ప్రేమ అనగానే వెంటనే గుర్తుకోచేది దోమ. సాధారణంగా మనం ప్రాస కోసం చెప్తాం కదా అందుకే తప్ప పెద్ద కారణం ఏమి లేదు లెండి. ప్రేమ అనగానే చాల మంది (అందరు కాదు కొందరు) ఒక ఆడ మగ మధ్య ప్రేమ గానే చూస్తున్నారు (ఆలోచిస్తున్నారు, అనుకుంటున్నారు) కాని ప్రేమ అనేది సార్వత్రికం (జనరల్ లేదా యునివేర్సల్ ) . ఎవరి అభిప్రాయాలూ వాళ్ళవి.
అలాగని నేను ఇప్పుడు ప్రేమ గురించి నిర్వచనం ఇవ్వలేను.
ప్రేమంటే ఇది మాకు తెలుసు అని చెప్పే వాళ్ళు ఉన్నారు.
ప్రేమంటే ఇదా అనే వాళ్ళు కూడా ఉన్నారు.
ప్రేమంటే ఏదో అనుకుని తెగ ఇది ఐపోయే వాళ్ళు ఉన్నారు.
ప్రేమంటే ఇది కాదు ఇంకా ఏదో వుంది అనుకునే వాళ్ళు కూడా వున్నారు.
దీనినే దృష్టికోణం (పెర్సుప్షన్) అంటారేమో. జీవితం, ప్రేమ.. రెండిటికి సంబంధం ఉంది. (ఉంటుంది కూడా) ఎందుకంటే...
జీవితం ఎటు పోతుందో తెలియదు, ప్రేమ ఎపుడు కలుగుతుందో (ఎవరి మీదైనా కాని) తెలియదు.
అలానే అవి రెండు ఎవరికోసం ఆగవు, ఆగితే మాత్రం మళ్ళి ముందుకు సాగవు.
మనిషి జీవితం లో ప్రేమ(సార్వత్రికం) ఒక భాగం. ప్రేమ కోసం ప్రపంచంనైన జయించ వచ్చు అన్నారు ఒకరు. ప్రేమను పంచి ప్రపంచాన్నే జయించ వచ్చు అన్నారు ఇంకొకరు. ఇలా అనుకునే వాళ్ళలో నేను ఒకడినే. ఏదో ఒకటి అనుకోవాలి కదా మరి. నాది వో దృష్టికోణం.
ఇప్పుడు మనం కోణం వదిలి ప్రేమ లేని జీవితం అనే దాని పై దృష్టి పెడదాం.
ప్రేమ లేని జీవితం...... ఇది అసాధ్యం ఒక మనిషికి. ప్రతి మనిషి ఎవరో ఒకరిని ప్రేమిస్తారు( ప్రేమని తీసుకుంటారు కూడా) , ఇటువంటి ప్రేమ బంధం ప్రపంచం లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక మనిషి జీవితానికి ప్రాణ వాయువు ఎంత అవసరమో, ప్రేమ ( సార్వత్రికం) కూడా అంతే అవసరం. తల్లితండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి , బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, సహోద్యోగులు, గురువులు, .... ఇలా అందరి తో మనకి ఉండేది ప్రేమ బంధమే. ప్రేమ విశ్వ వ్యాప్తం ఐనది, దానికి రంగు, రుచి, వాసన ఇవేమీ ఉండవు. ప్రేమ ఒక అనిర్వచనీయమైన, అద్భుతమైన, అనుభూతి. అది మన మనసుకి తెలుసు.
ప్రేమంటే ఏంటో అర్థం కాకపోవడం, ప్రేమను అర్థం చేసుకోక పోవడం, ప్రేమ కోసం దేనికైనా తెగించాలి అనుకోవడం. ఇవి అన్ని మనల్ని మనం సర్ది చెప్పుకొని , సంతృప్తి పడే కారణాలు ...
అర్థం చేసుకో గలిగేంత సులువైన ప్రేమ లో అర్థం కాకుండా ఉన్నది ఏదీ లేదు.
అప్పుడు ప్రేమ లేని జీవితం ఉండదు....
అలానే దోమ లేని జీవితం కూడా ఉండదు. (ఈ రోజుల్లో) అందుకే మనం అందరం మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
మంచిని పెంచుదాం. ప్రేమను పంచుదాం......
6 comments:
మీరు ప్రేమ గురించి చెప్పిన వివిధ దృష్టి కోణాలు బాగున్నయి. కానీ ఆ ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏమిటో స్పష్టంగా చెప్పలేదు.
కలనైనా ఇలనైనా కష్టమైనా సుఖమైనా నీకోసం నేనను భావం ప్రేమ. పాలలో నీళ్లలా కలిసిన మనసులు పలికే రాగం ప్రేమ. అని నా అభిప్రాయం.
ప్రేమ ..
ఏమిటో.. !
అందరూ ఇదే.. విషయం పైన చర్చ చేయడం... గమనించి ఉన్నాం ...!
కొంచెం కొత్తగా ... వ్రాయండి ... ప్లీజ్. ...
మేము మీ అభిమానులం..
- శివ చెరువు
మీరు కూడా ప్రేమ గురించేనా..
బాగుంది..
nice one...:-)
Thank u one and all 4 ur feedback
Creative kurrodu
chaala baga chepparu prema leni jeevitam ledu ani :)
Post a Comment