కూకట్ పల్లి కథలు - 1
కూకట్ పల్లి కథ సమాహారం కేవలం వినోదం కోసమే, ఇక్కడ పాత్రలు అన్ని కల్పితాలే.
విజయరాజ్ కి కోత్తగా పెళ్లైంది , హైటెక్ సిటీ లో మంచి ఉద్యోగం మొన్నటి దాక అమీర్పేట లో రూం. ఇప్పుడు ఆఫీసుకి దెగ్గరగా ఉంటుందని కూకట్ పల్లి పై కన్నేసాడు. ఇల్లు కోసం తిరిగాడు ఒక నెల , మొత్తానికి JNTU దగ్గర నిజాంపేట్ రోడ్లో ఇల్లు దొరికింది. అది ఒక అపార్ట్మెంట్ లాంటిది( చిన్న సందులో వెలసిన బహుళ అంతస్తు భవనం). మొత్తానికి కొత్త ఇంట్లో కొత్త కాపురం మొదలెట్టాడు మన రాజు. మహా నగరంలో షరా మాములే అయిన నీటి ఎద్దడి మొదలైంది, ఇంటి ఓనరు నీటికి XTRA డబ్బులు వసూలు చేసాడు, మనవాడికి తప్పలేదు, ఇవన్ని ఎక్కడైనా ఒకటే అనుకున్నాడు. ఆఫీసుకి వెళ్ళడానికి ఒక బండి కొన్నాడు ( ఆర్ధిక మాంద్యం వల్ల ఆఫీసువాళ్ళు కాబ్ సర్వీసు ఎత్తేసారు)
మహా ఐతే పావు గంటలో ఆఫీసులో ఉంటాం అని మొదటి రోజు బైలుదేరాడు. సందులోంచి నిజాంపేట్ రోడ్ మీదకి వచాడు అంతే , అక్కడి నుండి అడ్డదిడ్డంగా వాహనాలు, ఎటు వెళ్ళాలన్న దారి లేదు , అప్పటికే ఎలాగోలా బైట పడి మెయిన్ రోడ్ ఎక్కాడు, అక్కడి నుండి JNTUమీదుగా హైటెక్ సిటి కి మళ్లాడు, రైల్వే లైన్ వద్ద మళ్ళి ట్రాఫిక్ సందడి మొదలు, అక్కడ ఒక flyover కడుతున్నారు ( విజయరాజ్ ఉద్యోగంలో చేరిన కొత్తలో అది కట్టడం మొదలైంది, అతను ఉద్యోగంలో చేరి 2ఏళ్ళు అవుతోంది). పావుగంటలో వెళ్ళాల్సిన మనవాడు ముప్పావుగంటలో చేరాడు ఆఫీసుకి. మళ్ళి సాయంత్రం ఇంటికి బైలుదేరాడు, ఇప్పుడు ఇంటికి రావడానికి గంట పట్టింది. కొన్ని రోజులు చూసాడు , మరో మార్గం ఎమన్నా ఉందా అని అన్వేషణ ప్రారంభించాడు, అతని శ్రమ ఫలించింది ఒక రూటు దొరికింది.
అ కొత్త రూటులో ప్రయాణం బానే ఉంది, టైము కలిసోచింది కానీ మనవాడి కొత్త బండి పాడు అయింది , మొత్తానికి విజయరాజ్ కి చికాకు పెరిగింది, రోడ్ మీదకు వెళ్ళాలి అన్నా బండి నడపాలి అన్నా ఒక రకమైన అసహ్యం కలిగింది. సెలవ రోజు వస్తే ఇంట్లోనే ఉంటున్నాడు , సరదాగా బైటకి వెళ్దాం అని వాళ్ళ ఆవిడ అడిగితే ధూమ్ ధాం అని కాసురుకుని ఇంట్లో కంప్యూటర్ ముందు కాలక్షేపం చేస్తున్నాడు, పెళ్ళైన కొత్తలో సరదాలన్నీ ఎగిరిపోయాయి, బండి అమ్మేశాడు, ఒక కారు కొన్నాడు , ట్రాఫిక్ అస్తవ్యస్తానికి తను ఒక సమిధ అయ్యాడు, మొత్తం రూటు మార్చేసాడు(తప్పలేదు) . ఒక సంవత్సరం తర్వాత చెన్నై వెళ్ళిపోయాడు మన విజయరాజ్, అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో....