Monday, May 17, 2010

తూర్పు కనుమలు - 1 : ఎవరికి కాని వాళ్ళు?

తూర్పు కనుమలు:

భారత దేశ భౌగోలిక పటంలో అతి పురాతన కొండలు తూర్పుకనుమలు, ఇవి మధ్య మధ్యలొ పీటభూమి కలిగి ఉంటాయి, మన రాష్టృంలో చాలా ప్రాంతాలు ఈ కనుమలతో అనుసంధానమై ఉన్నాయి. ఈ తూర్పుకనుమల ప్రాంతాల్లోని కొన్ని జీవన చిత్రాలకు, సంఘటనలకు నా సృజన కొంత జోడించి ఒక కథా సంకలనాన్ని మీ ముందు ఉంచుతున్నాను, అవే నా " తూర్పు కనుమలు". ఒకొ టపాకి ఒకో కథ.

ఎవరికి కాని వాళ్ళు?

సమయం: సాయంత్రం 5:00
ప్రాంతం: విశాఖపట్నం రైల్వే స్టేషన్

వేసవి సెలువల రద్దీతో రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది, హౌరా నుండి వచ్చిన ఒక రైలులోంచి ఒక నడివయ్స్కుడు దిగాడు అతను చుట్టూ కలియచూశాడు తర్వాత మెల్లిగా బైటకి వెల్లడానికి పాదచారుల వంతెన, ఎక్కుతున్నాడు, అక్కదంతా యాచకులు ఉన్నారు, అతను ఒక ముసలావిడ వద్దకు వెళ్ళాడు, ఆవిడ చేతిలొ 10 రూపయిలు ఉంచి, "మీరు ఎక్కడుంటారమ్మ?" అని అడిగాడు, "నా లోకం ఇదే బాబు, రాత్రికి ఇంత తిని ఇక్కడే పడుకుంట, నాకు ఎవరూ లేరయ్యా" అని దీనంగా చెప్పిండావిడ. ఆవిడ పేరు కనుక్కుని అతను మరొకరి దెగ్గరికి వెల్లాడు, అతనికి ఒక కాలు పై దెబ్బ తగిలి పుదయింది, అది చుపించి దయ తలచమని యాచిస్తున్నాదు, "ఎమైంది?" అని అడిగాడు అతను, రైల్లొచి పడిపోవడంతో ఇల అయిందని, వెన్నుముక పాడైందని, తను ఇలా ఇక్కడే ఆనుకుని ఉంటున్నానని చెప్పాడు, అవటి వాన్నని, భార్య ఇంకెవరితోనో వెల్లిపోయిందని, తను ఎవరు లేక ఇలా వచ్చేశానని చెప్పాడు.

ఇలా అతను ముందుకు వెళ్ళేకొద్దీ యెన్నో గాథలు విన్నాడు, సాంతం ఆలకించాడు, కొందరు పొమ్మని తిట్టారు, కొందరు వారి భాదను చెప్పుకున్నారు, కొందరు ఎమి అనలేక అలా ఉండిపోయారు. అలా అతను రాత్రి 7 గంటల తర్వాత రైల్వే స్టేషన్ నుండి బైటకి వచ్చి ఒక ఆటో ఎక్కాడు, వెంటనే ఒక చిన్న పిల్ల ఒక చంటి పిల్లాడిని సంకన ఎత్తుకోలేక ఎత్తుకుని దానం చేయమని సైగ చేసింది, ఆమెకి 5 రూపాయలు ఇచ్చి, వివరాలు అడగడానికి ప్రయత్నించాడు కాని ఆ పిల్లి జడుసుకుని భయంగా పారిపోయింది. ఆటొ బైల్దేరింది అలా మైన్ రొడ్డెక్కింది. ఆటోలోంచి పరిసరాలని చూస్తు అతను తీవ్రంగా ఆలొచిస్తున్నాడు.

సమయం సాయంత్రం 5:00 ( 3 రోజుల తర్వాత)
ప్రాంతం: విశాఖపట్నం రైల్వే స్టేషన్

కొందరు హడావిడిగా ఈ యాచకుల వద్దకు వచ్చి కొందరి పేర్లు కన్నుక్కుని వాళ్ళని అక్కడినుండి తీసుకువెళ్ళారు, కొందరిని 108లో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కొందరిని స్వయం సహాయక మరియూ ప్రభుత్వ పునరావాస కేంద్రాళకు తీసుకువెళ్ళారు, అందరూ ఆశ్చర్య పోయారు, ప్రభుత్వంవాళ్ళు వచ్చి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తీసుకువెల్లడమేంటని!

మరుసటి రోజు ఉదయం ఒక ప్రభుత్వ వాహనం ఒక పునరావాస కేంద్రానికి వచ్చింది, అందులోంచి నీటుగ అధికార ధర్పం ఉన్న ఒక వ్యక్తి బైటకి వచ్చారు, అలా నడుచుకుంటు వెళ్ళి ఒక ముసలావిడ దెగ్గరికి వెళ్ళీ ఆవిడని ఆప్యాయంగా పేరుతో పిలిచారు, ఆమె అనురాగవర్షిత నేత్రాలతో అతని చూసి ఆశ్చర్యపోయింది, అతను ఎవరో కాదు, స్వయానా ఆ జిల్లా కలెక్టరు, 3 రోజుల క్రితం రైల్వే స్టేషన్లో తనను పలకరించిన సాదాసీదా నడివయస్కుడు.

ఆక్కడ పరిస్తితులని తెలుసుకుని వారిలో యొగ్యులకి స్వయం ఉపాధి చూపించే ప్రయత్నం చేసాడు ఆ కలేక్టర్, తన వంతు ధర్మం నెరవేర్చడానికి ప్రయత్నించాడు, సఫలీకృతుడయ్యాడు. కొన్నాల్ల తర్వాత రైల్వే స్టేషన్లో యాచించుకునే వాళ్ళే అక్కడ గౌరవంగా తమ పని చేసుకుంటున్నారు! ఎవరికీ కాని వాళ్ళు!!

5 comments:

కొత్త పాళీ said...

Interesting.

తూర్పు కనుమల పేరుతో ఇలా ఒక పరంపర రాసే ఉద్దేశమా? తప్పక కొనసాగించండి

మీరు ఈ కథకి ఉపయోగించిన ఫొటో ప్రదీప్ అనే బ్లాగరు తీసినది. ఆఅన ఇదివరకు బ్లాగు నడిపేవారు, ఇప్పుడు రాస్తున్నారో లేదో తెలీదు.

భావన said...

వెయ్యి మాటలెందుకు ఒక మానవత నిండిన చర్య చాలు అని మదర్ థెరీసా మాట గుర్తొచ్చింది. మంచి విషయం రాసేరు. ఇంకా ఇలాంటివి మీ కలం నుంచి వస్తాయని అనుకుంటూ..

శివ చెరువు said...

baaraasavvayyaa Madhav.. Very well done and I am Glad to see your post today ;)

Rajasekharuni Vijay Sharma said...

మేమింకా మొదలు పెట్టని ప్రయత్నం మీరు ప్రారంభించారు. సంతోషం.

Rao S Lakkaraju said...

మనలో బాధ్యతాయుతంగా మంచి చేసే వాళ్ళు ఉన్నారని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. చక్కటి పోస్ట్.

LinkWithin

Related Posts with Thumbnails