మౌనం మనసున మంటలై రగిలి మరిగిపొతున్నది
ప్రాణం పొయె బాధతో గుండె కొట్టుకుంటున్నది
గొంతే అందని ప్రేమ కెక వూపిరిని కోస్తున్నది
దారే తొచక చూపు చీకటిని కమ్ముకుంటున్నది
అణువనువున ఆవెదన
వినిపించని ఆలాపన
ఆవేశమై నా శాపమై
ముంచెయద నను నిలువున
యెటు చూసిన ఏం చేసిన
నను వీడదే ఆరాధన
నువు దూరమై ఎద బారమై
మరణించునే ఆలోచన
యెన్ని రాగాలు యెన్ని భావాలు
యెన్ని స్వప్నాలు యెన్ని సత్యాలు
యెల ఇంతలోనె మరచినావె నేస్తమా
యెన్ని మొహాలు యెన్ని విరహాలు
యెన్ని కలయికలు యెన్ని సాక్షాలు
యెల నమ్మలెదొ నన్ను నీవె తెలుపుమ
కదిలె క్షణాలు భారమై నన్ను కదలనీకుండ కట్టేస్తుంటే
యెకాకిలాగ మిగిలానులె గుండెనే కాల్చు మంటలై యెగసి
కనుల కన్నీటిలో తడిమి తాగెసిన
మనసింతగా ఏడ్చినా తెలియదె ఓ ప్రేమ
మౌనం మనసున మంటలై...
కను మూస్తే చాలు నీ జ్ఞాపకాలు
కనిపించి కంటి తెరపై నన్ను
కలతలై లేచి వెంటాడద
ఆశాలే ఆవిరైపోతుంటే
చీకటే ముసిరెనె వెలుతురే ఆరెనె
నను శూన్యమె నిలువున మింగెనె ఓ ప్రేమ
మౌనం మనసున మంటలై . . . .
చిత్రం : జ్ఞాపకం (2007)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం : వరికుప్పల యాదగిరి
గానం : రంజిత్
ఈ పాటని మీరు ఇక్కడ వినవచ్చు
http://www.in.com/music/track-mounam-manasuna-199977.html
14 comments:
This is the one of the best songs I have ever Heard to ..... the music composition and singer voice is brilliant....
Thanks for reminding.. and letting us know.. :)
Siva Cheruvu
Must Listen...
I dont like the song composition. I feel that the music director and singer would have choosen another raaga.
ఎందుకు బాబు మాకు ఈ పాటలు...
పాట చాలా బాగుంది.. నాకు బాగా నచ్చింది..
మీ బ్లాగు కూడా చాలా అద్భుతంగా వుంది. :)
ఈ పాట వినటం ఇదే మొదటిసారి... బాగానే ఉంది.. కానీ మరీ గొప్పగా ఏమి అనిపించలేదు నాకు...
The song is average and there is no feel in it. Lyrics are nice. Good work! :)
srikanth
పాట వినసొంపుగా ఉంది, ఇక్కడ ప్రచురించిన సాహిత్యానికి ధన్యవాదములు!
Nice song! :)
Vijay Kumar
పాట బాగుంది. మీ మార్కు స్పెషల్ ఎఫెక్ట్స్ ఏవి మాధవ్ గారూ !
పాటా భావం బాగుందండీ... అది బాధలో/వేదనలో పాడిన పాట కదా... మరి మ్యూజిక్ భావానికి తగినట్టుగా లేదని నా భావన... కానీ విని పాడుకోడానికి బానే ఉంది.
పాట వింటూ పాడుకోడానికి వీలుగా సాహిత్యం, లింక్ కూడా చూపించినందుకు ధన్యవాదాలు.
nice song man!
Wonderful song! :)
కనిపించి కంటి తెరపై నన్ను
కలతలై లేచి వెంటాడద
ఆశాలే ఆవిరైపోతుంటే
చీకటే ముసిరెనె వెలుతురే ఆరెనె
నను శూన్యమె నిలువున మింగెనె ఓ ప్రేమ
chaala baavundhi marikonni maakosam raayavaa brother
Post a Comment