టివి మన జీవితం లొ ఒక భాగం ఆయిపొయిన ఈ రొజులలొ వార్తా ప్రసారాలు కూడా ఆ భాగం లొ అంతర్భాగం లా కలసిపొయాయి, విడదీయరానంతగా పెనవేసుకుపొయాయి. అన్నిటిలొ రకరకాలు ఉన్నటే వార్తలలొ కూడా రకాలు ఉన్నై...
న్యూస్..
ఆర్డినరీ న్యూస్...
లో-ఇంతేన్సితి న్యూస్..
ఫ్లాష్ న్యూస్...
బ్రేకింగ్ న్యూస్..
వార్తలలొ మహారాజు ఈ బ్రేకింగ్ న్యూస్. దీని పై నేను అల్లుకున్న ఒక ఊహ మీ కోసం...
సరదాగానే తప్ప ఎవరిని ఉద్దేశించినది కాదని మనవి..
శుక్రవారం రాత్రి ఆఫీసు నుంచి లేట్ గా వచ్చి ఇంత తిని పడుకున్న.. అలసిపోయి ఉన్నానేమో మంచి నిద్రలోకి జారుకున్న.. పొద్దున్నే నిద్ర మత్తు లో పక్క మీద అటు ఇటు మేసులుతున్న.. ఇంతలొ నాన్న గారు వచ్చి టీవీ పెట్టారు.. అలా ఛానల్ మారుస్తూ న్యూస్ ఛానల్ పెట్టారు.. "అరె లేచి అటు చూడు చూడు.." అని అన్నారు.. పొద్దున్నే ఎంతా అని పక్క మించే టీవీ కేసి చూసాను.. టీవీ లో న్యూస్ రీడర్ ఇలా చెబుతోంది ...
"రాష్ట్ర రాజధాని లో సంచలనం..." అని పరుగు పెడుతున్న జనాలని, హడావిడిగా ఉన్నా రోడ్లని చూపిస్తున్నారు.. స్క్రీన్ కింద ఎర్రటి బక్ద్రోప్ లో ....
బ్రేకింగ్ న్యూస్..
హైదరాబాద్:
రాష్ట్ర రాజధాని లో సంచలనం.
ఏం జరిగిందో అని ఒకింత ఆత్రం, ఒకింత ఆందోళన, ఒకింత అసహనం తో కళ్లు రుద్దుకుని టీవీ కేసి మల్లి చూసా..
జంతు జాలం లో పొంగిన భక్తీ భావం..
ఆలయాల వద్ద క్యు కట్టిన జంతువులు, పక్షులు..
అని ఆ ఎర్రటి బక్ద్రోప్ ఆగింది.. (ఆ తర్వాత అది వస్తూనే ఉంది). పైన స్క్రీన్ పై ఒక ఆవును, ౨ గేదెలను, ఒక కాకిని, రకరకాల బంగిమల్లో చూపిస్తున్నారు.. ఆ పక్కనే ఏదో గొట్టం లోంచి మాట్లాడినట్టు.. ఒక ప్రతినిధి(న్యూస్ ఛానల్) ప్రత్యక్షంగా వీక్షించింది వివరిస్తున్నాడు..
"ఇక్కడ బంజారా హిల్స్ లో శ్రీ శారద దేవి ఆలయంలో పొద్దుటి నుండి ఐదు ఆవులు, మూడు కుక్కలు, ఒక దాని వెనుక ఒకటి ఆలయ ద్వాజస్థంబం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నై, సంధ్యా!.. అలానే ఇప్పుడే ఒక చిన్న పిల్లి కూడా ఆలయం లోకి వచ్చింది , సంధ్యా!.. దాని తోక ని పట్టుకుని చిట్టి ఎలుక ఒకటి కూడా గుడి లోపలికి వచ్చింది , అలానే అది వినాయకుడి మండపం ముందు కుర్చుని కళ్లు మూస్కుంది, సంధ్యా!.. ఇక్కడ పొద్దుటి నుండే ఈ వింత చూడడానికి జనాలు తండోపతండాలు గా వస్తున్నారు , రోడ్ మీద ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది ఇక్కడ, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి, ఆ ట్రాఫిక్ సందు ల్లోంచే రెండు పంది పిల్లలు ఇప్పుడే ఆలయం లోకి ప్రవేశించాయి , సంధ్యా!.."
