Wednesday, January 13, 2010

హాస్య సార్వభౌమ... హాస్య బ్రహ్మ..

హాస్య బ్రహ్మ జంధ్యాల గారి జయంతి (14 జనవరి) సందర్భంగా ఈ టపా.
ఈ కింది వీడియోలలో జంధ్యాల గారి చిత్రాలలోంచి కొన్ని హాస్య సన్నివేశాలు పెడుతున్నాను.



జంధ్యాల వీర వెంకట దుర్గ శివ సుబ్రమణ్య శాస్త్రి మన హాస్య బ్రహ్మ పూర్తి పేరు. ఆయన మకర సంక్రాంతి రోజున (14 January 1951)నర్సాపురంలో జన్మించారు (19 June 2001న) పరమపదించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు (సాహితి, సంపద). అయన అత్యంత ప్రతిబావంతుడు, అయన చిత్రసీమలో ఒక శకం.



ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించడంలో దిట్ట మన జంధ్యాల గారు, అయన చిత్రాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ రోజు ఉన్న హాస్యనటులలో చాల మందిని జంధ్యాల గారే పైకి తీసుకొచ్చారు అంటే అతిశయోక్తి కాదు.



ఆయనకే గనక 'హాస్య ' బిరుదులు ఇచ్చుకుంటా వెళ్తే ఎడతెగని లిస్టులా ఉంటుంది: హాస్యేంద్ర,హాస్య కిరీటి,హాస్య రత్న,హాస్య సామ్రాట్, హాస్య శేఖర,హాస్య సార్వభౌమ,హాస్య వల్లభ,హాస్య చక్రవర్తి,...............



జంధ్యాల గారి గురించి ప్రెత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు, పైన ఉన్న విడియో క్లిప్పింగులు చూస్తేనే అర్థమవుతుంది. జంధ్యాల గారి గురించి మరిన్ని వివరములకై ఇక్కడ నొక్కండి
జంధ్యాల మనందరి హృదయాలలో ఎప్పటికీ అమరుడే!

2 comments:

జయ said...

ఇన్ని హాస్యసన్నివేశాలు ఒక్క చోటే బాగున్నాయండి. కాని జంధ్యాల లేని లోటు లోటుగానే ఉందనిపిస్తుంది. మీకు సంక్రంతి శుభాకాంక్షలు.

శివ చెరువు said...

yes yes.... you are right...

LinkWithin

Related Posts with Thumbnails