Friday, June 18, 2010

చెప్పుకోండి చూద్దాం! 2

ఈ క్రింది ఫోటోలలో ఉన్న వారిని వరుసక్రమంలో గుర్తించి వ్యాఖ్యల్లో పెట్టండి,
ఇది ఒక సరదా ప్రయత్నం మాత్రమే :)

1.

2.

3.

4.

5.

Saturday, June 12, 2010

ప్రేమే..

సంధ్యా సమయాన జాలువారిన జాజిపూల సువాసన వంటిది ప్రేమ..

పిల్ల గాలికి హొయలు వొలికించే వరి చేను వంటిది ప్రేమ..

సప్తస్వరాలతో సుమధుర సంగీత స్వరార్చన వంటిది ప్రేమ..

అనురాగం కురిపించే చల్లని తల్లి చూపు వంటిది ప్రేమ..

సాధకుని షడ్చక్రాలలో నిండి ఉన్న సంకల్పబలం వంటిది ప్రేమ..

ఆనందమయమైన జీవితాన్ని అందముగా రుచి చూపించేది ప్రేమ ..

గాయపడిన మనసుని అక్కున చేర్చుకుని సాంత్వనపరిచేది ప్రేమ..

మనిషిని తాను ఇంకా మనిషినే అని నిరూపించుకునేలా చేసేది..

ప్రేమే..

Wednesday, June 9, 2010

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి -7

ఫోటోలు తీయడం అంటే నాకు భలే సరదా,
నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
ఇందులో గ్రాఫిక్స్ లేవు అన్ని mobile తో తీసినవే!

Friday, June 4, 2010

తూర్పు కనుమలు - ౩: సొంత వూరు

తూర్పు కనుమలు - ౩
సొంత వూరు

సమయం: సాయంత్రం 6:౦౦
ప్రాంతం: దోర్నాల , ప్రకాశంజిల్లా

అప్పుడే పొలం నుంచి ఇంటికి వచ్చిన ఒక పెద్దాయన అలా కింద కూచుని వర్షించడానికి సిద్దంగా ఉన్న మబ్బులకేసి చూస్తూ " బిడ్డ ఎలా ఉన్నాడో ఏంటో , వేలకి తిండి తిప్ప ఉందొ లేదో అ నగరంలో. బతుకేలా ఉందొ ఏంటో " అనుకుంటూ ఉన్నాడు. రాత్రికి ఇంత తిని పడుకున్నాడు, మళ్ళి పొద్దున్నెపొలం పనికి వెళ్ళిపోయాడు .

సమయం: ఉదయం 9:౦౦
ప్రాంతం: హైదరాబాద్

ఒక job consultancy వద్ద ఉద్యోగార్దులై వచ్చిన వారందరితో పాటు ఉన్నాడు మధు, ఇతనెవరో కాదు ఇందాక మీరు చదివిన పెద్దాయన కొడుకు, పెద్ద లక్ష్యం, పెద్ద సంపాదన అని కలలు కని రైలెక్కి రాజధానికి చేరాడు 6 నెలల క్రితం, కాసేపటికి వచ్చిన వారిలో కొందరు తర్వాత ఇంకొందరు వెళ్ళిపోయారు , సాయంత్రం: ౦౦ మధు తీపి కబురు తో బైటకి వచ్చాడు, తన కలల సామ్రాజ్యాన్ని నిర్మించుకోడానికి తొలి ఇటుకని పేర్చినంత ఆనందం అతని ముఖంలో , తన దెగ్గర ఉన్న పాత నోకియ ఫోను బైటకు తీసి అందరికి చెప్పుకుని సంబరపడ్డాడు ఒక్క తన తండ్రికి తప్ప, ఎందుకంటే కొడుకుని వదిలి ఉండలేక అతను ఎప్పుడు "మన ఊర్లోనే ఉండి ఏదో ఒకటి చేస్కో నాయన నాకు తోడుగా ఉంటది "అనేవాడు, అది మధుకి నచ్చేది కాదు , కొత్త ఉద్యోగం, కొత్త ఆశలు, మనవడు భూమ్మీద లేడు , కొన్నాళ్ళు గడిచింది మధు తండ్రి జబ్బుపడ్డాడు అతనిని చూడడానికి కూడా వెళ్ళలేదు , అడిగితే సెలవు దొరకలేదు అనేవాడు.

