ఈ పిలుపుకి అర్హురాలు నిస్సందెహంగా ఒక్క మథర్ తెరిస్సా అని నా అభిప్రాయం.. ఎందుకంటె ఆవిడ ప్రపంచనికే కరుణను పంచిన అమ్మ.చిన్నపుడు నేను స్చూల్లొ చదువుకున్నపుడు గుర్తు మథర్ తెరిస్సా పాఠం.ఆవిడ భారత పౌరసత్వం పొందిన ఒక అల్బేనియన్ రోమన్ కాథొలిక్ నన్.
మథర్ తెరిస్సా (ఆగష్టు 27, 1910 – సప్టెంబర్ 5, 1997), అసలు పెరు ఆగ్నస్ గొంక్షా బోజాక్షూ ,దయా, ప్రేమ, వినయం, స్నేహం వంటి సుగుణాలను అగ్నస్ పుణికి పుచ్చుకుంది. దీన జనులకు సాయపడాలనే ఆమె తపన అందుకే 17 సంవత్స్రాల చిరు ప్రాయం లొ ఆవిడ మిషినరీస్ లొ చేరారు.ఆ మిషినరీస్ భారతదెశం లొ పనిచేయుచున్నది(బ్రిటిష్ పాలన లొ) అక్కడ తెరిస్సాగా పేరు మార్చుకుంది, మిషినరీస్లొ టీచర్ గా పని చేశరు 1944 వరకు. "ఇది కాదు నేను చేయవలసింది, కాని చేయవలసిన దాని కొసం యెటు వెల్లలి, యెలా" అని అనుకుని కలకత్తా పయనం అయ్యరు.కలకత్తా మురికి వాడలలో పాఠశాల ప్రరంభించారు పేద పిల్లలకి చదువు చెప్పారు,అనారొగ్యులకు సపర్యాల తొ పాటు వైద్యం కుడా చెసేవారు మథర్, దిక్కు మొక్కు లేని అనాధలకు పెద్ద దిక్కు అయ్యారు మథర్.
అలా అలా 1950లొ మిషినరీస్ ఆఫ్ చారిటీ కోల్ కట (కలకత్తా) లొ ప్రారంభించారు మథర్ తెరిస్సా 1952 లొ 12 కేంద్రాల నుండి కరుణామృతమైన ప్రేమను పంచుతూ ప్రపంచ్వ్యాప్తంగా 450 కేంద్రాలకు పెరిగింది మిషినరీస్ ఆఫ్ చారిటీ. 1979 లొ నొబెల్ శాంతి బహుమతి పొందిన మథర్ తెరిస్సా, ఆ బహుమతి మొత్తం అయిన $6,000 ని కలకత్తా లొని మురికివాడలకు దానం ఇచ్చారు, ఈ మోత్తాన్ని ఉపయొగించి కొన్ని 100ల మంది ఆకలి తీర్చచ్చు అన్నారు మథర్.1994లొ అమెరికాలొ జరిగిన ఒక సదస్సు లొ గర్భవిచ్చిన్నత (అబొర్షన్)ని వ్యతిరేకించారు,"పుట్టబొయే బిడ్డను చంపొద్దు, మీకు భారమైతే ఆ బిడ్డ నాకు కావలి, దేవుని ప్రసాదంగా చూసుకుంటాను, నాకు ఇవ్వండి" అన్నారు.
ఆవిడ ఎప్పుడూ ప్రెత్యేక అకర్షణగా నిలవాలని అనుకోలేదు, ప్రాపంచిక సుఖాల గురించి ఆవిడ యేనాడు అలొచించలేదు ఎందుకంటె ఆవిడ ఎంచుకున్న మార్గం నిస్వార్ధమైన సెవా మార్గం.ఆవిడ భౌతికంగా ఇప్పుడు మనతో పాటు లేకపొయినా కాని, ఆవిడ ఉనికి మనకి ఒక అద్బుతమైన అనుభూతిని ఇస్తుంది, ఈ ప్రపంచమునందు ఆవిడ తన వంతు ధర్మాన్ని నెరవేర్చింది.ఇందులొ అసలు సందేహం లేదు.
ఆవిడ మహొన్నత మానవతావాది, ఎందరికో స్పూర్తిప్రధాతగా నిలిచింది..ఆవిడ భగవంతుని ప్రేమను ప్రత్యక్షముగా పంచడానికి వచ్చిన కరుణామయి."నువు 100 మంది ఆకలి తీర్చలెకపొతే ఒక్కడి ఆకలినయినా తీర్చు" అని అంటారు మథర్ తెరిస్సా. ఆవిద ఎన్నొ దేశాలు తిరిగి నిస్వార్థ సేవలను అందించారు.. ఆవిడ ప్రెమమయమైన కరుణకు ఎల్లలు లేవు.
క్రిష్టమస్ సంధర్భముగా బ్లాగు మిత్రులందరికీ శుభాకాంక్షలు.
నేను బ్లాగులోకం లో ప్రవేశించి ఒక సంవత్సరం అయింది నేటితో, ఎల్లప్పుడు నా వెంట ఉంది నన్ను ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకి శ్రేయోభిలాషులకి, వ్యాఖ్యలు చేసిన అభిమానులకి నా ధన్యవాదములు. నా వెన్నంటి నిలచిన స్నేహితులు, తోటి బ్లాగర్లు అయిన శ్రీ శివ చెరువు గారికి, శ్రీ రాజశేఖరుని విజయ్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదములు, నా ప్రియ సోదరికి ఈ టపా అంకితం!
మీ
నాయని ఆదిత్య మాధవ్ ( క్రియేటివ్ కుర్రోడు)
2 comments:
మాధవ్ గారు , బ్లాగ్ వార్షికోత్సవ మరియు క్రిష్టమస్ శుభాకాంక్షలు ! ఈ సందర్భం లో మంచి టపా రాశారు
Happy Anniversary & nice post :)
Post a Comment