ్ళుగా నేను ఎదురుచూసిన మాటని చెప్పావు అయిన నా స్వార్థం కోసం నిన్ను బలి చేయలేను బాబు" , " నీ జీవితం పూల బాట నాది ఇక్కడే ముళ్ళ బాట " అప్పుడు " నడక నేర్పిన నీ వెంట ముళ్ళ బాట అయిన పూల బాటే నాన్న" అని అన్నాడు మధు.
సమయం: సాయంత్రం 6:౦౦
ప్రాంతం: దోర్నాల , ప్రకాశంజిల్లా

కొన్నాళ్ళకి మధు కొంత డబ్బు పోగేసి ఒక చిన్న BPO పెట్టాడు దోర్నాల లో , తన తోటి వారికి శిక్షణ ఇచ్చి గ్రామీణ ఉపాధికి తనవంతు ప్రయత్నం చేశాడు, మరికొన్నాళ్ళకి అతని చిన్న కంపెనీ అభివృద్ది చెంది చుట్టు ప్రక్కల విస్తరించింది, మధు కి మంచి పేరొచ్చింది, అలా తన ఆశయం తన తండ్రి కోరిక నెరవేర్చుకున్నాడు మధు తన సొంత వూరిలో! సూర్యాస్తమయం అవుతుండగా పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు తండ్రి కొడుకులు, ఇద్దరిలో ఏదో తెలియని సంతోషం కనపడుతోంది స్పష్టంగా. ఒకరి సంతోషం మరొకరికి విజయం, సంధ్యాదిత్యుడు నల్లమల కొండలలోకి కనుమరుగైపోయాడు మెల్లగా...

LinkWithin

Related Posts with Thumbnails