Saturday, July 16, 2011

తూర్పు కనుమలు - 5: "రాజయ్య కథలు" C/O దివ్య...

ఒక చల్లని సాయంత్రం!
ప్రాంతం: నర్సింగపల్లి, విశాఖజిల్లా

రెండు రొజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానా కాస్త శాంతించింది, చిరు జల్లు కురుస్తుంది, వూరి చివర చిన్న పెంకుటిల్లు లో ఉంటున్న రాజయ్య బైటకి వచ్చి పార భుజాన వేసుకుని ఇంటికి గడియ పెట్టి పెద్దరాజు గారింటికి బైలుదేరాడు.

పెద్దరాజుగారంటే ఆ వూరికి పెద్ద, ఆయనింట్లో పనులు చేస్కుంటూ చాల మంది ఉన్నారు, అలాంటి వాళ్ళలో రాజయ్య ఒకడు, అతనికి ఎవరూ లేరు.

కొన్నాళ్ళు పొలం పనులు చేస్కుంటూ తర్వాత తర్వాత పెద్దరాజుగారి దెగ్గర వుండిపోయాడు. ఎవరు యే పని వుందని పిలిచినా రాజయ్య వెళ్తాడు, అతని జీవితం ఆ వూరికే అంకితం అయిపోయింది. పరోపకారం ఒక గొప్ప వరం అని నమ్ముతాడు రాజయ్య.


ఇంటి వెనకాల తోటలో పని ఉందని ఆ రోజు వర్షం తగ్గితే రమ్మన్నారు పెద్దరాజుగారు, అక్కడ పనిలో ఉండగా రాజయ్యకి ఒక నాగు పాము పిల్ల కనిపించింది, తనతో పాటు ఉన్న మరో కుర్రాడు పాముని చూసి బిగ్గరగా పాము పాము అని అరిచాడు, అందరు అక్కడ గుమిగూడారు, ఈ లోపే రజయ్య ఆ పాముని అక్కడి నుండి తోలేశాడు, చంపకుండా వదిలేసావెంటని రాజుగారు మండిపడ్డారు, చిన్న పిల్ల పాము అని వదిలేసా అన్నాడు రాజయ్య.

అందరూ రాజయ్యని తిట్టారు కాని ఒక్క దివ్య మాత్రం రాజయ్యని వెనకేసుకొచ్చింది, ఆ వూరిలో అతన్ని ఒక మనిషిగా చూసేది పెద్దరాజుగారి అమ్మయి దివ్య ఒక్కతే, తనకి 10 సంవత్సరాలు వయసు! అతను మాత్రం ఒక చిరు నవ్వు నవ్వి తన పని తను చేస్కు పోవడంలో మునిగిపోయాడు.

రాజయ్యకి జాలి ఎక్కువ కానీ ఆ వూరి వాళ్ళు తమ అవసరాలకు అతన్ని ఉపయొగించుకుని వదిలేస్తారు, ఆ విషయం రాజయ్యకి తెలిసినా పట్టనట్టు ఉంటాడు, రాజయ్యకి పెద్దరాజుగారి అమ్మయి దివ్య అంటే అభిమానం, ఆ పిల్లే లోకం, తను రోజూ స్కూలు నుండి వచ్చాక రాజయ్యతో కబుర్లు చెప్తూ గడిపేది, రాజయ్యకి తనే ప్రపంచం.

ఆమెకు బోలెడు కథలు చెప్పేవాడు, ఆ కథలన్నీ ఎంతో చక్కగా కొత్తగా అందముగా వర్ణించి చెప్పేవాడు రాజయ్య, అవి తన జీవిత అనుభవాలను రంగరించి రాజయ్య ఆప్యాయంగా చెప్పే కథలు, దివ్య మనసులో ఆ కథలు బలంగా నాటుకు పోయాయి..

ఒక రోజు పెదరాజుగారి తోటలో పని చేస్తుండగా ఒక్క ఉదుటున కుప్పకూలిపోయాడు రాజయ్య, ఆ సమయంలో పెద్దరాజుగారు కూడా లేరు, విషయం తెలిసి దివ్య పరుగు పరుగున వచ్చింది, రాజయ్యని అలా చుడలేకపోయింది, దివ్య చేయి గట్టిగా అదిమి పట్టుకుని రాజయ్య కన్నుమూశాడు.

15 సంవత్సరాల తర్వాత చిన్న పిల్లలకు కథలుగా, పుస్తక రూపంలో, అంతర్జాలంలో కొన్ని నవ్యమైన కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి, అవి "రాజయ్య కథలు"! ఈ కథలు చాల మందికి ప్రేరణగా నిలిచాయి..

ఆ కథా సంకలనానికి కర్త, కర్మ, క్రియ..
దివ్య... మట్టిలో మాణిక్యాలున్నాయి అని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది
రాజయ్య ప్రాణంగా చూసుకున్న పెద్దరాజుగారి అమ్మయి!

Friday, July 15, 2011

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 14

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
Mobiles used samsung s3310i and fly-sx210 with 2MP కామెరా




Wednesday, June 29, 2011

ప్రేమ చలువే...

మనసు పడినా
మనసు చెడినా
అది ప్రేమ చలువే

విజయ తీరం దరిచేర్చినా
పరాజయపు అగాథాలు చవిచూసినా..
అదీ ప్రేమ చలువే

కాలం కలసివచ్చినా
కాలగర్భంలో కలసిపోయినా
అదీ ప్రేమ చలువే

మోముపై చిరునవ్వులు చిందించినా
ఎరుపెక్కిన కంట నీరు తెప్పించినా
అది ప్రేమ చలువే

అర్థం చేసుకున్నా
అపార్థానికి చేరువైనా
అదీ ప్రేమ చలువే

కల నెరవేరినా
అలగా కరిగిపోయినా
అది ప్రేమ చలువే

ఒంటరిగా ఉన్నా! అందరినీ నీ దరి చేర్చినా
అందరూ ఉన్నా ! నువు ఓంటరి అయినా
అది ప్రేమ చలువే

ప్రపంచమంతా ప్రేమమయమైనా
ప్రేమ ఈ ప్రపంచం నుండి దూరమైనా
అది కూదా "ప్రేమ చలువే"

Friday, June 10, 2011

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 13

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
ఇందులో గ్రాఫిక్స్ లేవు అన్నిమొబైల్ తో తీసినవే
Mobiles used samsung s3310i and fly-sx210 with 2MP కామెరా

A boat in river Gosthani

Crab made art moulds at sea shore

Interior part of a temple chariot

Soil erosion at beach

Reflection of coconut trees, Visakha Dist

Thursday, March 10, 2011

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 12

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
ఇందులో గ్రాఫిక్స్ లేవు అన్నిమొబైల్ తో తీసినవే
Mobiles used samsung s3310i and fly-sx210 with 2MP కామెరా

Dwaraka tirumala

Eleru Reservoir at Yeleshwaram, EG Dist.

Village pond in Visakha dist outskirts

RK Beach, Vizag

LinkWithin

Related Posts with Thumbnails