"బాలు, ఇంతకీ ఈ వింత ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో వివరాలు తెలిసాయా ? " అని అడిగింది సంధ్యా(న్యూస్ రీడర్) . "కారణాలు ఐతే ఇప్పటి వరకు ఏమి తెలియలేదు కాని ఈ సంఘటన పై భిన్న అభిప్రాయాలూ వెల్లడి అవుతున్నాయి , సంధ్యా!.. ఇక్కడ చాల మంది ఇది దైవ శక్తి అని అలానే ఇంకొందరు కలియుగాంతం కిది సూచనా అని, చాల మంది చాల రకాలుగా చెబుతున్నారు, సంధ్యా!.." అన్నాడు బాలు(ప్రతినిది) ...
ఈ లోపు మల్లి స్క్రీన్ పై ఎర్రటి రంగు బక్ద్రోప్ లో ...
బ్రేకింగ్ న్యూస్...
మియాపూర్ రామాలయం లో..
ప్రదక్షిణాలు చేస్తున్న తొమ్మిది కోతులు..
మూడు గొర్రెలు, ఒక గాడిద ...
జనసంద్రం తో స్తంభించిన ట్రాఫిక్..
ఈ లోపు పైన స్క్రీన్ పై న్యూస్ రీడర్ ఇలా అంటుంది.." రాష్ట్ర రాజధాని లో జరుగుతున్నా ఈ వింత సంఘటనల పై ప్రస్తుతం మా విలేఖరి ఆల్వాల్ నుండి ప్రత్యక్ష ప్రసారం చూపిస్తున్నారు.."
అక్కడ గుడి బైట హడావిడి గా తిరుగుతున్న జనం, లోపల ధ్వజస్తంభం వద్ద బిక్కి బిక్కి మంటూ మెల్లగా తిరుగుతున్న రెండు కుక్క పిల్లలు, వాటి పక్కనే ఒక పెద్ద గ్రద్ద కుర్చుని ఉంది ..వాటి పై వచ్చిన జనాలు పూలు జల్లుతున్నారు, పూజలు చేసి హారతులు ఇస్తున్నారు.. అంటా గందర గోళం గా ఉంది.. పొద్దునే ఈ గోల ఏంటి రా అనుకుని ఇంకో ఛానల్ మార్చాను (నాకు ఉత్సాహం ఆగదు కదా వేరే ఛానల్ వోడు ఏమి చుపిస్తాన్నదో అని). ఇంకో ఛానల్ ఈ జంతువుల వింత ప్రవర్తన పై ఒక చర్చ కార్యక్రమం లాగా ఉంది..
" హైదరాబాద్ లో జంతువుల వింత ప్రవర్తన పై చర్చ కార్యక్రమం మీరు ఇప్పుడు చూస్తున్నారు" అని అన్నాడు న్యూస్ రీడర్.. అక్కడ ముగ్గురు కుర్చుని ఉన్నారు.. అక్కడ ఉన్నా వాళ్ళలో ఒకరు వేతెర్నరీ డాక్టర్ అంట ఇంకొకళ్ళు పండితులు, మరొకరు నాస్తిక సంఘం సెక్రటరీ అని న్యూస్ రీడర్ చెప్పాడు.. " మీరు చెప్పండి ఈ రోజు మనం చూస్తున్న ఈ వింత కు కారణం ఏమిటి అంటారు , అసలు ఇది ఎలా జరుగుతుంది..." అని అడిగాడు న్యూస్ రీడర్...
