Wednesday, December 15, 2010

ఈ నేల మనది రా !


వింత నాయకుల రాజ్యంలో
పంటను కాపాడుకోలేని దైన్యంలో
చావూ బ్రతుకుల సమరంలో
కుక్షి నింపే రైతన్న కుశించుకుపోతున్న ఈ నేల మనది రా !

స్వేఛ్చ లేని స్వతంత్ర దేశంలొ
అంతులేని అవమానాల లోకంలో
అశ్లీల అరాచకపు ఆరళ్ళలో
ఆడదాన్ని గౌరవించలేకపోతున్న ఈ నేల మనది రా!

ప్రాంతీయ దురహంకారంతో
స్వప్రయోజన దురాభిమానంతో
సామాన్యులే సమిధలయే ఆజ్యంలో
సాటి మనిషిని మనిషిగా చూడలేకపోతున్న ఈ నేల మనది రా!

పరాయి దేశానికి ప్రేమతో
బానిసలుగా బ్రతికే పనులతో
జేబులు నింపుకునే డబ్బుతో
భారతీయతకు ఊపిరులూదలేకపోతున్న ఈ నేల మనది రా!

Friday, December 10, 2010

జీవించడం మర్చిపోతున్నా!


ఆటుపోట్ల జీవనానికి అలవాటు పడుతున్నా!
మనసున్న మనిషిగా ఒంటరవుతున్నా

స్నేహితులతో కలివిడిగా ఉండలేక విడిపోతున్నా!
ఆత్మీయులకి అందనంత దూరం వెళ్ళిపోతున్నా

జీవితంలో ఓ తోడుకోసం నే వెతకకున్నా!
నాకు తోడుగా ఉన్నవారిని వదిలేస్తున్నా

నరుడిగా నలుగురికి ఉపయోగపడుతున్నా!
నాకంటూ ఏమీ లేని వాడిగా బ్రతికేస్తున్నా

జీవిత పరమార్ధం ఏమిటొ వెతుకుతున్నా!
కానీ! నన్ను నేను మోసం చేసుకుంటూ,

నేను నేనుగా జీవించడం మర్చిపోతున్నా!

Wednesday, December 8, 2010

చెప్పుకోండి చూద్దాం! 3

ఈ క్రింది ఫోటోలలో ఉన్న వారిని వరుసక్రమంలో గుర్తించి వ్యాఖ్యల్లో పెట్టండి,
ఇది ఒక సరదా ప్రయత్నం మాత్రమే :)


1.

2.

3.

4.

5.

Wednesday, December 1, 2010

గుర్తుకొచ్చింది..... ఓ మంచి పాట - 5

పల్లవి:

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక!
ఏ దారెటుపోతుందో ఎవరినీ అడగక!

ఎవరికెవరు (1 సారి)

జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!
జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!!

చరణం :

వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో హా

వాన కురిసి కలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో
కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో
కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో

కానీ ఆ కడలి కలిసేది ఎందులో ?

ఎవరికెవరు (1 సారి)
ఎవరికెవరు ఈ లోకంలో...

జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!
జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కొటిపల్లి రేవుకై!!


చిత్రం: సిరి సిరి మువ్వ( 1978 లొ విడుదల)
సంగీతం: K.V. మహదేవన్ గారు
సాహిత్యం: వేటూరి గారు
పాడిన వారు: S.P. బాల సుబ్రమణ్యం

LinkWithin

Related Posts with Thumbnails