Monday, February 1, 2010

గుర్తుకొచ్చింది..... ఓ మంచి పాట - 4

హె హె హె హె హె హె హె.. రు రు రు రు రు రూ రు రూ..

పల్లవి:
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్!
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్!
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడ పెళ్ళిలాంటిదే బ్రదర్
సాపాటు...(1 సారి)

చరణం 1:
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడా
మన కిర్తి మంచు కొండరా
డిగ్రీలు తెచ్చుకొని చిప్పచేత పుచ్చుకొని
ఢిల్లికి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్
సాపాటు...(1 సారి)

చరణం 2:
బంగారు పంట మనది మున్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లొ ఈగల్ని తోలుదామురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
అవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలొ మునకేసి కాషాయం కట్టెయి బ్రదర్
సాపాటు...(1 సారి)

చరణం 3:
సంతాన మూలికలం సంసార బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ
సంపదనొకటి కరువురా
చదవేయి సీటులేదు చదివొస్తే పనీలేదు
అన్నం ఓ రామచంద్రా అంటే పెట్టేదిక్కేలేదు
దెవుడిదే భారమని పెంపు చెయరా బ్రదర్

సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్..

చిత్రం: ఆకలి రాజ్యం( 1980 లొ విడుదల)
సంగీతం: M.S. విశ్వనాథన్ గారు
సాహిత్యం: ఆత్రేయ గారు
పాడిన వారు: S.P. బాల సుబ్రమణ్యం

LinkWithin

Related Posts with Thumbnails