"ఇది ఒక పబ్లిసిటీ స్టెంట్ అంతే అన్ని ఆలయాల దెగ్గర ఇలా లేదు, ఏదో కొన్ని వాటి దెగ్గర మాత్రమె హడావిడి అంటే, ఇది కావాలని చేసిందే అనుకుంటున్నాను తప్ప, వింత లేదు విపరీతము కాదు.. " అన్నారు నాస్తికులు గారు.. " అలా కాదండి దైవ శక్తి ఎక్కడ ఎక్కువగా ఉందొ అక్కడికి మూగ జీవాలు వస్తున్నై, వాటిల్లో భక్తి పొంగింది.. " అన్నారు పండిత వర్యులు
"లేదండి ఇది జంతువులలో వచ్చే అరుదైన వ్యాధి లక్షణం, పోల్లుషన్ వల్ల దీని బారిన చాల జీవాలు పడి వుండచు, అంతకు మించి దీని పై హడావిడి చేసేయల్సిన అవసరం లేదు" అన్నారు డాక్టర్ గారు.. వెంటనే శాస్త్రి గారు మాట్లాడేలోపు
న్యూస్ రీడర్ మల్లి అందుకున్నాడు.." ఇప్పుడు మనం మియాపూర్ రామాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం .." ఒక వైపు చర్చ సాగిస్తున్న జనాలు, ఇంకో వైపు దర్జా గ తిరుగుతున్న జంతువులు, వాటికి దూరంగా జరిగి చూస్తున్న జనాలు, మల్లి టీవీ స్క్రీన్ పై ఎర్రటి బక్ద్రోప్ లో వస్తుంది ఇలా...
బ్రేకింగ్ న్యూస్:
హైదరాబాద్:
గుంపులు గుంపులు గా తిరుగుతున్న జంతువులు..
అడ్డ దిడ్డంగా రోడ్ల పైకి జంతువులు..
ఎక్కడికక్కడే స్తంభించిన ట్రాఫిక్..
అవస్థలు పడుతున్న జనాలు , పోలీసులు ..
రంగం లోకి ప్రేత్యేక దళాలు.. ?
స్క్రీన్ పై చూపిస్తున్నాడు, రొడ్డు పై తిరుగుతున్న గీదేలు, ఆవులు, కుక్కలు, కోళ్ళు, మేకలు,... కాకులు.. ఇలా రకరకాల జంతు జాలం తో పాటు ట్రాఫిక్ లో ఇర్రుకున్న జనాల తో కూడా రొడ్డు కిక్కిరిసింది.. అంత పోటి పది పరుగేట్టుతున్నట్టు ఉంది , మనుషులకి జంతువులకి ఏదో కంపెతిషన్ లాగా ఉంది పరిస్థితి..
ఈ లోపు గర్ర్.. గర్ర్ర్.. అని శబ్దాలు రావడం తో టీవీ సరిగా రావటంలేదు.. ఇల్లంతా అడిరినట్టు చెవులు దద్దరిల్లి పోయేలా ఆ శబ్దం పెరిగి పెద్దది aయింది.. "అబ్బా" అని చిరాగు గా అరిచాను.. మంచం మీద తల పక్కకి తిప్పాను శబ్దం ఇంకా ఎక్కువైంది, అక్కడ మా అమ్మ గారు మిక్సిఆన్ చేసారు అది శబ్దం..
అప్పుడు కల లోంచి ఇల లోకి వచ్హాను..
ఎదురుగుండా టీవీ ఆఫ్ చేసి ఉంది..
నానా గారు బైట పేపర్ చూస్తున్నారు..
గబ గబా వెళ్లి టీవీ ఆన్ చేశాను..
అక్కడ ఏమి రావట్లేదు... ఎందుకంటె మాకు కేబుల్ ముందు రొజు రాత్రి నుండె రావట్లెదు అంట....
అమ్మ చెప్పింది, ఇది నాకు అసలైన ...
బ్రేకింగ్ న్యూస్...
5 comments:
టీ.వీ. వార్తలకు వస్తువు కానిదేమున్నది? వాళ్ళకు హడావిడి చెయ్యడానికి ఏదోవొకటి కావాలిగా మరి..? వాళ్ల రేటింగు పేరిగేదెలా..? :)
ఇది వ్యంగ్యంగా వివరించడంలో సఫలీకృతులయ్యారు. అభినందనలు.
బాగుంది...:)
Meericchina.. mugimpu chakkagaa undani pinchindi...
Inkaa inkaa oohinchandi...
All the best
Siva Cheruvu
ok not bad..
Carry on! All the best!..
nice.. :-)
Post a Comment