ఒక రోజు పిడుగులాంటి వార్త ఆర్ధిక మాంద్యం వల్ల 200 మందిని ఉద్యోగాల్లోంచి తిసేస్తారని , అందులో మధు కూడా ఒకడు, అతనికి ఇంటినుండి తండ్రి పంపించే డబ్బులు తిస్కోవట్లేదు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడగను అని ఆలోచించసాగాడు , అయిన అతని తండ్రి డబ్బులు పంపాడు, పొలానికి వెళ్లి పని చేసి సంపాదించాడు, తండ్రిని చూడడానికి మధు వచ్చాడు, తన కోసం తండ్రి పడుతున్న తపన కళ్లారా చూసాడు! తన మూర్ఖత్వానికి తిట్టుకున్నాడు, తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి పోదామని అనుకున్నాడు, మధు నిర్ణయానికి తండ్రి సంతోషించాడు, " నువ్వు నాటో ఉందాము అనుకున్నావవు, ఇన్నేళ్ళుగా నేను ఎదురుచూసిన మాటని చెప్పావు అయిన నా స్వార్థం కోసం నిన్ను బలి చేయలేను బాబు" , " నీ జీవితం పూల బాట నాది ఇక్కడే ముళ్ళ బాట " అప్పుడు " నడక నేర్పిన నీ వెంట ముళ్ళ బాట అయిన పూల బాటే నాన్న" అని అన్నాడు మధు.
సమయం: సాయంత్రం 6:౦౦
ప్రాంతం: దోర్నాల , ప్రకాశంజిల్లా

కొన్నాళ్ళకి మధు కొంత డబ్బు పోగేసి ఒక చిన్న BPO పెట్టాడు దోర్నాల లో , తన తోటి వారికి శిక్షణ ఇచ్చి గ్రామీణ ఉపాధికి తనవంతు ప్రయత్నం చేశాడు, మరికొన్నాళ్ళకి అతని చిన్న కంపెనీ అభివృద్ది చెంది చుట్టు ప్రక్కల విస్తరించింది, మధు కి మంచి పేరొచ్చింది, అలా తన ఆశయం తన తండ్రి కోరిక నెరవేర్చుకున్నాడు మధు తన సొంత వూరిలో! సూర్యాస్తమయం అవుతుండగా పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు తండ్రి కొడుకులు, ఇద్దరిలో ఏదో తెలియని సంతోషం కనపడుతోంది స్పష్టంగా. ఒకరి సంతోషం మరొకరికి విజయం, సంధ్యాదిత్యుడు నల్లమల కొండలలోకి కనుమరుగైపోయాడు మెల్లగా...

Tuesday, June 1, 2010

ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !


కావలసినవి అన్నీ ఉన్నా 'అన్నా-చెల్లి' అనే పిలుపులు లేని
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !
పంతాలు పట్టింపులతో , కుళ్ళు కుతంత్రాలతో నిండిన
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !

ఒకరి రక్తమాంసాలతో వేరొకరు కీర్తిని పొందుతున్న
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !
ప్రకృతిని ప్రేమించలేక ప్రళయానికి చేరువవుతున్న
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !

స్త్రీ మూర్తిని గౌరవ భావంతో చుడలేని
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !
'తన' అనే తప్ప 'మన' అనే భావన లేని
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !

తప్పు చేసిన దానిని కప్పిపుచ్చుకుని
మరో తప్పుకి సిద్దపడుతున్న
ఈ ప్రపంచం నాకు నచ్చట్లేదు !

LinkWithin

Related Posts with Thumbnails