Thursday, February 12, 2009

అక్షరమాల... అమరవాణి - 1

అక్షరాలు..
లక్షల విలువైనవి..
లక్షణంగా మన జీవితాలను తీర్చిదిద్దగలవు..
ఆచరణలోకి తీసుకుంటే.. మన జీవిత గతి లో ప్రగతిని అందించే ఆయుధాలు.. ఈ అక్షరాలు..
మా ఇంట్లొని వివిధ రకాల పుస్తకాల నుంచి సేకరించిన ఈ తెలుగు కొటేషన్స్ ని అమరవాణి గా ఈ టపా లో పెడుతున్నాను.ఇది మొదటి భాగం.. అప్పుడప్పుడు అమరవాణి వినిపిస్తుంటా లెండి..
అటువంటి అక్షరాల అమరవాణి మన కొసం..


1. కాలమే ఉత్తమ గురువు.. ప్రపంచమే ఉత్తమ గ్రంథం..
2. గెలవకపోతే నిరాశ వద్దు. కానీ తిరిగి ప్రయత్నించకపొతే సర్వనాశనం తప్పదు..
3. సృష్టిలో సహజముగా ఉన్నదే అనురాగం. కష్టించి మనం కల్పించుకున్నదే ద్వెషం..
4. అనుభవం లేని చదువు కంటే, చదువు లేని అనుభవం మంచిది..
5. మనసులొ అసూయ కంట్లొ నలుసు లా బాధ కలిగిస్తుంది..
6. ప్రపంచం భిన్నంగా కనిపిస్తుంది కాని అందులో దాగిన తత్వం ఒక్కటే..
7. మనసుంటే మార్గం వుంటుంది, మనస్పూర్తిగా ప్రయత్నిస్తే ఫలితం వుంటుంది..
8. ఆరోగ్యకరమైన వ్యక్తి, కుటుంబ క్షేమానికి, దేశ సౌభాగ్యానికి మూలాధార శక్తి..
9. ద్వెష శక్తి కంటే ప్రేమ శక్తి కోటి రెట్లు ఘనం ..
10. ప్రవర్తన అనే అద్దం లో ప్రతివాడి నిజరూపం ప్రతిఫలిస్తుంది..
11. నాలుక వశమైతే నరులంతా వశమే..
12. కష్టాలు మనిషికి తాను ఎవరో గుర్తు చెస్తాయి..
13. విన్నవన్ని నమ్మకు.. నమ్మినవన్నీ వెల్లడించకు..
14. చేత మన ఆదీనం.. రాత దైవాదీనం..
15. ఆపదలు వచ్చినప్పుడు వాటిని దాటాలంటే ఆలొచన కావాలి..


ఇంకో మంచి టపా తొ మీ ముందుకొస్తా.. ఉంటాను .. ధన్యవాదములు..

16 comments:

పరిమళం said...

good post!

Anonymous said...

Wonderfull!..
very good collection...

KK Naidu

Anonymous said...

బాగుంది మీ బ్లాగు,
క్రియేటివ్ కుర్రొడు బహు బాగు :)

PAVANKALYAN[I.A.S] said...

అక్షరాలు..లక్షల విలువైనవి..లక్షణంగా మన జీవితాలను తీర్చిదిద్దగలవు..ఆచరణలోకి తీసుకుంటే.. మన జీవిత గతి లో ప్రగతిని అందించే ఆయుధాలు

ఇంజినీరింగ్ చదివి ఇరవైనాలుగు గంటల లో జాబు లో జాయిన్ అవ్వాల్సిన వెక్తి జీవిత ఖైదీగా మారి జైలు లో తన జీవితం మగ్గి పోతున్నా బయట ప్రపంచం లో ఎం.సెట్. లో జాతీయ స్తాయి లో పస్ట్ ర్యాంక్ సాధించి తన కుటుంభం ఆర్ధిక పరిస్థితి బాగుండక పోవటంతో ఆ చదువుల సరస్వతి తన తల్లి తో పాటు వరినాట్లు నాటటానికి వెళుతున్న అమ్మాయికి చదువు నిమితం ఐదు లక్షలు రూపాయలు తోటి ఖైదీలు సాయం తో అందిచటం మనం ఊహించ గలమా ?
pavankalyanias.blogspot.com
saar maadhav gaaru meeru raasina aksharaalu lakshala viluvainavi chaala exlent sir

Rajasekharuni Vijay Sharma said...

మంచి సూక్తులు. బాగున్నాయి. ఇందులో మీరెన్ని పాఠిస్తున్నారు? (సరదాకి.. ) :)

Anonymous said...

Very nice post!
Photos are good.

Anonymous said...

chakkati prayathnam... Siva Cheruvu

తెలుగుకళ said...

మనసుంటే మార్గం వుంటుంది, మనస్పూర్తిగా ప్రయత్నిస్తే ఫలితం వుంటుంది...
అనుభవం లేని చదువు కంటే, చదువు లేని అనుభవం మంచిది..

అద్భుతం ! నిజంగా అక్షర లక్షలే............

అభినందనలు.

Anonymous said...

good post.
good collection!

Anonymous said...

సృష్టిలో సహజముగా ఉన్నదే అనురాగం. కష్టించి మనం కల్పించుకున్నదే ద్వెషం.. నాలుక వశమైతే నరులంతా వశమే..

బ్లాగు బాగుంది .

PAVANKALYAN[I.A.S] said...

guruvu gaaru baavunnaara mee blog chaala baavuntundhi meeru baaga rastunnaaru all the best frend

Anonymous said...

good one

Anonymous said...

It was good enough to make me remember my father who is no more. Bless you.

Anonymous said...

Very good post... konni.. marchipothunna.. vishayalu... naaku gurthu chesaru.. Dhanyavaadaalu..

Anonymous said...

అభిప్రాయాలు తెలియచేసిన
అందరికీ పేరుపేరునా ధన్యవాదములు!

మీ
క్రియేటివ్ కుర్రొడు

Anonymous said...

adithya............ nee sukthulu chala bagunnayi,jeevithapu viluvalu unnayi. snehaniki nuvvu ichina nirvachanam chala bagundi.....

LinkWithin

Related Posts with Thumbnails