Monday, February 7, 2011

ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు అవసరమా?


ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు అవసరమా!

మన దేశంలో రొజుకో రాజకీయ పార్టీ పుడుతుంది, రాజకీయాల్లొకి వచ్చిన ప్రతివాడు చేప్పే మొదటి మాట ప్రజా సేవ!

అది ప్రజలపై ప్రేమ కాదు ప్రజా ధనం పై ఉన్న వ్యామోహం అని నాకు అనిపిస్తుంది. నిజంగా సాటి మనిషికి సేవ చేయడానికి మనసున్నా మనిషైతే చాలు అని నా భావన. మన ఏపీ లో ఒక ప్రముఖ కథానాయకుడు రెండున్నారెళ్ళ క్రితం కొంప మునిగిపోయినట్టు ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, సేవ చేయడానికే అన్నాడు, మొత్తానికి ఎన్నికల్లో తుస్సు మని 18 సీట్లతో గట్తెక్కాడు, ఇప్పుడు మల్లి అధికారంలో ఉన్న జాతీయ పార్టీలో తన పార్తీనీ విలీనం చేసాడు.

ఇక్కడ విశేషం ఎంటంతే తను ఇప్పటికీ ఎటువంటి సేవ కార్యక్రమాల జోలికి వెళ్ళిన దాకలాల్లెవు అని నాకు అనిపిస్తుంది. ప్రస్తుత విభిన్నమైన పరిస్తితులలో యే రాజకీయ నాయకుడు కూడా సరి అయిన వాడు లేడు, అందరు ప్రజా ధనాన్ని మింగేయడమే పనిగా ఉన్నారు.

ఉద్యమాల పేరుతో కాలం వెళ్లదీసి కొన్ని ప్రాంతాల మధ్య వైరం పెంచి, బెదిరింపులు చేస్తూ దర్జాగా బతుకుతున్నారు, ఇలాంటి వారు మొత్తం ఏపీలో అంతటా వ్యాపించారు.

ఒకడేమొ నదిలో ఇసకని దర్జాగా దొచేస్తాడు,
ఇంకొకడు కొండలని పిండి చేసి అమ్ముకుంటాడు,

ఒకడేమొ భూ దందాలు చేస్తాడు,
మరొకడు కబ్జాకోరుగా మారతాడు,

ఒకడేమో యాత్రలని వాడు దాచుకున్న ప్రజా సొమ్ముని విరివిగా కర్చుపెడతాడు

ఎంతసేపు మనకెంత అని చూసుకునే వాదే తప్ప, జనాలకి ఏం చేద్దం అనేవాడే ఈ రొజులలో కరువయ్యాడు, అదేదో సినిమాలో చెప్పినట్టు ప్రజలు నాయకుల గురించి ఆలొచించటం మానేసారు, ఈ రోజులలో డబ్బు ఉన్నవాడిదే రాజ్యం, నిజంగా సేవ చేయాలనుకుని వచ్చే కొందరు నాయకులు నలిగిపోతున్నారు...అన్నిరకాలుగా..

ఎంత జరిగినా మనం మళ్ళి ఎవరో ఒకర్ని ఎన్నుకోక తప్పదు ఎందుకంతే మనది ప్రజాస్వామ్యం..
తప్పదు ...

మనకి తోచిన రీతిన తోటివారికి సాయపడటం మానవ ధర్మం, దానికి రాజకీయాలు అవసరం లేదు, మంచి మన్సుంటే చాలు..

6 comments:

Anonymous said...

లోక్సత్తా వుందిగా. ఎందుకంత నిరాశ. మంచిమనసుతో ఒక రాజకీయ పార్టీలొ ఇంకా ఎక్కువే చెయ్యొచ్చు

Anonymous said...

even loksatta is unable to do anything, JP is trying to do something but its not getting the way

Change Maker said...

మనకి తోచిన రీతిన తోటివారికి సాయపడటం మానవ ధర్మం, దానికి రాజకీయాలు అవసరం లేదు.
--------------------------------
That is really true. But if you want to make a difference for lot of people, politics is the option.

రాజకీయాల అవసరం చాలా ఉంది. రాజకీయాలలో మంచి వారి అవసరం ఇంకా ఉంది. System is corrupt now from top to bottom. But things will change. Who expected a revolution in an autocratic dictatorial egypt.

New generation who is seeing the world, will work for changes in the system.

Please www.bighelp.org

Anonymous said...

chala baga cheparu...

Prasanna Dommu said...

మీరన్నది నూటికి నూరు పాళ్ళు నిజం. కానీ వ్యవస్థని తుప్పు పట్టించి, పందికొక్కుల్లా దేశాన్ని దోచుకుంటున్న ఈ నాయకులని ఎన్నుకున ప్రజలే కదా...?? మార్పు రావలసింది మనలోనే, ఎవరి స్వలాభాలు వాళ్ళు చూసుకుంటూ యువత అందరూ దేశాన్ని ఈ పందికొక్కులకి వదిలేసి వెళ్ళిపోతే ఇక ఏమవుద్ది చెప్పండీ?

శివ చెరువు said...

every one knows problem. Give it a solution dude.

LinkWithin

Related Posts with Thumbnails