Monday, March 23, 2009

వెతుకులాట...


ఈ ప్రపంచంలొ వెతుకులాట పలురకాలు..
కొందరికీ ఏమి వెతుక్కోకండానే కారణం దొరుకుతుంది..
కొందరికీ ఏంత వెతికినా ఏమీ దొరకదు..
కొందరు ఇంట్లొ వుండి ప్రపంచాన్ని వెతుక్కుంటారు..
కొందరు ప్రపంచం అంతా తిరిగి తమకు కావలసింది వెతుక్కుంటారు.
గుడి కి వెళ్తే: కొందరు ప్రశాంతతని వెతుక్కుంటారు..
కొందరు ప్రసాదాన్ని వెతుక్కుంటారు..

మన చుట్టు రోజు ఏన్నొ సంఘటనలు జరుగుతుంటాయి.కొన్నిటిలో మనం భాగస్వాములము కూడా అవుతుంటాము.జరిగింది ఏదైనా దానినుంచి మనకి కావలసింది వెతుక్కుంటాం. ఇది నాతొ పాటు అందరూ చేసే పనే..వెతుకున్న దానికి సంత్రుప్తి పడడం మానవ నైజం.వెతుకున్న దానినీ మన దృష్టికొణానికి తగ్గట్టు గా అన్వయించుకుంటం కూడా.

"మనకు జరిగే సంఘటనలకు మనకు తెలియకుండ మనం ఆకర్షింపబడుతుంటాం" అని నా మిత్రుడొకరు అన్నారు. ఆయన మాటల్లొ నిజంగా నిజం దాగుంది. ఆ ఆకర్షణ మనకు తెలియకుండానే కలుగుతుంది, ఆకర్షించడం మన తప్పా, ఆకర్షింపబడటం అవతలి వారి తప్పా అని పక్కికి పెడితే, ఎవరి దృష్టి లొ వారిది సరైనదే అనిపిస్తుంది.

మనలొ ఉన్న సద్గునాలు కూడా ఒకోసారి ఇతరులకు మనపై లేని పోని ఆకర్షణలు కలిగిస్తుంటాయి అని నా భావన.ఆకర్షణ ఎక్కువైనా, వికర్షణ ఎక్కువైనా కష్టమే.

మనం చెసే పనిలొ 3 రకాలు ఉంటాయి, ఒకటి మనకి ఇష్తమైనవి, రెండు అవతలి వారికి ఇష్తమైనవి, మూడవది సరైన పని.మనం సరైన పని చెస్తె ఎవరు గుర్తుంచుకోరు, మనం తప్పు చేస్తె ఎవరు మర్చిపోరు (మనం మర్చిపొతాం ఏమో కానీ) ఇది ఒక రకమైన వెతుకులాట. .

నేను సరైన పనె చేస్తున్నానా అన్నది నా వెతుకులాట ఐతే, నెను తప్పు చేస్తున్నానా అన్నది అవతలి వారి వెతుకులాట. ఇలంటి వింత అనుభవాలు నా జీవితంలొ చాలా జరిగాయి,జరుగుతున్నాయి కూడా...

కొందరు అతిగా పొగుడుతారు, కొందరు అతిగా కించపరుస్తారు, సద్విమర్శ చెసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అని నా మిత్రుడొకరు అంటుంటారు.ఒకరిని పొగిడి వాళ్ళకి అవసరమైన పని కానిచ్చుకుందాం అని కొందరి ప్రయత్నం అయితే, కొందరిని కించపరిచి వారి స్తాయి , పరపతిని పెంచుకొని బలవంతులుగా ఉండాలని ఇంకొందరి ప్రయత్నం, ఇక్కడ కూడా ఎవరికి కావలసింది వారు వెతుక్కుంటారు..

అందుకే ఈ ప్రపంచంలొ వెతుకులాట పలురకాలు..
ఎవరికి కావలసింది వారు సహృదయం తో, విశ్లెషణాత్మక దృష్తితో వెత్తుకుంటే సరిపొతుంది..

ఈ టపాలో మాత్రం వెతుక్కొవడానికి ఏమీ లేదు, నాకు మాత్రం వెతుక్కొవడానికి మీ వ్యాఖ్యలు ఉన్నాయి అంతే( మీరు ప్రచురిస్తేనే లెండి).... :)

13 comments:

శివ చెరువు said...

వెతుక్కున్న వారికి వెతుక్కున్నంత మహా దేవ .. ;)

చైతన్య said...

ఏం కామెంట్ చేద్దామా అని వెతుకుతున్నా

Anonymous said...

ha ha ha :)

Rajasekharuni Vijay Sharma said...

మాధవ్ గారూ... మీ పోస్టుల్లో మొదటి సారి ఈ పోస్టులో... కాస్త గుండె లోతుల్లోంచి వచ్చిన మాటల్లా తోచాయి. అంటే మిగతావి తక్కువని కాదు.. అవి సరదాగా ఉంటాయి. ఇది కాస్త భావుకత ఉన్న పోస్ట్. ఏదో చెప్పాలని ప్రయత్నించారు. అని నాకు అనిపించింది అంతే... బహుశా నేను వెతుక్కున్నది అదేమో...? :)

ఇలాంటివి మరి కొన్ని ప్రయత్నించండి... బాగుంది.. :)

Anonymous said...

ఈ ప్రపంచంలొ వెతుకులాట పలురకాలు.
నిజంగా నిజం చెప్పారండి. చాలా బాగుంది !

పరిమళం said...

"మనం సరైన పని చెస్తె ఎవరు గుర్తుంచుకోరు, మనం తప్పు చేస్తె ఎవరు మర్చిపోరు (మనం మర్చిపొతాం ఏమో కానీ)." నిజమే !

Anonymous said...

nice search

Anonymous said...

మీరు ఏదో పోగొట్టుకున్నారనుకుంట అందుకే ఇప్పుడు తెగ వెతికేస్తున్నారు, వెతుకులాట బాగుంది:)

Anonymous said...

బాగుంది మీ వెతుకులాట!

శివ చెరువు said...

మీకు.. మీ కుటుంబానికి.. విరోధి నామ సంవత్సర ...శుభాకాంక్షలు.. :)

Anonymous said...

chala bagundi mee vetukulata...... meeku virodhinama subhakankshalu...

విశ్వ ప్రేమికుడు said...

మాధవ్ గారూ..
మీకూ మీ కుటుంబానికీ విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు :)

Aditya Madhav Nayani said...

అభిప్రాయాలు తెలిపిన వారందరికి పేరు పేరునా ధన్యవాదములు,
మీకూ, మీ కుటుంబ సభ్యులకు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు!

LinkWithin

Related Posts with Thumbnails