Wednesday, October 27, 2010

మలినం!

వీచే చల్లని గాలి మలినం
పూచే అందమైన పువ్వు మలినం

గల గల పారే ఏరు మలినం
నదిలో ప్రవహించే నీరు మలినం

తడిచే నేల మలినం
పండే చేను మలినం

తినే కూడు మలినం
అరాయించే కుక్షి మలినం

ప్రపంచాన్ని చూసే కళ్ళు మలినం
ప్రాపంచిక విషయాలకై వళ్ళు మలినం

మనిషి యుక్తి మలినం
దేవుని పై భక్తి మలినం

ఎన్ని మలినమైనా మనసు పవిత్రం..
ఆత్మసాక్షాత్కారానికి అదే మార్గాదర్శకం..

5 comments:

KIRAN said...

nice one

శివ చెరువు said...

ప్రపంచాన్ని చూసే కళ్ళు మలినం
ప్రాపంచిక విషయాలకై వళ్ళు మలినం

This one is great.

పరిమళం said...

మనసు పవిత్రమైతే ప్రతిమనిషికీ
మలినాలన్నీ మరుగైపోవా ....
బావుందండీ కవిత !

Anonymous said...

baundi malinamaina kavita :)

Anonymous said...

chala baga rasaru...

LinkWithin

Related Posts with Thumbnails