Thursday, June 27, 2013

2013 హిమాలయ మహావిలయ గుణపాఠాలు - 1

2013 హిమాలయ మహావిలయ గుణపాఠాలు - 1

Image source: Times of India

ఆధ్యాత్మిక క్షేత్రం దేవభూమి నేడు మరుభూమిగా మారింది.
మహోగ్ర భీకర వరదలతో ప్రకృతి రుద్ర తాండవానికి కకావికలమైంది.
ఈ విపత్తుకి కారణం ముమ్మాటికి మనమే, మనందరమే...

మనిషి ఆత్యాశ ప్రకృతి సంపద, సమతుల్యాన్ని హరించి, సామూహిక జనహనన విపత్తులకి కారణమవుతుంది. అడవుల కోత, విచ్చలవిడి నిర్మాణాలు, వాతావరణ కాలుష్యాల వల్లే ఈ మహా విపత్తు సంభవించింది.


భారత సైన్యం త్రివిధ దళాలు మరియి స్వచ్చంద సంస్థలు అవిశ్రాంతంగా శ్రమించి ఇప్పటికి (26 June 2013) 
70,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

Image Source: First Post

హిమానీనదాల్లో (Glacier) కాలుష్యం వళ్ళ మంచు త్వరగా తేలికపాటిగా కరిగి నీరై ఉదృతంగా ప్రవహిస్తుంది. అదీ కేదరినాథ్ వరదకి అసలు కారణం. అధిక వర్షపాతానికి  కాలుష్యం కూడ జతకలిసి ప్రకృతి విలయ తాండవం ఆడింది  

''ఒక సాదారణ వృక్షం 60 సంవత్సరాలు పెరిగితే సమాజానికి 15,70,000 రూపాయల విలువగల సేవాసౌభాగ్యాన్ని కలుగ చేస్తుంది. అటువంటి కోట్ల కోట్లాది చెట్లు కలిగిన అడవి నుంచో?.....''
ఇది నేను ఒక వ్యాసంలో చూసిన ప్రశ్న!

అడవుల వల్ల ఉపయోగాలు,జీవావరణ వ్యవస్థలో ప్రకృతిలోని జీవరాసుల సమతుల్యాన్ని సాధిస్తుంది.వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తాయి.వరదలు రాకుండా నివారిస్తాయి.

మనం ఇప్పుడు అభివృద్ధి మాటున మనం కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాము. అడవులని నాశనం చేస్కుని వూర్లు పెంచుకుంటున్నాము, కానీ ఒక చెట్టు నరికిన చోట వెలసిన మన ఇంట్లో చిన్న మొక్క కూడ పెంచుకునే వెసలుబాటు కల్పించుకోలేకపోతున్నాము, మనకి నిలువ నీడలేకుండా పోయే వరకు తెచ్చుకోవడం మంచిది కాదు. సహజ వనరులు తగ్గిపోతున్నాయి. కృతిమ వనరుల అవసరం పెరుగుతోంది. పచ్చదనం, చెట్లు కనుమరుగవటం వల్ల వాతావరణంలో విపరీత మార్పులేర్పడుతున్నయి.

Image Source: Vinayraj from Wikimedia Commons

కాళ్ళ కింద భూమిని, తల పై ఆకాశాన్ని నాశనం చేసుకుంటున్నాము. మనం బ్రతకడం కోసం కొన్ని జీవజాతుల్ని అంతరింపచేస్తున్నాము. మనము ఇకనైనా భాద్యతగా మసలుకోకపోతే భావి తరాలు ఈ భూమిపై మనుగడ సాగించడం కఠినతరమవుతుంది.

ఇంటి ఆవరణలో ఒక చెట్టు, కొన్ని మొక్కలు కానీ పేంచండి, అది మన కర్తవ్యం. 
బహుళ అంతస్తుల భవనాలలో ఉంటే కుండీలలో మొక్కలు పెంచండి. 

2వ భాగం  గుణపాఠాలు లో మొక్కల నుంచి అడవులు, జీవవైవిధ్యం, కాలుష్యకారకాలు.

LinkWithin

Related Posts with Thumbnails